Pages

Wednesday, December 29, 2010

new year

 ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం  మొదలవబోతోంది.
మన రాజధాని లో అందరి మనసులో ఒకటే అనుమానం."గొడవలు  జరుగుతాయట...ఎలా వుంటుందో ఏమో" 
ఎంతో అద్భుతం  అయిన ప్రగతి పధం లో వెళ్ల వలసిన  రాష్ట్రం ...ఎంతో సంస్కృతి  చరిత్ర కలిగిన ప్రజలూ భాష  సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం మనది.ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళినా మనకు  తెలుగు వాళ్ళు కనిపిస్తూనే వ ఉంటారు.ఉన్నతమైన  సంస్కారం కల జాతి మనది. ఇలా రెండు  సంవత్సరాల నుంచి మనం మనలో పోట్లాడు కుంటూ తిట్టు కుంటూ ఉన్నాము .రెండు రోజుల తరవాత ఏమి జరుగుతుందో అనే  ఈ స్థితి   ఎన్నాళ్ళు?ఎవరో పరభాషా సంస్కృతి కి చెందిన కేంద్ర ప్రభుత్వ కమిటీ  లు మన బాధ ని ఎలా అర్ధం చేసుకుంటాయి? లేక నిజం గానే  ఈ సమస్య కి త్వర లో నే అందరికీ ఆమోద యోగ్యం అయిన  పరిష్కారం దొరుకుందా?  భగవంతుడిని ప్రార్దిద్దాము .
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Saturday, December 25, 2010

kotha samvatsaram

కొత్త సంవత్సరం వస్తోంది.ఏమి జరుగుతుందో అనే భయం  అంతర్గతం  గా  అందరికి వుంది.రోడ్లు  బ్లాక్ చేస్తారా?జన జీవనం  స్తంభింప జేస్తారా? కొత్త సంవత్సరం లో రాష్ట్ర విభజన జరుగుతుందా ? అంతా  సస్పెన్సు గా వుందంటే  నమ్మండి.అన్నిటి కంటే  యూస్ లెస్  శాస్త్రం  జ్యోతిషం  అని అనిపిస్తోంది.ఎంత గొప్ప జ్యోతిష్కుడు అయినా  చెప్పలేని భవిష్యతు  మనది .మన తెలుగు దేశానిది. అందరికీ ఆమోగ్యం అయిన  పరిష్కారం ఏమయి ఉంటుంది సార్?  చెప్పండి!  ఏది చేసినా ఎవరో ఒకరికి  కోపం రాక తప్పదు.
వేచి చూద్దాం. 

Monday, December 13, 2010

manch maaTa

నిన్ను నువ్వు నమ్మక పోతే  నువ్వు నాస్తికుడి వి.దేవుడిని నమ్మక పోతే కాదు.నీలో నీకు నమ్మకం లేకపోతేనే అది నిజమైన  నాస్తికత.......వివేకానంద.

kujudi kosam

   నా నవల కుజుడి కోసం ఈ జనవరి  రచన  సంచిక  నుంచి ధారావాహిక గా ప్రచురించ  బడ బోతోంది.
నాలుగో సహస్రాబ్ది అంటే మిలీనియం  కధా కాలం  ౩౪౬౫  ...గ్రహ్హాన్తర యానాలూ అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర పురోగతీ వున్న కాలం .అయినా మానవుడి దురాశా  స్వార్ధం  మారిపోవు.ఏ యుగమైనా విలువలు మారవు.ప్రేమ మారదు.స్నేహం  నిస్వార్ధం మంచి విలువలు ఎప్పటికీ ఒకటే .మనం ఎంత సాధించినా మనకంటే గొప్ప శక్తి మరొకటి ఈ విశ్వం లో మనని శాసిస్తూనే ఉంటుంది.
ఇదే నేను చెప్పదలచినది. 

Monday, December 6, 2010

aravindaaShramam

                    పాండిచేరి లో అరవిందాశ్రమం చూడటం ఒక గొప్ప అనుభవం !చాలా మామూలుగా కనిపించే ఒక ఇల్లు లాగా  వుంది.ఒక పక్క వినాయకుడి కోవెల వుంది. ఆ వీధి లో నడిచి పక్కకు వస్తే దూరాన సముద్రం ...కనిపిస్తుంది.ఆశ్రమం లో ఎంతో మంది పర్యాటకులు దేశ విదేశాల  నుంచి వచ్చిన వారు నిశబ్దం గా  ఒక చెట్టు కింద ఉన్న సమాధి చుట్టూ తిరిగి lకొందరు సమాధి  మీద     తల వాల్చి అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ వుండటం  మనసు ను మరో లోకాల కు తీసుకు పోయే  మాటలు లేని ఆధ్యాత్మిక అనుభవం ...నిశబ్దం.అది చూస్తే అర్ధం అయింది అరవిందుడు ఇక్కడికి  వచ్చి ఈ ఆశ్రమం లో ఇంత ప్రశాంతం  గా ఎలా ఉన్నాడో ...ఆ రోజులు ఎలా  ఉండేవో! 
ఈ సముద్రం మాత్రం  అప్పుడూ ఇలాగె హోరు మనే అలల  తో  ఆకాశం తో మాట్లాడుతూ  ఉండి  ఉంటుంది... 

Sunday, November 28, 2010

manchi maaTa

            నీ చుట్టూ ఉన్న ప్రపంచం, మనుషులు,  ప్రకృతి అన్నీ నీ పంచేంద్రియాలు అందిస్తున్న సమాచారమే!
అందుకే నువ్వు ముఖ్యం!నువ్వు లేక పోతే ఈ ప్రపంచమే లేదు. నువ్వే లేకపోతే ఆలోచన లేదు  సృష్టి కి అర్ధం లేదు ..నువ్వే దేవుడి వి.అహం బ్రహ్మ లేక త్వమేవాహం అంటే అర్ధం ఇదే!

manchi maaTa

                      జరిగేది జరగక మానదు!
జరగనిది ఎప్పటి కీ జరగదు.     ఇదీ నిన్న సాక్షి పత్రిక లో కృష్ణ భగవాన్ అనే సినీ నటుడు రాసిన వ్యాసం లో చదివాను .చాలా నచ్చింది.               

Delhi Rule

ఈ రాష్ట్రం లో శాంతి నెలకొనడాని  కి మంచి  సమర్ధుడు అయిన  నాయకుడు వచ్చాడనుకుని సంతోషిస్తున్నాను.కాని  ఆయన తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోడాని కి కూడా డిల్లీ లో అవస్థ పడుతుంటే బాధగా వుంది.డిల్లీ పరిపాలన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణం గా ఉండేందుకు సూచనలు ఇవ్వవచ్చు గాని  ప్రతి చిన్న విషయాని కీ  జోక్యం చేసుకుంటూ  పోతే కొన్నాళ్ళకి ఈ ప్రభుత్వం కూడా పడి పోవటం ఖాయం. .

Saturday, September 18, 2010

YennaLLU

  ఎంత కాలం ఎదురుచూసేది?ఈ  రాష్ట్రం లో శాంతి నెలకొనడాని కి  ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి?మనిషి కీ  మనిషి కీ మధ్య  స్నేహితుడి కీ స్నేహితుడి కీ మధ్య విరోధం  సృష్టించే ఈ రాజకీయాలు  ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయి? వారి  వారి స్వార్ధం కోసం నాయకులు ప్రాంతాని కీ ప్రాంతాని కీ మధ్య  అగాధాలు నిర్మించి ద్వేషాన్ని ఎక్కువ చేస్తున్నారు.అసూయని పెంపొందిస్తున్నారు  .  మనం ఏమవుతాము?మన భాష సంస్కృతి అంతరిస్తుందా? నా కు ప్రాణం అయిన తెలుగు  ,తియ్యని తెలుగు  కవిత  రచన అంతరిస్తాయా  ? ఎన్నో  తెలుగు రాష్ట్రాలు ఏర్పడి  ఎన్నో  విభేదాలు వచ్చి దేశం  అందరూ మనని చూసి నవ్వుకుంటారా  ? మన పొరుగు భాష లైన తమిళం  కన్నడం మలయాళం  ముందుకు పోతే మనం  వివిధ యాస ల తో ముక్కలు  గా మిగిలి పోతామా?
ఎన్నాళ్ళు ఈ  సస్పెన్సు?
నాకు విసుగెత్తింది ...నా నవలలూ  కవితలూ నన్ను మెచ్చుకునే  అందరి కీ అందుబాటు లో కి తేవాలంటే  ఇంగ్లీషే  మేలేమో? ఇంగ్లీషులో  భావించి  ఇంగ్లీషులో బాధ పడి   ఇంగ్లీషు లోనే తరిద్దామా  ? తియ్యని తెలుగు ని ముత్యాల లాంటి అక్షరాలని వెన్నెల లాంటి  కవిత్వాన్ని ఎలా ...ఎలా మరువగలను? 

Thursday, August 19, 2010

manchi maata

        మంచి మాట
             ఎవరో వస్తారని,  ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకు మా!
అవును నీ భవిష్యత్తు నీ చేతి లో నే వుంది..నడిచేది నువ్వే! నడిపించేందుకు ఎవరు రారు...! 

Wednesday, August 18, 2010

manchi maaTa

మంచి  మాట ....
                                      
               చుట్టూ వున్న  చీకటిని  తిట్టుకుంటూ  కూచునే కంటే  ఒక్క చిరు దివ్వె ని వెలిగించి కన్నీళ్లు కార్చే మనసులలో వెలుగు నింపు!

Tuesday, August 17, 2010

Kujuni Kosam

                              కుజుని కోసం....నాలుగో సహస్రాబ్ది కథ...                                    1  ఒక జీవిత కాలపు స్వప్నం...
      అరుణ గ్రహం....అర్దరాత్రి  ఆకాశం లో రుధిర కాంతుల తో ధగ దగా మెరిసిపోయే అంగారక గ్రహం...భూమి ,కి
 మూడు కోట్ల మైళ్ళ దూరం లో వుంది.సూర్యుడికి పన్నెండు కోట్ల  మైళ్ళ దూరం లో దాని చుట్టూ తిరుగుతూ వుంటుంది.
             నాకు ఆ గ్రహం  అంటే ఇష్టం! ఆరాధన! ఆకర్షణ! మా యునివర్సిటి
 పరిశోధన శాలలో  వున్నా టెలిస్కోపు ల లో నుంచి
 ఎక్కువ గా కుజుడి కోసమే వెదికే వాడిని.అది ఏదో వర్ణించలేని ఆకర్షణ!నా చిన్న తనం నుంచీ,విద్యార్ధి దశ నుంచీ,చివరికి మధ్య  ఆసియా
లోని ఈ ఇండికా సెంట్రల్ విశ్వవిద్యాలయం లో బయో మెడికల్ ఇంజనీర్ గా  బోధనా పరిశోధనలలో వుద్యోగం చేస్తున్నప్పడివరకూ అన్గారకుడంటే
అరుణ అదే ఆకర్షణ! ఏదో  తెలియని శక్తి  ఆ  కిరణాల తో నన్ను పిలుస్తున్నట్లు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు, బలమైన అయస్కాంత శక్తి మెదడు మీద పని చేసి నన్ను రమ్మని బలవంతపెట్టుతున్నట్లు అనిపించేది.
ఎప్పుడు కుజుని లోని పెద్ద పేద యెర్రని  craters ni           పర్వతాల్ని
 చూసినా,నాకు మళ్ళీ  మళ్ళీ కలలు వచ్చేవి....
.ఏదో  ఒక రోజు కుజుని నుంచి నా కోసం ఎవరో వస్తారు.లేదా నేనే అక్కడికి వెళ్తాను.ఇది నా అంతరాత్మ లోని బలమైన నమ్మకం గా ఏర్పడి పోయింది.
 ఇంకా వుంది....

Friday, August 13, 2010

kujuni kosam

ప్రియమైన మిత్రులకు  ,నా నవల " కుజుని కోసం" తెలుగు లో అనువదించాను.దీనిని  ధారావాహిక గా rachana maasa patrika lo  prachrincha bothunnaru... చదవండి
.                                                                                                                                                              ఇదీ  ఇంగ్లీషు     
 లో నేను రాసిన "వార్ ఫర్ మార్స్" కు అనువాదం
.ఇది ఒక సైన్సు ఫిక్షన్  కధ...! 

Sunday, August 1, 2010

EnnaLLU

ఈ వర్షా కాలం రాత్రులలో వర్షపు జల్లుల చప్పుడు ...తిలక్ అర్ధ్రరాత్రి  కురిసిన రహస్యపు వాన ని గుర్తుకి తెచ్చాయి.
నిన్న ఒక అమాయిక విద్యార్ధి ఆత్మత్యాగం చేసుకుని వెళ్ళిపోయాడు.తెలంగాణా కోసం ఇంకా ఎంత మంది అసువులు బయాలి?ఈ రాష్ట్రం భవిష్యతు ఏమవుతుంది? ఈ ఒక్క పది నెలలలో ఎంత వెనక బడి పోయాము.ఒకే భాష మాట్లాడే వాళ్ళ లో ఎన్ని ద్వేషాలు ఎన్ని అపోహలు ఎన్ని తిట్లు?ఈ రాష్ట్రం త్వరగా విడి పోవాలనే నాకు అనిపిస్తోంది.ఎందుకంటె  అపార్ధాలు  ఎక్కువ గా అయి పోయాయి.ప్రతి విషయాని ఆంధ్రులు తో కలసి వుండటం కారణం గా naShTam jaruGuthondani ఒక అబిప్రాయం గాదం గా నాటుకు పోయింది.ఈ ఉద్యమం ఇక ఆగాడు.మరి విడి పోతే ఎన్ని   AanDhra pradesh ముక్కలయ్ pothundi?తెలుగు భాష సంస్కృతి ఏమవుతాయి?bahuSaa కొన్ని దశాబ్దాలకి తెలుగు సంస్కృతి అంతరించిపోతుంది ఏమో.

Monday, July 12, 2010

jagan yathra

జగన్ యాత్ర గురించి ఆలోచించాను.
నా కేమీ  అర్ధం కావడం లేదు.ఈ రాష్ట్రం లో రాజకీయాలు ఎంతో గందరగోళం గా ఉంటున్నాయి.౧.మీరే చెప్పండి!
జగన్  యాత్ర చేయడం ఇష్టం లేకపోతే సోనియా గాంధి గారు అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయచు గదా?
౨.ఆయన వ్యక్తిగతం అని చెప్పుతున్న యాత్రకి  అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ కి భయం ఎందుకు?
౩ అతను చెడ్డ వాడితే మరి
ఎం పీ సీటు ఎందుకు ఇచ్చ్చారు?
౪ రాజశేఖర్ రెడ్డి  మంచివాడు కాకపోతే మరి అతను అవినీతి చేసి వుంటే ఆయనని  ఇన్నాళ్ళు  ముఖ్య మంత్రి గా ఎలా vunchaaru?
  మరి జగన్ కూడా అవినీతి గా డబ్బు సంపాదించి వుంటే ఇదివరకంతా aakhariki వారి amma Gaariki kooDa
 ఎం ఎల్ ఏ సీటు ఎలా ఇచ్చారు?
prajaaswaamyam లో oka  yuva naayakuDanTe endukintha భయం?
అతను avineethiparudoo ayiThe kesulu peTTanDi.kaani yemee cheppakunDaa అతనిని అతని pani chesukokunDaa ఎందుకు aaputhunnaru?

Kotha

Sunday, April 25, 2010

rruN

   ఈ వేసవి భయంకరం గా వేడి గా క్రూరం గా ఉంది హైదరాబాద్ లో.మీరు ఇంకేక్కడినా చల్లటి  దేశం లో ఉన్నారా ,అయితే  నాకు చాల అసూయ గా ఉంది.ఈ ఎండల్లో ఏ సి లో కూర్చుని టి  వీ చూడటం బయట ఏ సి కారు లో తిరుగుతూ హాస్పటల్ కీ హాస్పిటల్ కీ మధ్య ప్రయాణిస్తూ  ...గ్రీష్మ తాపాన్ని భరిస్తున్నాను.ఐ పీ ఎల్ మాచిలు చూడటం బాగానే ఉన్నా  ఉన్నా  అవన్నీ ఫిక్సెడ్  అని తెలిసిన తరవాత ఆ త్రిల్ అంతా పోయింది.ఈ దేశం లో అంతా  కరప్షన్ అవినీతి చక్రవర్తులు క్రికెట్  సినిమాలు రాజకీయాలు వైద్యం  అన్ని చోట్ల అవినీతి .
ఈ సమయం లో ఆదివారం ఒక మంచి సినెమా చూడటం ఆనందాన్ని మిగిల్చింది. అది రన్   రామగోపాల వర్మ సినిమా . మీడియా మీద తీసిన కధ.దీనిలో అమితాబ్ బచన్ నటన చివరి సీన్ లో అద్భుతం గా వుంది.వర్మ దర్శకుడు గా ఒక జీనియస్ అతను కధ చెప్పే విధం ప్రత్యేకం గా ఉంటుంది.రన్  తప్పక తప్పక చూడండి. సి డీ  తెచుకుని అయినా సరే!

Sunday, March 21, 2010

Ye maya Chesave

  ఏ మాయ చేసావే చిత్రం  నిన్న చూసాము .అద్భుతమైన ఫోటోగ్రఫీ రహమాన్ సంగీతం కన్నుల విందు  గా ఉన్నాయి.  కాని ఈ హీరో నాకు నచ్చలేదు .కేరళ దృశ్యాలు చాలా బాగున్నాయి.కథ పాతదే .అనుభూతి మాత్రం ఎప్పుడూ ఒకటే .ప్రేమ కు భాష మతం కులం జాతి వయసు  అడ్డు రాకూడదు...మంచి పాటలకోసం దృశ్యాల కోసం చూడండి!  

Monday, March 15, 2010

Ugadi

  ప్రపంచం లోని తెలుగు  మిత్రులందరి కీ
    వికృతి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ....!
              పేరే ఇంత వికృతం     గా వుంది ఇక రా బోయే 
కాలం ఎలా వుంటుందో....! 
గడచిన సంవత్సరం పేరు గుర్తుందా?  అది విరోధి....!
 ఆ ఏడు కొండల వెంకన్న తెలుగు సంస్కృతిని కాపాడు గాక!

Monday, March 8, 2010

manchi maaTa

     పుట్టిన  రోజు  అంటే  ఏమిటి నిర్వచనం  చెప్పండి  అని ఎవరో అబ్దుల్ కలాం గారిని అడిగారు  .
"ఒకే ఒక్క రోజు! నువ్వు ఏడుస్తుంటే మీ అమ్మ నవ్విన రోజు ..."    ఎంత  బాగుంది!

Jokes

   డాక్టర్  గారు  సర్దార్జీ  కి చెప్పారు."రోజు ఎనిమిది  కిలోమీటర్లు పరిగెత్తండి !బరువు బాగా తగ్గుతారు,"
నెల రోజుల తర్వాత డాక్టర్ కి  ఫోను వచ్చింది. "డాక్టర్ సాబ్ ..బరువు పది  కిలోలు తగ్గాను,, కానీ ఇంటి దగ్గర నుంచి రెండువేల నాలుగు  కిలో మీటర్స్ దూరం   వచ్చేసాను...ఎలా?"   

Thursday, March 4, 2010

teluGe maTlaadudaama?

 తెలుగు అంటే  నాకు చాలా ఇష్టం. అంటే ఇంగ్లీషు అంటే  కోపమని కాదు.తెలుగు అక్షరాలూ  నుంచి తెలుగు మాటల నుంచి అన్నీ  నాకు కమనీయం గా కనిపిస్తాయి .అక్షరాలూ  చూడండి! వెన్నెల లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్ల లాగానే  ఉంటాయి. ఆ తలకట్లు  చుడండి ఎంత పొగరు గా  తెలుగువాడి ఆత్మాభిమానం  లాగానే గర్వం గా ఉంటాయి. ఆ పదాలు కవితలు  చదువుతుంటే మనసు ఉప్పొంగి పోతుంది. 
సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి మంచి చేయవోయ్ అన్న  గురజాడ మనసున మల్లెల మాల లూగేను  అని కోయిల లా గానం చేసిన  కృష్ణ శాస్త్రి   నన్నయ్య గారి మహాభారతం నుంచి  ఎర్రాప్రగడ శారదరాత్రుల నుంచి  తిక్కన్న గారి కవితా సౌరభం శ్రీ శ్రీ మహా ప్రస్తానం ఆరుద్ర త్వమేవాహం  దాశరధి కవితా సుమాలు  గురజాడ ముత్యాల సరాలు ...  ఎన్నని చెప్పగలను?భావకవులు  దేవులపల్లి కొమ్మలో  కొమ్మని అని ఆలపించిన గానం బసవరాజు  అప్పారావు రాయప్రోలు  నుంచి తిలక్ అమృతం కురిసిన రాత్రి దాకా  అన్ని నా కిష్టం!
ఇప్పుడు  సినిమాలలో కుడా అద్భుతమైన పాటలు  రాసారు .ఆత్రేయ  నారాయణ రెడ్డి  శ్రీ శ్రీ  నుంచి సీతారామ శాస్త్రి వరకు  మనోహర భావాలకి అందమైన పదాల తో పాటలు అల్లారు.
కల కానినిది నిజమైనది ... ప్రేమ ఎంత మధురం  ...మనసు గతి ఇంతే  మనసంతా నున్వ్వే  నువ్వు నువ్వు ...ఎదుటను  వున్నది ... మౌనం గానే ఎదగమని     ఎన్ని పాటలు...
అయితే మనం తెలుగు మాట్లాడం ... "కారు లో ఆఫీసు  కు పోయి వర్క్ చేసి తిరిగి వస్తుంటే బంద్  వల్ల ట్రాఫిక్ జం   లో లేటు అయింది."హోటల్  సినిమా  రైలు  రీలు రోడ్డు  కారు సూపర్ మార్కెట్టు  స్టేషన్  ఇలా ఎన్ని మాటలు ఇంగ్లీషు వి ...మన భాష క్రమం గా కనుమరుగయ్ పోతుందా? తెలుగు లో మాట్లాడి తేనే పల్లెటూరు వాడి వని  వెక్కిరించే సంస్కృతి  ఎప్పుడు పోతుంది?
ఎక్కడో స్కూలు లో "నేను తెలుగు మాట్లాడను"  అని మేడలో పటం   కట్టి పిల్లలని శిక్షించారట! .
ఒక్క భాష ఒక్క సంస్కృతి  ఒక్క ఆత్మ గౌరవం     మనకి ఎప్పుడు వస్తాయి. నువ్వు శున్ట్ట  అంటే నువ్వు వెధవ అనుకుంటూ  మళ్ళీ మళ్ళీ ముక్కలు ముక్కలు అయి హిందీ లో నో ఇంగ్లీషు లోనో తిట్టుకుంటూ తెలుగు వాళ్ళం అంతా ఒకప్పుడు మన  సాహిత్యం సినిమాలు  ఇలా ఉండేవట  అని వింత గా ముందు ముందు  మరో సారి నశించి పోయిన భాష మాట్లాడే వారి గా మిగిలిపొతామా?
ఈ మధ్య బెంగలూరు కేరళ వెళ్ళినప్పుడు  ఇవన్ని  నాకు వచ్చిన ఆలోచనలు. 
జంతు ప్రదర్శన శాల   నారాయణ హృదయాలయ  నగర పాలిక విహార స్థల ఇలా  అన్ని  వాళ్ళు  తమ భాష లో  నే రాసుకుంటున్నారు.మనకే ఈ పరభాషా వ్యామోహం...
ఓకే!  నెక్లెస్  రోడ్డు కి ట్యాంక్ బ్యాండ్   కి వెళ్లి ఫంక్షన్ హాల్లో మ్యారేజీ అటెండ్ అవ్వాలి .వస్తాను....      

Wednesday, February 24, 2010

లీడర్



లీడర్ చిత్రం చూడటం ఒక గొప్ప అనుభవం. రాజకీయాల మీద తీసిన సినిమాలు ఇదివరకు చాలానే వచ్చ్చాయి కాని ఇది మరొక దృక్పధం .కొంచెం నాటకీయం గా వున్నా ఇది యువత కి కొత్త స్ఫూర్తి ని ఇస్తుంది.
రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంత వుందో మనకందరికీ తెలుసు.ఈ సినిమా లో అర్జున్ తన తండ్రి కోరిక మేరకు ముఖ్యమంత్రి అవడానికి చాకచక్యం గా డబ్బుని విచ్చలవిడి గా వాడతాడు .ముఖ్యమంత్రి గా అవుతాడు కూడా .తండ్రి సంపాదిచిన బ్లాకు మని ని ప్రజాధనం గా ఇస్తాడు .అయినా అతని కి ముఖ్యమంత్రి గా కొనసాగడం కష్టం అవుతుంది.
ఈ సినిమా లో తెలుసుకునేది అదే. ఆ తరువాత అర్జున్ రాష్ట్రం అంతా కాలినడక న తిరిగి ప్రజల తో మమేకం అయి వారి సమస్యలని తెలుసుకుని మళ్ళా విజయం సాధిస్తాడు .ఇదంతా శేఖర్ కమ్ముల హృదయంగమం గా చిత్రించాడు .దీనికి తోడు మిక్కి మేయర్ సంగీతం కొత్త ధ్వని గుండెని తడిమే ధ్వనిని వినిపించింది.
"మా తెలుగు తల్లికీ మల్లెపూదండా" అంటూ టంగుటూరి కృష్ణకుమారి కంచు కంఠం మనసును పునీతం చేసింది. మనకు కావలసింది ప్రజల గుండెలలో చొచ్చుకుపోయి నిలిచేపోయే లీడర్లు.నల్ల డబ్బు బీరువాల నిండా దాచినా కూడా ప్రజల కి కొంచెం సేవ చేసినా వారు క్షమించి గుండెలలో దాచుకుంటారు.

Saturday, February 13, 2010

కుజుని కోసం నవల

కుజుని కోసం... నాలుగో సహస్రాబ్ది కథ...( నేను రాసిన వార్ ఫర్ మార్స్ ఇంగ్లీషు నవల కుఅనువాదం లోని మొదటి వాక్యాలు...) ఒక జీవిత కాలపు స్వప్నం .





అరుణ గ్రహం...అర్దరాత్రి ఆకాశం లో రుధిర కాంతుల తో ధగ దగా మెరిసిపోయే అంగారక గ్రహం.భూమి కి సుమారు మూడు కోట్ల మైళ్ళ దూరం లో ఉండి సూర్యుడి కి పన్నెండు కోట్ల మైళ్ళ దూరం లో పరిభ్రమిస్తూ ఉంటుంది .


నాకు ఆ గ్రహం అంటే ఇష్టం.మా యునివర్సిటి పరిశోధన శాల లో ఉన్న టెలిస్కోప్ లలో నుంచి ఎక్కువ గా కుజుడి కోసమే వెదికే వాడిని.అది ఏదో వర్ణించలేని ఆకర్షణ.

Wednesday, February 10, 2010

కన్యాకుమారి


కన్యాకుమారి వెళ్లి అప్పుడే రెండు సంవత్సరాలుఅయిపోయింది.అక్కడ నాకు నచ్చినది నిరంతరం హోరెత్తే సముద్రం ...మూడు దిక్కులా అదే.... ఉదయమే లేచి సూర్యోదయం కోసం ఎదురు చూసే టూరిస్టులు ...అన్నిటి కంటే మించి అక్కడ ఉన్న పురాతన కన్యాకుమారాలయం...దానిలో అందమైన కన్యాకుమారి విగ్రహం ఆవిడ ముక్కున మిరుమిట్లు కొడుతూ మెరిసే వజ్రం లాటి ముక్కుపుడక.... అక్కడ గుడి లో ఒక ముసలాయన తమిళం లో పాడిన పాట.మరపురాని జ్ఞాపకాలు.

Wednesday, January 27, 2010

నానవలలు( బై బై పొలోనియా )

నేను రాసిన నవలలలో అన్నిటి కంటే నాకు బై బై పొలోనియా చాలా ఇష్టం.తెలుగు లో ఇంతవరకూ ఎవరూ రాయనట్లు గా సైన్సు ఫిక్షన్ స్పేసు ఫిక్షన్ రాయాలని రాసినది.సీక్వెల్ కంసేప్ట్ తెలుగులో లేదు అలా రాయాలని రాసినది.ఇది ఐ సి సి యు కి సేక్వేల్ గా రాసాను. దీనికి హిందూ పత్రిక లో మంచి రివ్యు రావడం నా అదృష్టం .నన్నెంతో ప్రోత్సహించిన విషయం.దాంతో దానికి మరో స్వేక్వేల్ హైడ్ వైరస్ రాసాను .
ఐ సి సి యు .బై బై పొలోనియా హైడ్ వైరస్ తెలుగులో సైన్సు ఫిక్షన్ నవలలు ఒక త్రయాలజీగా నిలిచి పోవాలని నా కోరిక.
ఈ నవలలలో కామన్ విలన్ డాక్టర్ రావు .కామన్ హీరో రవీ అభిజీత్ శిల్పా .కామన్ నేపధ్యం వైద్య విజ్ఞానం స్పేసు సాహిత్యం .కార్డియాలజీ నించి రోబత్స్ దాకా మందుల నించి కాల ప్రయాణం చేసే గ్రహాన్తరవాసులూ కాల వేగం తో ప్రయాణించే అంతరిక్ష నౌక లూ ఇవన్నీ రాసాను కాలప్రయానికుడు హోరా గ్రహాంతర సుందరి పొలోనియా సహారా ఎడారి లోని కథా నేపధ్యం ఇవన్ని తెలుగులో ఎవరు రాయలేదని చెప్పగలను. మూడు నవలలు చదవాలి.లార్డ్ ఆఫ్ డి రింగ్స్ లాగా అందరూ మెత్చుకోవాలి అదే నా ఆశ ...

Monday, January 25, 2010

నానవలలు (ఔనా)


.ఔనా నవల నేను రాసిన నవలల లో రొమాంటిక్ గా రాయడానికి ప్రయత్నించినది. అయినా నవలలో చివరికి మళ్లీ మెడిసిన్ జబ్బులు అన్ని వచ్చేసాయి .

ఆతను ఒక భావుకుడు. పాత పాటలూ నాగేశ్వర రావు సినిమాలూ ఇష్టం. యెవరూ లేరు అతనికి.అరెంజేడ్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకుని ఆమెను హృదయపూర్వకం గా ఆరాధిస్తూ ఉంటాడు.అతను నిషాద్ .

ఆమె వినీల .ఆమె కి అతనంటే బోరు. ఆమె మంచి గాయని. తనకు గురువు గా సంగీతం

నేర్పించిన వ్యక్తి నీ పెళ్ళికి ముందు ప్రేమించింది.కళ్లు మూసుకుంటే అతనే గుర్తు వస్తాడు. అతను మళ్ళీ తన జీవితం లో కి వస్తాడని ఊహించలేదు.

ఇక మేఘన .డాక్టర్ .నిషాద్ ని ప్రేమించి విఫలం అయింది.అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది.అయితే అదే నిషాద్ భార్య కి వైద్యం చేయాల్సి వచ్చేస్సరికి ఒక పక్క స్త్రీ సహజమయిన అసూయ మరొక పక్క వృత్తి ధర్మం... సంఘర్షణ లో తప్పులు చేస్తుంది. నాకు మేఘన అంటే ఇష్టం...

ఈ కధలో విలన్ సంగీతం మాస్టర్ .రాగతరంగిణి లో అమ్మాయిలకు పాఠాలు చెప్పుతూ పర్వర్శన్స్ తో ప్రవర్తించే వ్యక్తి.వో వసంత భామినీ వినీల జీవితం లో మళ్ళీ ప్రవేశించిన మనిషి.విజయచంద్ర . ఇక పోతే.. యాదగిరి...వాయుర్ .వీడియో గ్రాఫర్ .అతనికి ఇతరుల జీవితాలను తన కెమెరా తో దొంగతనం గా చూడటం అలవాటు.

మంచి వాడా ? చెడ్డ వాడా? ప్రతి మంచి లో ఒక చెడ్డ...ప్రతి చెడ్డలో ఒక మంచి .వివీల వెనక నిషాద్.నిషాద్ వెనక మేఘన. విజయచంద్ర వెనక వినీల.వీరందరినీ రహస్యం గా చూస్తూ యాదగిరి..అందరూ వుండేది అపర్ణా కాంప్లెక్స్ ఫ్లాట్స్ లో..

ఇదే ఔనా నవల లోని వింత కథ . చిత్రీకరించడం లో ఎంతవరకు సఫలం అయ్యానో తెలియదు.... దొరికితే చదవండి !

Sunday, January 24, 2010

నానవలలు (సాలెగూడు)


సాలెగూడు అంటే వరల్డ్ వాయిడ్ వెబ్. ఇంటర్ నెట్ అన్న మాట..ఈ టైటిల్ నేను పెట్టింది కాదు. ఆంద్ర ప్రభ ఎడిటర్ రాఘవ రావు గారు చెప్పినట్లు అలాగే మార్చేసాను.అసలు నేను పెట్టిన పేరు "ప్రామిస్ యు లవ్ మీ " రొమాంటిక్ గా వుండాలని కాబోలు అప్పట్లో అలా పెట్టాను.ఈ నవల లో వర్ణించిన ఆశ్రమం యుటోపియ అందరినీ పరలోకం తీసుకుపోవటానికి ప్రేరేపించే స్వామీ జీ అన్నీ మన పాట్హకులకి అంత గా పట్టినట్లు లేదు కాని నా కయితే ఒక కొత్త సబ్జెక్ట్ రాసానని అది కూడా సైన్సు నేపధ్యం లో ననీ ఒక తృప్తి .

Saturday, January 23, 2010

చలి

ఈ  చలి కాలం ఉదయం ఏమని రాయను.మనసంతా ఖాళీ అయిపొయింది. ఈ నగరం ఒకప్పుడు జీవితం నిండి ఉప్పొంగుతూ ఉండేది.ఎప్పుడూ ఏదో సంతోషం ఏదో హడావుడి ఏదో ఉత్సాహం నిండి ఇది ఆశావాదానికి ప్రతీకగా ఉండేది.ఇప్పుడు అసహనానికి అసూయకి నెలవు గా మారింది.ఏదో నిరుత్సాహం ఏదో అనుమానం ఏదో అనిశ్చిత పరిస్థితి . ఏది కాదు .ఏది గడవదు.ఇది ఒక మార్పా?లేక ఒక తిరోగాతా? ఏదో టయిం
మెషీన్ లో ప్రయాణం చేసి శిధిలం ఆయన నగరం మనుషుల మధ్య ప్రవేసిన్చినట్లుంది .ఇది ఒక చలికాలం. ఆశలు ఘనీభవించిన కాలం.

Friday, January 22, 2010

నా నవలలు (మధుమేహం...)


నేను రాసిన డయాబిటిస్ హెల్త్ ఎడుకేషన్ పుస్తకము చాలా పాపులర్ అయింది.

నా నవలలు (ఐ సీసీ యు)

( చాలా మంచి సంపాదకులు సహృదయులు వాకాటి పాండురంగారావు గారి ని స్మరించుకుంటూ...) ఆంద్ర ప్రభ లో ఈ నవల 1990 లో ప్రచురించ బడింది..తెలుగు లో సైంటిఫిక్ నవలలలో పేరు తెచ్చుకుంది .

My Blog Visitors