Pages

Showing posts with label aalochanalu. Show all posts
Showing posts with label aalochanalu. Show all posts

Saturday, February 4, 2012

tripura

     

  తెలుగు రచయితల కి ఒక మంచి  బహుమతి  లా గా ఏర్పడింది  కినిగే.కాం
మీ నవలల్ని ఈ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసి అమ్మకానికి పెట్టచ్చు.
ఆ క్రమంలో నా నవల ఐ సి సి యు  ని అక్కడ ఉంచి అటు ఇటు బ్రౌజ్ చేస్తుంటే కనిపించింది త్రిపుర కథల పుస్తకం.ఎప్పట్నించో చదవాలన్న
 నా ఆశ నెరవేరింది.త్రిపుర అద్భుతమైన రచయిత.ఏదో లోకం లోకి వెళ్లి పోయాను ఇలా కధలు రాయడం అనితర సాధ్యం.ఈ కధ లన్నీ  అంతరంగం లో ఆవిష్కరించా బడతాయి.ఎక్కడెక్కడో బెనారస్ లో మొగల సారాయి లో విశాఖ  లో మనసు భ్రమిస్తుంది. ...నేను వివశుడిని
  అయి పోయాను. "పాము" చదవండి."భగవంతం కోసం" చదవండి.అరవైల లో రాసి నా ఇప్పటి కీ ఇమేజరీ చెక్కు చెదర లేదు .త్రిపుర నా అభిమాన రచయిత అయి పోయాడు.మీరూ చదవండి!

Wednesday, January 25, 2012

Baapu


           బాపు గారికి పద్మా అవార్డు ఇవ్వలేదని ఫెసుబుక్
 లో నూ ట్ట్విత్తర్  లోనూ రాసినా సరే తెలుగు వారెవరూస్పందించ నట్లే
కనిపించలేదు.రమణ గారు వెళ్లి పోయారు.బాపు రమణ లంటే మన తెలుగు సంస్కృతి కి ప్రతీకలు..అవార్డు లు ఇవ్వక పోయినా వారి గొప్పదనం మన హృదయాల్లో వారి స్థానం చెరిగి పోదు.బాపు బొమ్మ లాంటి అమ్మాయి ముళ్ళపూడి బుడుగు అప్పారావు మన దగ్గిరే శాశ్వతం గా వుంటారు.అందమైన ఆగీతలు హాయి గా నవ్వించే రాతలు ఎక్కడికి పోవు.తెలుగు ఉన్నంత వరకు అవి శాశ్వతం.బహుమతులు ఒక గుర్తింపు.అంతే.తెలుగు తియ్యదనం రుచి చూడని మూర్ఖుల కేం తెలుస్తుంది ఆణి ముత్యాల రుచి ."పెరల్స్బిబిఫోర్ స్వ్యన్స్" అన్నట్లు.అయినా ఏదో బాధ
మన తెలుగు మహామహుల కి గుర్తింపు రాదా తెలుగు లో రాస్తే  బొమ్మలు గీస్తే భరత్ దేశం లో పేరేరాదా? 

 

 


 

 
 .
 
 
 
 
 
  
 

Tuesday, July 5, 2011

Cross roads

               హైదరాబాదు లో ఇప్పుడు  బంద్ జరుగుతోంది.రాష్ట్ర విభజన కోసం  ఆందోళనలు జరుగుతున్నాయి.ప్రజా ప్రతినిదులు రాజీనామాలు  చేసారు. డిల్లీ లో కేంద్ర ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోవడం లేదు.ఈ అనిశిత పరిస్థితి ఎన్నాళ్ళు అని విసుగు గా వుంది.ఇది ఒక  స్వాతoత్ర  ఉద్యమం లాగా  తయారయింది.నిజానికి ఇది అంతా భారత దేశం కదా...ఇది అంతా ఒకే  రాష్ట్రం కదా..అయినా  పరదేశ పాలన లో మగ్గుతున్న ప్రజల లా గా అందరు బాధ పడు తున్నారు. ఎన్నికలు మనకున్నాయి.రాజ్యాంగం   మనకు ఉన్నది.కానీ ఏదో పరదేశపు పాలన లాగా దాని నుంచి విముక్తి కోసం పోరాటం అనీ భావనతెలంగాణా లో బలం గా వుంది.
అయితే హైదరాబాదు లో స్థిర పడిన ఆంధ్రులూ కోస్తా రాయలసీమ శ్రీకాకుళం నుంచి వచ్చి స్థిరా పడిన ప్రజలు అందరూఇది మన రాష్ట్రం అనే అనుకునే స్థిర పడ్డారు.హైదరాబాదు అద్భుతం గా వృద్ధి పొంది
తెలుగు సంస్కృతీ వైభవం వెలిగి పోతుందనే సమయం లో ఈ ప్రాంతీయ కలహాలు అపార్ధాలూ నాకు ఎంతో మనో వేదనని కలిగిస్తున్నాయి.దీని కి కల తప్పు ఒప్పులు నేను విశ్లేషించడం లేదు.ఈ పరిస్థితులు మారి మళ్ళీ తెలుగు వైభవం విశ్వం అంతా తన బావుటా ని ఎగర వేయాలని అందరూ ప్రేమ తో ఐకమత్యం గా వుండాలని 
పక్క నే వున్న తమిళుల లాగా కన్నడిగుల లాగా  మన సంస్కృతి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని    ఒక తెలుగురచయిత గా కోరుకుంటున్నాను!
 
 

 
 

Wednesday, January 19, 2011

aalochanalu

కొత్త సంవత్సరం  మొదలయింది.అనుకున్నట్లుగా ఏ గొడవలూ జరగలేదు.కానీ రాజకీయ అనిశ్చిత పరిస్థితి కొనసాగుతూనే వుంది.న్యు ఇయర్  అయిపొయింది,సంక్రాంతి అయిపోయినది.కానీ మన రాష్ట్ర  భవిష్యతు  ఎలా వుంటుందో  ఎవరికీ  అర్ధం కాని పరిస్థితి.మిగిలిన రాష్ట్రాలు ప్రగతి పధం లో దూసుకు పోతుంటే మనం మనలో  కొట్టుకుంటూ తిట్టుకుంటూ  కాల క్షేపం చేస్తూ ఉన్నాము. ఈ మధ్య  కాన్ఫరెన్సు కోసం అహమ్మదాబాదు వెళ్ళాను.అది ఒక డాక్టర్ల  కాన్ఫరెన్సు.గుజరాతు ఎంత  ముందుకు వెళ్తోందో  అనిపించింది.
నా సీరియల్ నవల "కుజుని కోసం "రచన లో మొదలయింది.తెలుగు లో సైన్సు సాహిత్యం అంతరిక్ష సాహిత్యం రాసే సాహసం చేసాను.పాటకులు 
  విమర్శకులు ఏమంటారో అని ఆత్రుత గా వుంది.మీరు  వీలుంటే చదవండి! 
నా కధలు కొత్త గా వచ్చే అపరాధ పరిశోధన  అనే మాస పత్రిక లో  కూడా  రాబోతున్నాయి. మిస్టరీ  హార్రర్  ఇష్టం వుంటే  నా ఆనంద భవన్ కధా చదవండి.
ఇదీ ఇలా  వుండగా వంశీ కధలు టెలివిజన్ లో సీరియల్ గా వస్తున్నాయి..మా T  వీ లో .ఆయన రాసిన వన్నీ  గొప్ప కధలు .ఉన్నతమైన స్థాయి లో ఉన్నాయి వాటికి బాపు బొమ్మలు అద్భుతం గా వేసారు .చూడండి..చదవండి. 

Wednesday, December 29, 2010

new year

 ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం  మొదలవబోతోంది.
మన రాజధాని లో అందరి మనసులో ఒకటే అనుమానం."గొడవలు  జరుగుతాయట...ఎలా వుంటుందో ఏమో" 
ఎంతో అద్భుతం  అయిన ప్రగతి పధం లో వెళ్ల వలసిన  రాష్ట్రం ...ఎంతో సంస్కృతి  చరిత్ర కలిగిన ప్రజలూ భాష  సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం మనది.ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళినా మనకు  తెలుగు వాళ్ళు కనిపిస్తూనే వ ఉంటారు.ఉన్నతమైన  సంస్కారం కల జాతి మనది. ఇలా రెండు  సంవత్సరాల నుంచి మనం మనలో పోట్లాడు కుంటూ తిట్టు కుంటూ ఉన్నాము .రెండు రోజుల తరవాత ఏమి జరుగుతుందో అనే  ఈ స్థితి   ఎన్నాళ్ళు?ఎవరో పరభాషా సంస్కృతి కి చెందిన కేంద్ర ప్రభుత్వ కమిటీ  లు మన బాధ ని ఎలా అర్ధం చేసుకుంటాయి? లేక నిజం గానే  ఈ సమస్య కి త్వర లో నే అందరికీ ఆమోద యోగ్యం అయిన  పరిష్కారం దొరుకుందా?  భగవంతుడిని ప్రార్దిద్దాము .
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Saturday, December 25, 2010

kotha samvatsaram

కొత్త సంవత్సరం వస్తోంది.ఏమి జరుగుతుందో అనే భయం  అంతర్గతం  గా  అందరికి వుంది.రోడ్లు  బ్లాక్ చేస్తారా?జన జీవనం  స్తంభింప జేస్తారా? కొత్త సంవత్సరం లో రాష్ట్ర విభజన జరుగుతుందా ? అంతా  సస్పెన్సు గా వుందంటే  నమ్మండి.అన్నిటి కంటే  యూస్ లెస్  శాస్త్రం  జ్యోతిషం  అని అనిపిస్తోంది.ఎంత గొప్ప జ్యోతిష్కుడు అయినా  చెప్పలేని భవిష్యతు  మనది .మన తెలుగు దేశానిది. అందరికీ ఆమోగ్యం అయిన  పరిష్కారం ఏమయి ఉంటుంది సార్?  చెప్పండి!  ఏది చేసినా ఎవరో ఒకరికి  కోపం రాక తప్పదు.
వేచి చూద్దాం. 

Monday, December 6, 2010

aravindaaShramam

                    పాండిచేరి లో అరవిందాశ్రమం చూడటం ఒక గొప్ప అనుభవం !చాలా మామూలుగా కనిపించే ఒక ఇల్లు లాగా  వుంది.ఒక పక్క వినాయకుడి కోవెల వుంది. ఆ వీధి లో నడిచి పక్కకు వస్తే దూరాన సముద్రం ...కనిపిస్తుంది.ఆశ్రమం లో ఎంతో మంది పర్యాటకులు దేశ విదేశాల  నుంచి వచ్చిన వారు నిశబ్దం గా  ఒక చెట్టు కింద ఉన్న సమాధి చుట్టూ తిరిగి lకొందరు సమాధి  మీద     తల వాల్చి అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ వుండటం  మనసు ను మరో లోకాల కు తీసుకు పోయే  మాటలు లేని ఆధ్యాత్మిక అనుభవం ...నిశబ్దం.అది చూస్తే అర్ధం అయింది అరవిందుడు ఇక్కడికి  వచ్చి ఈ ఆశ్రమం లో ఇంత ప్రశాంతం  గా ఎలా ఉన్నాడో ...ఆ రోజులు ఎలా  ఉండేవో! 
ఈ సముద్రం మాత్రం  అప్పుడూ ఇలాగె హోరు మనే అలల  తో  ఆకాశం తో మాట్లాడుతూ  ఉండి  ఉంటుంది... 

Sunday, November 28, 2010

Delhi Rule

ఈ రాష్ట్రం లో శాంతి నెలకొనడాని  కి మంచి  సమర్ధుడు అయిన  నాయకుడు వచ్చాడనుకుని సంతోషిస్తున్నాను.కాని  ఆయన తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోడాని కి కూడా డిల్లీ లో అవస్థ పడుతుంటే బాధగా వుంది.డిల్లీ పరిపాలన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణం గా ఉండేందుకు సూచనలు ఇవ్వవచ్చు గాని  ప్రతి చిన్న విషయాని కీ  జోక్యం చేసుకుంటూ  పోతే కొన్నాళ్ళకి ఈ ప్రభుత్వం కూడా పడి పోవటం ఖాయం. .

Saturday, September 18, 2010

YennaLLU

  ఎంత కాలం ఎదురుచూసేది?ఈ  రాష్ట్రం లో శాంతి నెలకొనడాని కి  ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి?మనిషి కీ  మనిషి కీ మధ్య  స్నేహితుడి కీ స్నేహితుడి కీ మధ్య విరోధం  సృష్టించే ఈ రాజకీయాలు  ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయి? వారి  వారి స్వార్ధం కోసం నాయకులు ప్రాంతాని కీ ప్రాంతాని కీ మధ్య  అగాధాలు నిర్మించి ద్వేషాన్ని ఎక్కువ చేస్తున్నారు.అసూయని పెంపొందిస్తున్నారు  .  మనం ఏమవుతాము?మన భాష సంస్కృతి అంతరిస్తుందా? నా కు ప్రాణం అయిన తెలుగు  ,తియ్యని తెలుగు  కవిత  రచన అంతరిస్తాయా  ? ఎన్నో  తెలుగు రాష్ట్రాలు ఏర్పడి  ఎన్నో  విభేదాలు వచ్చి దేశం  అందరూ మనని చూసి నవ్వుకుంటారా  ? మన పొరుగు భాష లైన తమిళం  కన్నడం మలయాళం  ముందుకు పోతే మనం  వివిధ యాస ల తో ముక్కలు  గా మిగిలి పోతామా?
ఎన్నాళ్ళు ఈ  సస్పెన్సు?
నాకు విసుగెత్తింది ...నా నవలలూ  కవితలూ నన్ను మెచ్చుకునే  అందరి కీ అందుబాటు లో కి తేవాలంటే  ఇంగ్లీషే  మేలేమో? ఇంగ్లీషులో  భావించి  ఇంగ్లీషులో బాధ పడి   ఇంగ్లీషు లోనే తరిద్దామా  ? తియ్యని తెలుగు ని ముత్యాల లాంటి అక్షరాలని వెన్నెల లాంటి  కవిత్వాన్ని ఎలా ...ఎలా మరువగలను? 

Monday, July 12, 2010

jagan yathra

జగన్ యాత్ర గురించి ఆలోచించాను.
నా కేమీ  అర్ధం కావడం లేదు.ఈ రాష్ట్రం లో రాజకీయాలు ఎంతో గందరగోళం గా ఉంటున్నాయి.౧.మీరే చెప్పండి!
జగన్  యాత్ర చేయడం ఇష్టం లేకపోతే సోనియా గాంధి గారు అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయచు గదా?
౨.ఆయన వ్యక్తిగతం అని చెప్పుతున్న యాత్రకి  అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ కి భయం ఎందుకు?
౩ అతను చెడ్డ వాడితే మరి
ఎం పీ సీటు ఎందుకు ఇచ్చ్చారు?
౪ రాజశేఖర్ రెడ్డి  మంచివాడు కాకపోతే మరి అతను అవినీతి చేసి వుంటే ఆయనని  ఇన్నాళ్ళు  ముఖ్య మంత్రి గా ఎలా vunchaaru?
  మరి జగన్ కూడా అవినీతి గా డబ్బు సంపాదించి వుంటే ఇదివరకంతా aakhariki వారి amma Gaariki kooDa
 ఎం ఎల్ ఏ సీటు ఎలా ఇచ్చారు?
prajaaswaamyam లో oka  yuva naayakuDanTe endukintha భయం?
అతను avineethiparudoo ayiThe kesulu peTTanDi.kaani yemee cheppakunDaa అతనిని అతని pani chesukokunDaa ఎందుకు aaputhunnaru?

Thursday, March 4, 2010

teluGe maTlaadudaama?

 తెలుగు అంటే  నాకు చాలా ఇష్టం. అంటే ఇంగ్లీషు అంటే  కోపమని కాదు.తెలుగు అక్షరాలూ  నుంచి తెలుగు మాటల నుంచి అన్నీ  నాకు కమనీయం గా కనిపిస్తాయి .అక్షరాలూ  చూడండి! వెన్నెల లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్ల లాగానే  ఉంటాయి. ఆ తలకట్లు  చుడండి ఎంత పొగరు గా  తెలుగువాడి ఆత్మాభిమానం  లాగానే గర్వం గా ఉంటాయి. ఆ పదాలు కవితలు  చదువుతుంటే మనసు ఉప్పొంగి పోతుంది. 
సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి మంచి చేయవోయ్ అన్న  గురజాడ మనసున మల్లెల మాల లూగేను  అని కోయిల లా గానం చేసిన  కృష్ణ శాస్త్రి   నన్నయ్య గారి మహాభారతం నుంచి  ఎర్రాప్రగడ శారదరాత్రుల నుంచి  తిక్కన్న గారి కవితా సౌరభం శ్రీ శ్రీ మహా ప్రస్తానం ఆరుద్ర త్వమేవాహం  దాశరధి కవితా సుమాలు  గురజాడ ముత్యాల సరాలు ...  ఎన్నని చెప్పగలను?భావకవులు  దేవులపల్లి కొమ్మలో  కొమ్మని అని ఆలపించిన గానం బసవరాజు  అప్పారావు రాయప్రోలు  నుంచి తిలక్ అమృతం కురిసిన రాత్రి దాకా  అన్ని నా కిష్టం!
ఇప్పుడు  సినిమాలలో కుడా అద్భుతమైన పాటలు  రాసారు .ఆత్రేయ  నారాయణ రెడ్డి  శ్రీ శ్రీ  నుంచి సీతారామ శాస్త్రి వరకు  మనోహర భావాలకి అందమైన పదాల తో పాటలు అల్లారు.
కల కానినిది నిజమైనది ... ప్రేమ ఎంత మధురం  ...మనసు గతి ఇంతే  మనసంతా నున్వ్వే  నువ్వు నువ్వు ...ఎదుటను  వున్నది ... మౌనం గానే ఎదగమని     ఎన్ని పాటలు...
అయితే మనం తెలుగు మాట్లాడం ... "కారు లో ఆఫీసు  కు పోయి వర్క్ చేసి తిరిగి వస్తుంటే బంద్  వల్ల ట్రాఫిక్ జం   లో లేటు అయింది."హోటల్  సినిమా  రైలు  రీలు రోడ్డు  కారు సూపర్ మార్కెట్టు  స్టేషన్  ఇలా ఎన్ని మాటలు ఇంగ్లీషు వి ...మన భాష క్రమం గా కనుమరుగయ్ పోతుందా? తెలుగు లో మాట్లాడి తేనే పల్లెటూరు వాడి వని  వెక్కిరించే సంస్కృతి  ఎప్పుడు పోతుంది?
ఎక్కడో స్కూలు లో "నేను తెలుగు మాట్లాడను"  అని మేడలో పటం   కట్టి పిల్లలని శిక్షించారట! .
ఒక్క భాష ఒక్క సంస్కృతి  ఒక్క ఆత్మ గౌరవం     మనకి ఎప్పుడు వస్తాయి. నువ్వు శున్ట్ట  అంటే నువ్వు వెధవ అనుకుంటూ  మళ్ళీ మళ్ళీ ముక్కలు ముక్కలు అయి హిందీ లో నో ఇంగ్లీషు లోనో తిట్టుకుంటూ తెలుగు వాళ్ళం అంతా ఒకప్పుడు మన  సాహిత్యం సినిమాలు  ఇలా ఉండేవట  అని వింత గా ముందు ముందు  మరో సారి నశించి పోయిన భాష మాట్లాడే వారి గా మిగిలిపొతామా?
ఈ మధ్య బెంగలూరు కేరళ వెళ్ళినప్పుడు  ఇవన్ని  నాకు వచ్చిన ఆలోచనలు. 
జంతు ప్రదర్శన శాల   నారాయణ హృదయాలయ  నగర పాలిక విహార స్థల ఇలా  అన్ని  వాళ్ళు  తమ భాష లో  నే రాసుకుంటున్నారు.మనకే ఈ పరభాషా వ్యామోహం...
ఓకే!  నెక్లెస్  రోడ్డు కి ట్యాంక్ బ్యాండ్   కి వెళ్లి ఫంక్షన్ హాల్లో మ్యారేజీ అటెండ్ అవ్వాలి .వస్తాను....      

My Blog Visitors