ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం మొదలవబోతోంది.
మన రాజధాని లో అందరి మనసులో ఒకటే అనుమానం."గొడవలు జరుగుతాయట...ఎలా వుంటుందో ఏమో"
ఎంతో అద్భుతం అయిన ప్రగతి పధం లో వెళ్ల వలసిన రాష్ట్రం ...ఎంతో సంస్కృతి చరిత్ర కలిగిన ప్రజలూ భాష సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం మనది.ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళినా మనకు తెలుగు వాళ్ళు కనిపిస్తూనే వ ఉంటారు.ఉన్నతమైన సంస్కారం కల జాతి మనది. ఇలా రెండు సంవత్సరాల నుంచి మనం మనలో పోట్లాడు కుంటూ తిట్టు కుంటూ ఉన్నాము .రెండు రోజుల తరవాత ఏమి జరుగుతుందో అనే ఈ స్థితి ఎన్నాళ్ళు?ఎవరో పరభాషా సంస్కృతి కి చెందిన కేంద్ర ప్రభుత్వ కమిటీ లు మన బాధ ని ఎలా అర్ధం చేసుకుంటాయి? లేక నిజం గానే ఈ సమస్య కి త్వర లో నే అందరికీ ఆమోద యోగ్యం అయిన పరిష్కారం దొరుకుందా? భగవంతుడిని ప్రార్దిద్దాము .
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Wednesday, December 29, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment