పాండిచేరి లో అరవిందాశ్రమం చూడటం ఒక గొప్ప అనుభవం !చాలా మామూలుగా కనిపించే ఒక ఇల్లు లాగా వుంది.ఒక పక్క వినాయకుడి కోవెల వుంది. ఆ వీధి లో నడిచి పక్కకు వస్తే దూరాన సముద్రం ...కనిపిస్తుంది.ఆశ్రమం లో ఎంతో మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వచ్చిన వారు నిశబ్దం గా ఒక చెట్టు కింద ఉన్న సమాధి చుట్టూ తిరిగి lకొందరు సమాధి మీద తల వాల్చి అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ వుండటం మనసు ను మరో లోకాల కు తీసుకు పోయే మాటలు లేని ఆధ్యాత్మిక అనుభవం ...నిశబ్దం.అది చూస్తే అర్ధం అయింది అరవిందుడు ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమం లో ఇంత ప్రశాంతం గా ఎలా ఉన్నాడో ...ఆ రోజులు ఎలా ఉండేవో!
ఈ సముద్రం మాత్రం అప్పుడూ ఇలాగె హోరు మనే అలల తో ఆకాశం తో మాట్లాడుతూ ఉండి ఉంటుంది...
Monday, December 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment