Pages

Sunday, April 24, 2016

bandar

కొండలే రగిలే వడ గాలీ , నీ సిగ లో పూవేలోయీ ! అన్నాడు సినీ కవి .పగలూ రేయీ ఒకటే వేడి ,ధూళీ దుమ్ము డీసెల్ పొగల కారు హారన్ల ధ్వని వాయు కాలుష్యం లో ఆకుపచ్చ దీపం కోసం ఆశగా ట్రాఫిక్ జంక్షన్ ల దగ్గర చిక్కుకుపోయి భానుడి ప్రతాపానికి ఓడిపోతున్న ఏసీ యంత్రాల చప్పుడులో తీరని తాపం లో సుదీర్ఘ గ్రీష్మం తో యుధం చేస్తున్న నగర జీవి ని. బుర్ర పెనం లో వేగిపోతున్న గారే లా ఉంటె కవిత్వం కథలు ఎలా పుట్టుకొస్తాయి.అయినా ముఖ పుస్తకం చూడకుండా ఉండలేని నాకు వంశీ మాగంటి గారు పెడుతున్న పాత తెలుగు ప్రకటనలు చూడటం అలవాటు గా మారి మొన్న హటాత్తుగా ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ఆర్ డీ ఎల్ నరసింహమూర్తి పోలి టెక్నిక్కాలేజీ ప్రకటనలు చూసి మళ్ళీ బందరు గుర్తొచ్చింది.ఇప్పటి మచ్లీపట్నం . ..అక్కడ చదివిన సంవత్సరాలు.ఎక్కడో రోమ్ లో వాటికన్ మ్యూజిఅమ్ 16 వ శతాబ్దపు మ్యాపులలో మసుల వొడ రేవు పేరుకనిపిస్తే ఆహా మన బందర్ కి యెంత చరిత్ర అనుకునే వాడిని.ఆ తుఫానులు ఉప్పెనలు లేక పోతే బందరు చెన్నై లాగా మహానగరం కాక పోయేదా? క్రిందటేడు పల్లెటూరు వెళ్ళినప్పుడు మా అమ్మాయి బందరు వెళ్ళాలి అని పట్టుబట్టింది.వడగాలి లో లో నే వెళ్ళాం కోనేరు సెంటర్ కి పట్టాభి మార్కెట్ కి గూగుల్ మ్యాప్ ఎందుకు.అక్కడ 23 లేక 24 నెంబర్ షాపేమో చల్లటి బాదం ఖీర్ ఇచ్చాడు .యెక్కడ చదివిందో దాని గురించి! నిజం గా నరకం (ఇంఫెర్నో) లో అమృతం తాగినట్లే ఉంది.ఈ యువ తరం లో ఇది ఫేమస్ కాబోలు.ఆ తరవాత మినర్వా సందు లో తాతా రావు షాపు లో బందరు లడ్డులు హల్వా జీడిపప్పు పాకం కొనుక్కుని దారిలో కలంకారి చొక్కాలు డ్రెస్ లు కొనుక్కుని పెడనలో లోపల గా ఉన్న దుకాణం వెదికిపట్టుకుని కొనుక్కున్నాం.ఈ బట్టలు వేసుకుంటే మరి వేరే ఎయిర్ కండిషన్ అక్కర్లేదు.ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడ స్థిరపడినా చిలకలపూడి పాండురంగడు నడుం మీద చేతులు పెట్టుకుని చూడటం ఆవరణలో మహావృక్షాలు దూరాన మొగలి పొదలు ఆ వెనక హోరేతే సముద్రం బందర్ అంటేనే వెల్లువలా వచ్చే జ్ఞాపకాలు ...యెక్కడ సలాం ఆలేకుం లు బోన్ జూర్ లు కొట్టినా వేషాలు వేసినా ప్రపంచం లో ఎక్కడికి పోయినా ..ఫిర్ భి దిల్ హై బందర్ కా !

No comments:

Post a Comment

My Blog Visitors