ఎంత కాలం ఎదురుచూసేది?ఈ రాష్ట్రం లో శాంతి నెలకొనడాని కి ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి?మనిషి కీ మనిషి కీ మధ్య స్నేహితుడి కీ స్నేహితుడి కీ మధ్య విరోధం సృష్టించే ఈ రాజకీయాలు ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయి? వారి వారి స్వార్ధం కోసం నాయకులు ప్రాంతాని కీ ప్రాంతాని కీ మధ్య అగాధాలు నిర్మించి ద్వేషాన్ని ఎక్కువ చేస్తున్నారు.అసూయని పెంపొందిస్తున్నారు . మనం ఏమవుతాము?మన భాష సంస్కృతి అంతరిస్తుందా? నా కు ప్రాణం అయిన తెలుగు ,తియ్యని తెలుగు కవిత రచన అంతరిస్తాయా ? ఎన్నో తెలుగు రాష్ట్రాలు ఏర్పడి ఎన్నో విభేదాలు వచ్చి దేశం అందరూ మనని చూసి నవ్వుకుంటారా ? మన పొరుగు భాష లైన తమిళం కన్నడం మలయాళం ముందుకు పోతే మనం వివిధ యాస ల తో ముక్కలు గా మిగిలి పోతామా?
ఎన్నాళ్ళు ఈ సస్పెన్సు?
నాకు విసుగెత్తింది ...నా నవలలూ కవితలూ నన్ను మెచ్చుకునే అందరి కీ అందుబాటు లో కి తేవాలంటే ఇంగ్లీషే మేలేమో? ఇంగ్లీషులో భావించి ఇంగ్లీషులో బాధ పడి ఇంగ్లీషు లోనే తరిద్దామా ? తియ్యని తెలుగు ని ముత్యాల లాంటి అక్షరాలని వెన్నెల లాంటి కవిత్వాన్ని ఎలా ...ఎలా మరువగలను?
Saturday, September 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment