కుజుని కోసం....నాలుగో సహస్రాబ్ది కథ... 1 ఒక జీవిత కాలపు స్వప్నం...
అరుణ గ్రహం....అర్దరాత్రి ఆకాశం లో రుధిర కాంతుల తో ధగ దగా మెరిసిపోయే అంగారక గ్రహం...భూమి ,కి
మూడు కోట్ల మైళ్ళ దూరం లో వుంది.సూర్యుడికి పన్నెండు కోట్ల మైళ్ళ దూరం లో దాని చుట్టూ తిరుగుతూ వుంటుంది.
నాకు ఆ గ్రహం అంటే ఇష్టం! ఆరాధన! ఆకర్షణ! మా యునివర్సిటి
పరిశోధన శాలలో వున్నా టెలిస్కోపు ల లో నుంచి
ఎక్కువ గా కుజుడి కోసమే వెదికే వాడిని.అది ఏదో వర్ణించలేని ఆకర్షణ!నా చిన్న తనం నుంచీ,విద్యార్ధి దశ నుంచీ,చివరికి మధ్య ఆసియా
లోని ఈ ఇండికా సెంట్రల్ విశ్వవిద్యాలయం లో బయో మెడికల్ ఇంజనీర్ గా బోధనా పరిశోధనలలో వుద్యోగం చేస్తున్నప్పడివరకూ అన్గారకుడంటే
అరుణ అదే ఆకర్షణ! ఏదో తెలియని శక్తి ఆ కిరణాల తో నన్ను పిలుస్తున్నట్లు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు, బలమైన అయస్కాంత శక్తి మెదడు మీద పని చేసి నన్ను రమ్మని బలవంతపెట్టుతున్నట్లు అనిపించేది.
ఎప్పుడు కుజుని లోని పెద్ద పేద యెర్రని craters ni పర్వతాల్ని
చూసినా,నాకు మళ్ళీ మళ్ళీ కలలు వచ్చేవి....
.ఏదో ఒక రోజు కుజుని నుంచి నా కోసం ఎవరో వస్తారు.లేదా నేనే అక్కడికి వెళ్తాను.ఇది నా అంతరాత్మ లోని బలమైన నమ్మకం గా ఏర్పడి పోయింది.
ఇంకా వుంది....
No comments:
Post a Comment