Pages

Showing posts with label ఆలోచనలు. Show all posts
Showing posts with label ఆలోచనలు. Show all posts

Wednesday, February 24, 2010

లీడర్



లీడర్ చిత్రం చూడటం ఒక గొప్ప అనుభవం. రాజకీయాల మీద తీసిన సినిమాలు ఇదివరకు చాలానే వచ్చ్చాయి కాని ఇది మరొక దృక్పధం .కొంచెం నాటకీయం గా వున్నా ఇది యువత కి కొత్త స్ఫూర్తి ని ఇస్తుంది.
రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంత వుందో మనకందరికీ తెలుసు.ఈ సినిమా లో అర్జున్ తన తండ్రి కోరిక మేరకు ముఖ్యమంత్రి అవడానికి చాకచక్యం గా డబ్బుని విచ్చలవిడి గా వాడతాడు .ముఖ్యమంత్రి గా అవుతాడు కూడా .తండ్రి సంపాదిచిన బ్లాకు మని ని ప్రజాధనం గా ఇస్తాడు .అయినా అతని కి ముఖ్యమంత్రి గా కొనసాగడం కష్టం అవుతుంది.
ఈ సినిమా లో తెలుసుకునేది అదే. ఆ తరువాత అర్జున్ రాష్ట్రం అంతా కాలినడక న తిరిగి ప్రజల తో మమేకం అయి వారి సమస్యలని తెలుసుకుని మళ్ళా విజయం సాధిస్తాడు .ఇదంతా శేఖర్ కమ్ముల హృదయంగమం గా చిత్రించాడు .దీనికి తోడు మిక్కి మేయర్ సంగీతం కొత్త ధ్వని గుండెని తడిమే ధ్వనిని వినిపించింది.
"మా తెలుగు తల్లికీ మల్లెపూదండా" అంటూ టంగుటూరి కృష్ణకుమారి కంచు కంఠం మనసును పునీతం చేసింది. మనకు కావలసింది ప్రజల గుండెలలో చొచ్చుకుపోయి నిలిచేపోయే లీడర్లు.నల్ల డబ్బు బీరువాల నిండా దాచినా కూడా ప్రజల కి కొంచెం సేవ చేసినా వారు క్షమించి గుండెలలో దాచుకుంటారు.

Wednesday, February 10, 2010

కన్యాకుమారి


కన్యాకుమారి వెళ్లి అప్పుడే రెండు సంవత్సరాలుఅయిపోయింది.అక్కడ నాకు నచ్చినది నిరంతరం హోరెత్తే సముద్రం ...మూడు దిక్కులా అదే.... ఉదయమే లేచి సూర్యోదయం కోసం ఎదురు చూసే టూరిస్టులు ...అన్నిటి కంటే మించి అక్కడ ఉన్న పురాతన కన్యాకుమారాలయం...దానిలో అందమైన కన్యాకుమారి విగ్రహం ఆవిడ ముక్కున మిరుమిట్లు కొడుతూ మెరిసే వజ్రం లాటి ముక్కుపుడక.... అక్కడ గుడి లో ఒక ముసలాయన తమిళం లో పాడిన పాట.మరపురాని జ్ఞాపకాలు.

Saturday, January 23, 2010

చలి

ఈ  చలి కాలం ఉదయం ఏమని రాయను.మనసంతా ఖాళీ అయిపొయింది. ఈ నగరం ఒకప్పుడు జీవితం నిండి ఉప్పొంగుతూ ఉండేది.ఎప్పుడూ ఏదో సంతోషం ఏదో హడావుడి ఏదో ఉత్సాహం నిండి ఇది ఆశావాదానికి ప్రతీకగా ఉండేది.ఇప్పుడు అసహనానికి అసూయకి నెలవు గా మారింది.ఏదో నిరుత్సాహం ఏదో అనుమానం ఏదో అనిశ్చిత పరిస్థితి . ఏది కాదు .ఏది గడవదు.ఇది ఒక మార్పా?లేక ఒక తిరోగాతా? ఏదో టయిం
మెషీన్ లో ప్రయాణం చేసి శిధిలం ఆయన నగరం మనుషుల మధ్య ప్రవేసిన్చినట్లుంది .ఇది ఒక చలికాలం. ఆశలు ఘనీభవించిన కాలం.

My Blog Visitors