Pages

Wednesday, February 24, 2010

లీడర్



లీడర్ చిత్రం చూడటం ఒక గొప్ప అనుభవం. రాజకీయాల మీద తీసిన సినిమాలు ఇదివరకు చాలానే వచ్చ్చాయి కాని ఇది మరొక దృక్పధం .కొంచెం నాటకీయం గా వున్నా ఇది యువత కి కొత్త స్ఫూర్తి ని ఇస్తుంది.
రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంత వుందో మనకందరికీ తెలుసు.ఈ సినిమా లో అర్జున్ తన తండ్రి కోరిక మేరకు ముఖ్యమంత్రి అవడానికి చాకచక్యం గా డబ్బుని విచ్చలవిడి గా వాడతాడు .ముఖ్యమంత్రి గా అవుతాడు కూడా .తండ్రి సంపాదిచిన బ్లాకు మని ని ప్రజాధనం గా ఇస్తాడు .అయినా అతని కి ముఖ్యమంత్రి గా కొనసాగడం కష్టం అవుతుంది.
ఈ సినిమా లో తెలుసుకునేది అదే. ఆ తరువాత అర్జున్ రాష్ట్రం అంతా కాలినడక న తిరిగి ప్రజల తో మమేకం అయి వారి సమస్యలని తెలుసుకుని మళ్ళా విజయం సాధిస్తాడు .ఇదంతా శేఖర్ కమ్ముల హృదయంగమం గా చిత్రించాడు .దీనికి తోడు మిక్కి మేయర్ సంగీతం కొత్త ధ్వని గుండెని తడిమే ధ్వనిని వినిపించింది.
"మా తెలుగు తల్లికీ మల్లెపూదండా" అంటూ టంగుటూరి కృష్ణకుమారి కంచు కంఠం మనసును పునీతం చేసింది. మనకు కావలసింది ప్రజల గుండెలలో చొచ్చుకుపోయి నిలిచేపోయే లీడర్లు.నల్ల డబ్బు బీరువాల నిండా దాచినా కూడా ప్రజల కి కొంచెం సేవ చేసినా వారు క్షమించి గుండెలలో దాచుకుంటారు.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ఒక రాష్ట్రానికి గానీ దేశానికి కాని నాయకుడు ఎలా ఉండాలి అనే విషయం లీడర్ చిత్రం లో మన అందరి అభిమాన యువ దర్శకుడు శేఖర్ కమ్ముల చాల బాగా చూపించారు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ వంటి సున్నితమైన చిత్రాలు తీసాక ఇది ఒక వినూత్నమైన ప్రయోగమని చెప్పాలి. నిజాయితీ గా ఉండాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమైపోయిందో తెలుసుకోవాలంటే రాజకీయమే ఒక పెద్ద ఉదాహరణ. ఈ చిత్రం నాకు వాస్తవానికి దగ్గరగా అనిపించింది...అంతే కాక మా తెలుగు తల్లిపాట వెండి తెర మీద చూడటం ( ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత!!) ఒక గొప్ప అనుభూతి!!

    మీ మాటల్లో ఈ చిత్రం గురించి చదవటం చాలా సంతోషం గా ఉంది మధు గారూ!! ఇంకా ఇలాంటి మంచి చిత్రాల మీద తెలుగు లో మీ వ్యాఖ్యలు చదవాలని ఆశిస్తున్నా!!

    ReplyDelete

My Blog Visitors