Pages

Monday, November 24, 2014

కొత్త మందు story

   " నల్లటి నీడ లా పొడుగ్గా  ఎర్రటి అంగీ ,తెల్లటి పంచే గోచి పోసి కట్టుకుని తల మీద జుట్టు ముడి తో వున్నా కోయ వ్యక్తి! వాడు నాకేసి చూసినప్పుడు వాడి ముఖం లో ఒక తీవ్రత .కళ్ళల్లో  అడవి జంతువు క్రూరత్వం కనిపించాయి."
   చావు లేని      కొత్త మందు కన్ప్పెడితే మిలియన్స్  మిలియన్స్ డాలర్స్ సంపాదించాలని ఆశ పడితే ఏమైంది?
.నేను రాసిన" కొత్త మందు " అనే కథ చదవండి .ఆదివారం ఆంధ్రప్రభ 23 నవంబర్ 2014 లో.
మరణించి నడిచే వాళ్ళని జామ్బీస్ అంటారు .ఇది హైతి అనే దేశం లో  మొదట వాడుక లోకి వచ్చిందట.చచ్చి పోయిన వాళ్ళని మళ్ళీ మంత్ర శక్తీ చేత నడిపించి వాళ్ళని తనకు బానిస  లు గా పనిచెయుంచుకొవడమ్ తెలిసిన విచ్ డాక్టర్స్ వుండేవారట .ఈ  జీవన్మ్రుతులు తయారవడాని కి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి.ఒకటి రసాయనికం రెండు మనో వైజ్ఞానికం .బానిసలుగా   అమెరికా కి తీసుకు రాబడి న నల్ల జాతి వారు తాము ఎప్పటి కైనా తిరిగి తమ దేశం అంటె స్వర్గం (గిన్నీ)వెళ్ళాలని ఆశ పడేవారు వారి దేవుడు కి ఆగ్రహం కలిగిస్తే జామ్బీస్ అయిపోతామనే భయం ఉండేదట.ఇది కాక విచ్ డాక్టర్స్ కొన్ని మందులు ఇచ్చి వారిని జాంబీస్ లాగ నూరో టాక్సిన్  తో మారుస్తారని ఒక సిద్ధాంతం. అదికాదు, కొంత మంది మానసిక రోగాలున్న వారిని చూసి జాంబీస్ అనుకునే వారని మరొక అభిప్రాయం. ఏమయినా ఈ చచ్చి బ్రతికి నడిచె జాంబీస్ గురించి ఎన్నో కథలు సినిమాలు వచ్చాయి.

.


Friday, November 14, 2014

ఆత్మ పుస్తకం



                                                          ఆత్మ పుస్తకం

                                    మీట నొక్కితే
                    వేల గొంతులు ,వర్ణ చిత్రాలు అనుభూతులు  నిండిన  అక్షరాలు
                     మౌజ్ కదిపితే  కవితలు  కథలు   గీతాలు సంగీతాలు   చలన చిత్రాలు 
                        కవులు కవయిత్రులు చిత్రకారులు దర్శకులు దార్శనికులు 
                        కొన్నివేల గుండెల్లో అంతరాంతరాల పొరల్లోంచి ఉబికి  ఒచ్చిన   ఉత్తేజం 
                          భూమి మధ్య నుంచి చివరి దాక ,నాసా నుంచి గాలక్సీ చివరి దాక 
                             ఒకే వేగం తో ఒకే ఆవేశం తో ఆనందం  తో ప్రవహించే డిజిటల్ విశ్వం
                           ఒకరికి విజయపు మందహాసం మరొకరి అపజయపు అశ్రు తరంగం  
                      ఒకరికి జన్మదిన శుభాకాంక్ష మరొకరికి ఆఖరి వీడుకోలు 
                                            మీట నొక్కితే అందరి ఆనందాలు విషాదాలు 
                           నా గుండెలో కి తిన్నగా అంతర్జాలపు సెలయేరు లా 
                        కావ్యాలు కళ ఖండాలు చలన చిత్రాలు నృత్యాలు కవితలు గానాలు కథలు నవలలు 
                             ఒక మనసున్న మానవ సమూహం లక్షల గొంతుల తో మాట్లాడుతున్నట్లు 
                       ఒక వేదనాభరిత ఆలోచనాస్రవంతి వెయ్యి వోల్టుల కాంతి తో నన్ను కమ్ముకున్నట్లు 
                            అందరితో గొంతు కలిపి అందరిని అభినందించి విషాదం లో వినోదం లో 
                                      ఒకటి గా కలసిపోయి 
                                             ఈ మీట నొక్కక పోతే క్షణం కదలదు 
                                              ఈ మౌజు కదలక పోతే కాలం గడవదు 
                                               వేల గుండెల చప్పుడు వినకపోతే 
                                               వేల అనుభూతుల కి స్పందించి మమైకం కాకపోతే 
                                               రోజు గడవదు భూమి తిరగదు 
                                                 అందుకే ఇది ముఖ పుస్తకం కాదు 
                                                    కన్నీరు తుడిచే ఆత్మీయ హస్తం చిరునవ్వు తో కలిపే
                                                     ప్రేమ దరహాసం 
                                                   మన ఆత్మ పుస్తకం 
                                

Wednesday, November 5, 2014

ఎందుకు రాస్తూనే ఉంటాము?

ఎందుకు రాస్తూనే ఉంటాము? ఎవరు చదవక పోయినా బహుమతులు రాకపోయినా కొందరు అసలు ఏమీ బాగా  లేదన్నా రాయడం ఒక ఉన్మాదం.ఒక మత్తు.ఒక స్నేహితుడు ఇక సైన్సు ఫిక్షన్ రాయకండి మామూలు కథలు రాయండి అని సలహా ఇస్తే ఇంతవరకు రాసినది బాగాలేదనే కదా ...మరొక సంపాదకుడు మనం రాసినది నచ్చలేదని అంటె ఇప్పటికీ ఇదివరకటి లాగ నే ముళ్ళు  గుచ్చుకుంటాయి..ప్రేమ కథలు రాయాలా? అత్తా కోడళ్ళ కథలు విప్లవాల కథలు స్త్రీలని  అన్యాయం చేసి అవమానం చేసి కథలు సమాజం లో అణగదొక్కబడి నిస్పృహ పడె పేదల కథలు బాధ ల కథలు రాయాలా? నాకు తెలిసి నేను స్పందించి చదివే వాళ్ళని స్పందింప చేయగలిగితే అదే మంచి కథా ?ఊహలు ఫాంటసీ గేలక్సీ ల లో యెగిరి పోవడం విలన్స్ గా మారిన డాక్టర్లు మాంత్రికులు రాజకుమార్తెలు ఇవన్ని సాహిత్యం కాదా?  కొత్త దారి వెతుక్కునే    సమయం వస్తే   నాలుగు రోడ్ల మధ్య నిస్సహాయం గా నిలబడి పోవడం ...ఇదో అంతరంగ మథనం...ఇదో స్టేటస్ .  కాని ఏ త్రిల్ ఉందొ రాయడం లో అది ఎలా పోగొట్టు కొను? అదీ ఏమీ ప్రేమ లేని మనుషుల ల కోసం .అందుకనే  నా రచనలు అలా ఆకాశం లో పరిభ్రమిస్తూ ఉంటాయి చదువరుల కోసం నిరీక్షిస్తూ... 

Sunday, November 2, 2014

ఏమి రాయాలి?


      కథ లెందుకు  రాస్తాము. కొంత మంది ఎవరు మెచ్చుకోక పోయినా ఎవరు చదవక పోయినా యందుకు రాస్తూ నే వుంటారు?కొంతమంది ఒక ఆవేదన తో రాస్తారు .బాధ లోంచి కవిత్వం పుట్టినట్లె ఆవేదన  లోంచి కథ కుడా తన్నుకోస్తుందేమో !ప్రేమ్చంద్ రాసిన కథ లో ముహూర్తం కోసం వచ్చిన  ఒక మాదిగ  వాడిని  పురోహితుడు చచ్చిపోయేదాకా  పనిచేయుంచు కోవడం  సాక్షి సాహిత్యం పేజీ లో రాసిన వ్యాసం లో చదివిన తర్వాత రెండు రోజులు అదే ఆలోచనలలో మెదిలింది,మనిషి బాధ ల గురించి రాసినా, దోపిడీ, కుల వివక్షత, స్త్రీలకి  జరిగే అన్యాయాలు .,అల్పసంఖ్యాక  వర్గాలకి జరిగే అవమానాలు  వీటి గురించి రాస్తే చాలా కాలం కథలు గుర్తుండి పోతాయి'.కెవలమ్ వినోదం గురించి రాస్తే హార్రర్ సస్పెన్స్ సైఫీ కథలు ఎవరు చర్చించరు.   ఎవరు గుర్తు పెట్టుకొరు. ఎలా?ఇక నుంచి మామూలు కథ లు రాయండి అని రాజారామమొహన రావు గారు ఈ రోజు అన్నారు. అంటె ఇంత వరకు రాసిన సైన్స్ ఫిక్షన్ స్పేస్ ఫిక్షన్ బాగా లేదనే కదా?ఎవరికి నచ్చని  కథలు ఎందుకు రాయడం ?ప్రేమ కథలు మెలోడ్రామా కథలు రాయాలా?వాటికి ముడి సరుకు కావాలంటే జీనితం లోకి లోతుగా దిగి అధ్యనం చెయాలి.  అసలు సైన్స్  ఫిక్షన్ కి స్థానమే లేదా .విజ్ఞానమ్ మన జీవితం లో అంతర్భాగం కాదా? అది వదిలి కవిత్వం ఉపమానాలు సర్రిఅలిస్టిక్ కవిత్వం లాంటి కథ లు రాయాలా .ఏమి  నిరూపించుకోవాలి నేను? 

  1.  ఏమి రాయాలి?

Saturday, October 25, 2014

నువ్వు ...నేను



   
  చీకటిలో నేను ...
    వెలుతురు లో నువ్వు
     ఆవేదన లో నేను 
      ఆనందం లో నువ్వు
      ఎప్పటికప్పుడు పరుగెత్తు తు నువ్వు
       ఒక చోటే నిశ్చలం గా నేను 
        వెండికొండల వెనక సూర్యోదయాల కోసం నువ్వు 
         కీకారణ్యాల రహస్యాలని చేదిస్తూ నేను 
          జీవన గానం లో శృతి  కలిపే మధుర స్వరం నీది 
      మరణ వేదన లో సృష్టి విచిత్రం తెలిసి పెట్టె ఆర్తనాదం నాది!
ఈ చివర నేను ఆ చివర నువ్వు ,హరివిల్లు  తల లో తురుముకునే   అవకాశాలు నీవి
     నల్ల మేఘం కిరీటం గా ధరించే సందర్భం నాది.    

Monday, September 29, 2014

Blue and Green

Free on 5-9 14 on amazon.com
A story set in the future ...Fourth Millennium and a sequel to "War For Mars" Hani Amrapali returned to Earth after his sojourn in Mars,where he went in search of a...
AMAZON.COM


  • ఈ సాయంత్రం అలసి వచ్చిన వేళ సాహితీ మిత్రులDr.Madhu Chittarvu గారి ఆప్త వాక్యంతో తన నవలలు కథ పుస్తకాలు కొరియర్ ద్వారా అంది అమితానాందాన్ని కలగజేసి అలసటను మాయంజేసాయి. డాక్టర్ గారికి నమస్సులతో.. From poet kcube verma 

My Blog Visitors