కథ లెందుకు రాస్తాము. కొంత మంది ఎవరు మెచ్చుకోక పోయినా ఎవరు చదవక పోయినా యందుకు రాస్తూ నే వుంటారు?కొంతమంది ఒక ఆవేదన తో రాస్తారు .బాధ లోంచి కవిత్వం పుట్టినట్లె ఆవేదన లోంచి కథ కుడా తన్నుకోస్తుందేమో !ప్రేమ్చంద్ రాసిన కథ లో ముహూర్తం కోసం వచ్చిన ఒక మాదిగ వాడిని పురోహితుడు చచ్చిపోయేదాకా పనిచేయుంచు కోవడం సాక్షి సాహిత్యం పేజీ లో రాసిన వ్యాసం లో చదివిన తర్వాత రెండు రోజులు అదే ఆలోచనలలో మెదిలింది,మనిషి బాధ ల గురించి రాసినా, దోపిడీ, కుల వివక్షత, స్త్రీలకి జరిగే అన్యాయాలు .,అల్పసంఖ్యాక వర్గాలకి జరిగే అవమానాలు వీటి గురించి రాస్తే చాలా కాలం కథలు గుర్తుండి పోతాయి'.కెవలమ్ వినోదం గురించి రాస్తే హార్రర్ సస్పెన్స్ సైఫీ కథలు ఎవరు చర్చించరు. ఎవరు గుర్తు పెట్టుకొరు. ఎలా?ఇక నుంచి మామూలు కథ లు రాయండి అని రాజారామమొహన రావు గారు ఈ రోజు అన్నారు. అంటె ఇంత వరకు రాసిన సైన్స్ ఫిక్షన్ స్పేస్ ఫిక్షన్ బాగా లేదనే కదా?ఎవరికి నచ్చని కథలు ఎందుకు రాయడం ?ప్రేమ కథలు మెలోడ్రామా కథలు రాయాలా?వాటికి ముడి సరుకు కావాలంటే జీనితం లోకి లోతుగా దిగి అధ్యనం చెయాలి. అసలు సైన్స్ ఫిక్షన్ కి స్థానమే లేదా .విజ్ఞానమ్ మన జీవితం లో అంతర్భాగం కాదా? అది వదిలి కవిత్వం ఉపమానాలు సర్రిఅలిస్టిక్ కవిత్వం లాంటి కథ లు రాయాలా .ఏమి నిరూపించుకోవాలి నేను?
- ఏమి రాయాలి?
No comments:
Post a Comment