Pages

Tuesday, November 25, 2014

కొత్త మందు

కొత్త మందు
డా. చిత్తర్వు మధు
సృష్టిలో తీయనిది స్నేహంమేనోయి తీయగా పాడుతోంది హసిత.
స్నేహం కంటే తీయనిది ప్రేమ.. అదీ నీకు నాకు మధ్య...’’ అన్నాను నేను. ఘాట్ రోడ్‌లో వేగంగా పోవడం కష్టం. చుట్టూ ఎత్తైన కొండలు. కొండలమీద దట్టంగా చెట్లు. రోడ్డు పాములా మెలికలు తిరిగి కొండను చుట్టుకుపోతోంది. ఇనోవా కారుని ఆ పెద్ద మెలికల్లో లాఘవంగా తిప్పకుంటూ, పాటలు పాడుకుంటూ ప్రయాణిస్తున్నాం ఇద్దరం.
ప్రేమకంటే మించినది, స్నేహం కంటే మించినది ఇంకేదో వుందట! ఈ మధ్యన ఓ రచయిత్రి అంటోంది!” అన్నాను.
ఏమిటది?”
చెప్పలేదు. మీరే వూహించుకోండి అంది. ఏదయి వుంటుంది?”
డబ్బేమో....?”
షాక్ తిన్నాను. నిజంగా...? నేను త్యాగం అనుకున్నాను!”
డబ్బుతో ప్రేమని కొనవచ్చనుకుంటా!” అంది హసిత.
ఆడవాళ్ళు ఎంత సినికల్‌గా ఆలోచించగలరు!
స్నేహం తీయనిది కాబట్టే ఇప్పడు ఈ వానలో మబ్బుల మధ్య ఘాట్ రోడ్‌లో కొండల మధ్య లోయలోని మారుమూల పల్లెటూరికి వెళుతున్నాం అన్నాను.
అరకు వెళ్ళేదారిలో అనంతగిరి తర్వాత ఒక పక్క దారి పడితే కొండకిందకి ఇరవై కిలో మీటర్లు దిగితే వస్తుంది ఈ వూరు. పేరు భీంపల్లి. ఇక్కడే నారిసెర్చి సెంటర్. నువు హసితా తప్పక రావాలి! వచ్చితీరాల్సిందే!”
బాల్య మిత్రుడూ, మెడికల్ కాలేజీ రోజుల నుంచి ఇప్పటికీనాతోకాంటాక్ట్లో వున్నవాడు డాక్టర్ రంగనాథం.
ఈ రంగనాథం చాలా బ్రిలియంట్‌గా వుండేవాడు. ఆరోజుల్లో కాలేజీలో ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఎనాటమీలలో గోల్డ్ మెడలిస్ట్.
నాలాంటి మామూలు తెలివితేటలు గలవాళ్ళం కొందరం ఎలాగో మెడిసిన్ పాసయి కాకినాడ దగ్గర చిన్న వూళ్ళోనో, ఇతర పట్టణాల్లోనో ప్రాక్టీస్ పెట్టుకుని సెటిలయితే అతను మాత్రం ఫార్మకాలజీలో ఎం.డి చేసి అమెరికా వలస వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగిరారంటారు కదా, వీడు తిరిగి వచ్చాడు. వచ్చినా ఏదో సిటీలో వుండక ఈ మారుమూల ఏజెన్సీ గ్రామంలో స్థిరపడ్డాడు.
రిసెర్చి!రిసెర్చి అంటే ప్రాణంరా నాకు అనురాగ్
వీడికి అమెరికాలో సంపాదించిన డాలర్లు చాలనే వున్నాయనుకుంటాను.
ఫార్మకాలేజీ అంటే మందుల శాస్త్రం. ఇది చదివినవాళ్ళుమెడికల్ ప్రాక్టీస్చేయరు. మెడికల్ కాలేజీలలో బోధనావృత్తిలో చేరుతారు. లేదా మందులు తయారు చేసే కంపెనీల్లో చేరి మందుల తయారీలో పరీక్షలు చేయడంలో పని చేస్తారు. మంచి జీతాలే వస్తాయి. కాని పేషంటుకి చికిత్స చేసే పనిలో వుండరు.
రంగనాథం ఒక ఎక్‌సెంట్రిక్ (వింతమనిషి) అని నాకు తెలుసు. అయినా, ఎంత ఫ్రెండయినా కొన్ని వ్యక్తిగత విషయాలు అడగను. అమెరికాలో కొన్నాళ్ళు మంచి వుద్యోగాలు చేసి, పెళ్ళి చేసుకొని తర్వాత భార్యతో విడిపోయినట్లు మాత్రం తెలుసు.
ఎందుకురా ఇంకా నీకు రిసెర్చి?” అంటే ఒకటే సమాధానం.
డబ్బు. డబ్బురా! ఒక్క molecule (మందు) కొత్తది కనిపెడితే చాలు మిలియన్స్ మిలియన్స్ సంపాదించచ్చు. కొత్త మందు కనిపెడతా! నా పేరు శాశ్వతం కావాలి. కావల్సినంత డబ్బు ఆ మందు పేటెంట్ హక్కులు ద్వారా రావాలి!హ్హ!హ్హ!హ్హ!”. ఇదే వరస ఛాటింగ్‌లో.. ఫోనులోనూ.
అతనితో ఇంటర్‌నెట్, లేక పోన్ లోనే సంభాషణ. ఇరవై ఏళ్ళుగా చూడనే లేదు, వీడియో ఛాట్‌లోతప్ప.
ఇప్పుడు హసిత, నా డాక్టరు భార్య కూడా అంటోంది. ప్రేమని మించింది డబ్బే.. డబ్బేనట!.
నాకయితే వైద్యం చదివింది మనుషుల బాధలు తీర్చడానికి, మందులు కనిపెట్టేది జబ్బులు తగ్గించడానికి అనే అనిపిస్తుంది. ఉచితంగా వైద్యం చేయాలి అని పిచ్చి ఆదర్శాలు కూడా పెట్టుకున్న పాత కాలం మనిషినేమో నేను. అందుకనే కాకినాడ దగ్గర చిన్న టౌన్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌గా మిగిలిపోయానేమో. అంత సంపాదించాంఇంత సంపాదించాం అమెరికాలో అని వచ్చీ పోయే స్నేహితులని చూడటం, కలవడం తప్ప డాలర్లు కొనే వైభోగాలు తెలియదు. నా జీవితం ఒకే సరళరేఖలో గడిచిపోయింది. మా ఇద్దరి బుద్ధులు సమాంతరరేఖలయినా ఇంత వరకూ హసిత నాతోనే ఉంది. తనకి డబ్బు కొనిచ్చే సుఖాల మీద ఇంత గ్లామర్ వుందని ఇప్పటిదాకా తెలియదు నాకు!
కారు మలుపులు తిరిగి అనంతగిరి అన్న బోర్డు దగ్గర ఆగింది. ఇక్కడి నుంచి పక్కదారి, లోయలోకి.భీంపల్లి ఇరవై కిలోమీటర్లు డౌన్‌లో వుంటుంది. చీకటి పడకుండారా!’’ రంగనాథం క్లియర్‌గా ఆదేశించాడు.
నిన్ను చూడాలి. నువ్వూ హసిత భీంపల్లి రండి! నా రిసెర్చి ఇక్కడే జరిగింది. ఇప్పుడు సక్సెస్ అయింది. నీకు చూపించాలి తప్పకరా రా! ఇన్నేళ్ళ తర్వాత నిన్ను చూడాలని, మాట్లాడాలని వుంది.
ఓరేయ్! ప్రాక్టీసు పోతుందిరా, నువ్వేరాకూడదా!”
నో! మూర్ఖుడా! ప్రపంచం విస్తుబోయే ఒక పరిశోధన చేసి మందు కనుకుని, ఆ విషయం ముందు నీకే చూపిస్తానంటే వద్దంటావేమిరా? ఇది బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్, ఈ రిసెర్చి మందుతో ప్రపంచం మారిపోతుంది. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి.ఆ పిచ్చి వూళ్ళో చిల్లర ప్రాక్టీస్ చేసే అవసరం ఇకలేదు నీకు. నాకు ఎవరూ లేరు!మీరిద్దరినీ పార్టనర్స్‌గా చేసుకుంటాను. అహ్హహ్హ!!”
వాడి నవ్వు వింతగా వుంది.ప్రపంచాన్ని, ప్రపంచ ఔషధరంగాన్ని జయించానురా, నేనే.
ఇది నా ఆతృతని పెంచింది!.
సరే!వస్తా! అయినా ఆ ఏజన్సీలో ఏముందిరా? చుట్టూ కోయవాళ్ళు, చెట్లూ, మలేరియా దోమలూతప్ప! కాని వొస్తాం!”
అలా, నేను హసితా బయలుదేరాం. కారుని మెలికలు మెలికలు తిప్పితూ రోడ్డు మీద దింపాను లోయలోకి. చుట్టూ చీకటి అలుముకుంది. తెల్లటి మంచు తెరలు, నల్లటి చీకటి కలిసి చుట్టూ ఏమీకనబడకుండా.. చుట్టూ కొండలూ కూడా నల్లటి రంగులో కలిసిపోయాయి.
కారు ఆపుకుంటూ, దారిన నిలబడిన ఒక మనిషిని డాక్టర్ రంగనాథం ఆసుపత్రి ఎక్కడ బాబు?”
వాడు నల్లటి నీడలా, పొడుగ్గాఎర్రటి అంగీ తెల్లటి పంచె గోచిపోసి కట్టుకొని, తల మీద జుట్టు ముడితో వున్న కోయ వ్యక్తి.
వాడు నాకేసి చూసినప్పుడు వాడి ముఖములో ఒక తీవ్రత, కళ్ళల్ళో అతని జంతువు క్రూరత్వం కనిపించాయి నాకు. లేక అనిపించిందా!
రం...గ...నా...ధం... డాక్టరా.... తిన్నగా పో! ఎదురుగా ఆసుపత్రి పెద్దది బోర్డు కనిపిస్తాది”!
వాడికి ఎంతుకంత కోపం? అనుకుంటూ కారు పోనిచ్చాను.
***
అమెరికాలో సంపాదించినడబ్బంతా పెట్టి కట్టినట్లున్నాడు. మన్యం రిసెర్చి సెంటర్. డైరెక్టర్ డా.పి. రంగనాథం, F.R.C.P. అన్న బోర్డుతో చాలా పెద్ద, రెండంతస్తుల భవనం చూడగానే అనిపించింది.
 నన్ను చూస్తూనే కావలించుకున్నాడు,అనురాగ్, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి!” అంటూ.
పొడుగ్గా బలిష్టంగా సూట్‌లో వున్నాడు. నెరిసిన జుట్టు జులపాలు తిరిగింది. తెల్లటి మీసం, గోటీ గడ్డం. కళ్ళకి అద్దాలులేవు. కాంటాక్ట్లెన్స్‌లు అనుకుంటా.
రాత్రి చీకట్లు ముసురుకుంటుంటే నాకు మంచి ఆతిధ్యం ఇచ్చాడు. ఇంట్లో నర్సింగ్ ఆర్డర్లీఒకామె, బయట కారు డ్రైవరు తప్ప ఎవరూ లేరు. కానీ రోటీలు, పులావ్, చికెన్ కర్రీలతో, స్కాచ్, విస్కీటమోటా సూప్ లతో, ఐస్ క్రీంతో మంచి డిన్నర్ ఇచ్చాడు.
ఇంతకీ నీ  రిసెర్చి చెప్పావు కాదు అన్నాను. అందరం డ్రాయింగ్ రూంలో కూర్చున్నాం. స్టాఫ్ వెళ్ళిపోయారు. అడవిలో ఇప్పడు దట్టంగా చీకటి అలుముకుంది. నిశ్శబ్దంలో చెవులు పగిలేలా కీచురాళ్ళ మోత మొదలయింది.
నీకర్థం కావాలంటే నీకు నా అంత తెలివితేటలు ఉండాలిరా! నువ్వు డాక్టరైయినా నీకర్థం కాని విషయాలు చాలా వున్నాయి. సింపుల్‌గా చెబుతా! విను!
హసిత నాకేసి అదోలా చూసింది. వీడి గర్వం సంగతి నాకు తెలుసు. నా భార్యకి తెలీదు కదా.
వీడి గర్వం ఇప్పుడుమెగలో మానియాఅహంకారంలోకి ఎదిగినట్లుంది.
ఒరేయి అనురాగ్, చావు ఎందుకు సంభవిస్తుందో తెలుసుకదా?”
నేను తెల్ల మొఖం వేశాను ఏ కారణం అయినా వుండచ్చు. హర్ట్ ఎటాక్, స్ట్రోక్, కేన్సర్, ఏక్సిడెంట్..
నీ ముఖం. నువ్వు చెప్పమ్మా డాక్టర్ హసిత
హసిత తడబడింది.కొలెస్టరాల్ ఎక్కవ అవడం, షుగరు వ్యాధి, రక్తస్రావం...
అబ్బ! మీఇద్దరికీ అస్సలు తెలివే లేదు! చివరిదే కొంత వరకూ కరెక్ట్.
అంటే?” ఇద్దరం అడిగాం.
ఆక్సిజన్ లేకపోవడం. జబ్బు ఏదయినా కానీ చివరికి ఆక్సిజన్ లేకనే అవయవాలు దెబ్బతిని చచ్చు పడిపోతాయి. ఉదాహరణకి రక్తంలోని హిమొగ్లోబిన్ అన్ని అవయాలకీ అక్సిజన్ సరఫరా చేస్తుంది. రక్తస్రావం జరిగితేహిమొగ్లోబిన్ లేక అక్సిజన్ అందదు. రక్తనాళాలు కొలెస్టరాల్ వల్ల మూసుకుపోతే కూడా అంతే. హర్ట్ ఎటాక్, స్ట్రోక్ వస్తాయి.అంతెందుకు ఏకారణం వల్ల అక్సిజన్ లేకపోయినా మనిషి చనిపోతాడు.ఓకె?”
ఓ.కె!
నేను అక్సిజన్ లేకపోయినా మనిషి అవయవాలు బతికించగలిగే మందుని కనిపెట్టాను.
ఇద్దరం ఆఁ అని నోళ్ళు తెరిచాం.
నీ కేమన్నా  పిచ్చెక్కిందారా?” అన్నాను   నేను.
లేదురా ! నువ్వే మూర్ఖుడివి. నేను ఇన్ని దశాబ్దాలు ఈ ఏజన్సీ అడవుల్లో తిరిగిఔషధ వృక్షాలు, మొక్కలన్నీ వెదకి, మనిషి రక్తంలో కలిసి అక్సిజన్‌ని ఎక్కువగా సరఫరా చేయగలిగే మందు కనిపెట్టాను. ఉదాహరణకి హిమోగ్లోబిన్ నాలుగు అక్సిజన్అణువులను మోసుకెడుతుంది. నా మందు, దాని పేరు, కెమికల్ స్ట్రక్చర్ నీకు అర్థం కావు లేరా. అది వంద కణాలు ఆక్సిజన్‌ని పట్టుకుని తీసుకెళ్తుందిరా. అవయవాలు చచ్చుపడవు.
అంటే?”
అంటే ఎస్‌ఫిక్సియా వచ్చిందనుకో. ఈ మందు అక్సిజన్‌ని ఇస్తుంది. నీళ్ళలో మునిగినా, ఏక్సిడెంటులో రక్తస్రావం జరిగినా, గుండెపోటు వచ్చినా.... గుండె ఆక్సిజన్ లేక ఆగిపోయినా ఈ మందు ఇంజెక్షన్ చేస్తే ఆ రోగికి ఆక్సిజన్ దొరుకుతుంది. ఇంతకంటే నీకర్థం అయేట్లు చెప్పలేనురా !”
మై గాడ్! ఆ ఇంజక్షన్ ఎమర్జెన్సీలో పేషంట్ ఎక్కడేవుంటే ఎలా ఇస్తాం?”
అవును. అది ఒక సమస్య. ఇదీ కాక, ఇది ఏరోజు కారోజు మూత్రపిండాల నుంచి ఇన్‌యాక్టివేట్ అయి విసర్జించబడుతుంది.ఏక్షన్ఉండదు. రోజు ఇవ్వాలి. రోజు ఇస్తే చాలాఖరీదు కూడా.
అదే కిటుకు అన్నా.
మరి ఎలా మార్కెట్ చేస్తావోయ్? ఎప్పడో వచ్చే జబ్బుకి రోజు ఎలా? ఎమర్జన్సీ డ్రగ్ కింద ఇవ్వచ్చు. కాని ఈ లోపల వాడు చచ్చిపోతాడు కదా. ప్రాక్టికల్కాదు రా.
అహ్హ హ్హ!” నవ్వసాగాడు రంగనాథం.
ఆలోచించా. దీనికి ఉపాయం, చెట్ల నుంచి తీసిన   ఈ molecule ni  ఒక E Coli అనే సూక్షజీవిలో పెట్టా. ఇది aa molecule ni  తయారుచేసి, దాన్ని ఒక RNA వైరస్‌లోపెరిగేట్లు చేస్తుంది. వైరస్‌లు మనిషి కణాల్లో ప్రవేశించి DNAని వాడుకుంటూపెరుగుతాయి. అవి ఆ మందుని మనిషి శరీరంలోతయారు chestyaayi. రికాంబినెంట్ టెక్నాలజీ అని మందుల పరిశ్రమలలో వాడుతున్నారు. నేను ఈ వైరస్‌నిటీకాలు ద్వారా మనిషి కిస్తే ఆక్సిజన్ శరీరంలో పెరిగి వాడికి ఆ మందుని తయారు చేస్తుందని వూహించి అలా చేసి సక్సెస్ అయ్యాను. నా ల్యాబ్‌లోకల్చర్‌లన్నీఈ వైరస్‌లవే. అహ్హహ్హ!E Coliని కూడా పెంచాను. హైబ్రిడోమా తో వైరస్‌లనిచేశాను. హ్హ హ్హ హ్హ. విపరీతంగానవ్వి నవ్వి వాడికి దగ్గు వచ్చింది.
దగ్గి కళ్ళు తుడుచుకొని అన్నాడు. రికాంబినెంట్DNATechnologyతెలుసా నీకు? అదే ఇది.నా పరిశోధనకి నోబుల్ ప్రైజ్ రావాలి అసలునాకు! ఈ వూళ్ళో కోయవాళ్ళందరికీ ఈ వైరస్ టీకాలు ఇచ్చాను. పరిశీలించాను. అద్భుతం. వాళ్ళెవరూ రక్తస్రానం అయినా, హర్ట్ ఎటాక్వచ్చినా చావడంలేదు. బతుకుతున్నారు. ఇది ఆరు నెలలుగా గమనించా. ఇకఈ వాక్సిన్‌కు పెటింట్హక్కలు తీసుకునితయారుచేయడమే తరువాయి!”
అది అంత తేలికగాదు భాయి!” అన్నాను.
వీడి గర్వం చిరాకొచ్చింది.
జంతువులకిచ్చి, మనుషులకిచ్చీ సరిగ్గా పరిశోధనలు చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిరూపించాలి. అయినా ఆ మాలిక్యుల్ పేరేంటిరా? అయినా ఈ మారుమూల వైరస్ ల్యాబ్ ఏమిటిరా? ఎలా?”
నీ బుర్రకి అర్థం కాని కెమికల్ ప్రాసెస్‌రా అది. వాక్సిన్ చేయడానికే పదేళ్ళు పట్టింది.రూలు ప్రకారం జంతువులో అంటే ఎలకలలో, కోతులలో ఇచ్చి చూడడానికి మరోఐదేళ్ళు పట్టింది. ఇక ఫేజ్ 3 అంటే మనుషుల్లో ఒకఆరు నెలలు చూసానుకదా. ఇంకెన్నాళ్ళు.దీనికి మరొక ఐదేళ్ళు పడుతుంది. ఎవడాగుతాడు అన్నాళ్ళు? హ్హ హ్హ హ్హ!” నవ్వసాగాడు.నేనుంటానా బతికి అన్నాళ్ళు?”
హసిత అంది..సార్, జంతువుల మీద ప్రయోగాలలో జరిగింది మనుషులలో జరగకపోవచ్చుమో కదా. డ్రగ్ కంట్రోల్ అధారిటీ ఒప్పుకోకుండా ఎలా మార్కెట్ చేస్తారు?”
రంగనాథం లేచినిల్చుని పచార్లు చేయసాగాడు. పాత స్నేహం జ్ఞాపకార్ధం బ్లాక్ లేబుల్ జానీవాకర్విస్కీ బాటిల్ ఓపెన్ చేసి పెట్టాడు. అతను తాగుతున్నాడు. నేను తాగుతున్నాను వింటూ.
కాని వాడు ఒక త్రీక్షణమైన పిచ్చి ఆవేశంలో వున్నాడు.
లోపలకి పోయి పెద్ద ఫైలు తీసుకొచ్చి, ఇంకో కవర్‌లో సిడిలు పెన్ డ్రైవ్‌లు కూడా తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు.
ఒరే అనురాగ్. నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండువి, ఈ ఫార్ములాలు మందుల తయారీ ప్రక్రియ అంతా నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు నీ భార్య డాక్టర్లు. తీసుకెళ్ళండి. దీనిని మార్కెట్ చేసుకోండి.మిలియన్లు డబ్బు నీ సొంతం. ఇదే నీకు నేనిచ్చే బహుమతిరా!”
తాగేదంతా ఒక్కసారి మత్తు దిగింది. “ఏమిటి మాట్లాడుతున్నావురా?ఫేజ్ 3 ట్రయల్ చేసి నువ్వే ఈ మందు తయరు చేసుకోవచ్చు కదా? ఇన్ని దశాబ్దాల కష్టం... ఇంత పరిశోధన చేసి... ఇదేంటిరా?”
హసితలో చలనం. వేగంగా లేచి నిలబడి థ్యాంక్యు సర్, మేం మీ ఆశయం నెరవేరుస్తాం!” కవరు తీసుకొంటోంది.
ఎప్పుడూలేనిది హసిత కళ్ళలో దురాశా, మిలియన్ల కలల మెరపు చూశాను నేను. డబ్బు... డబ్బు మహిమ!

ఈ ఏజన్సీలోని కోయవాళ్ళందరికీ ఈ మందు ఇచ్చాను. అదే మానవులలో ఫేజ్3ప్రయోగం. ఇక్కడ ఒక ఫ్రీ క్లినిక్ కూడా నడుపుతున్నాను. అందరికీ ఇంజక్షన్లు చేసేశాను. జనాభా మూడువేల మంది. ఆశ్చర్యం.. అందరికీ బ్రహ్మాండంగా పని చేస్తోంది! దెబ్బలు తగిలినా, ఏక్సిడెంట్‌లో రక్తం పోయినా చావడంలేదు. వారం రోజుల పైనే బతుకుతున్నారు.
మరి...?”
ఒక చిన్న ఇబ్బంది. ఈ మందు పేరుఏంటీ డెత్ అని పెట్టాను అనుకో. ఇది శరీరంలో కండరాల్లో గుండెలో, నరాల్లో పనిచేస్తోంది. కాని మెదడులోని రక్తానికీ మెదడుకీ మధ్య వుండే అడ్డంకిని (Blood Brain Barriers) దాటడంలేదు. రక్తస్రావం వల్ల అక్తిజన్ లేక మెదడు చచ్చిపోతోంది.   Ante కార్టెక్స్. కాని ఈ మందు వల్ల మెదడు కింది భాగాలు Limbic  సిస్టమ్, medulla  సెరిబెల్లం meeda  పనిచేస్తున్నాయి. విచక్షణపోతోంది. కాని జంతువుల్లా ఆటోమాటిక్చర్యలు మాత్రం మిగిలిపోయాయి!”
అంటే!”
అంటే! అంటే!”
 వాడు వికారంగా నవ్వాడు. కిక్కెక్కువయిందా లేక విజయోత్సాహంలో వున్నాడా లేక పిచ్చిపట్టిందా?
వాళ్ళని తుపాకీతో కొట్టినా, కత్తితో గుండెలో పొడిచినా, నీళ్ళలో ముంచినా చావరు. మెదడు మాత్రం పోతోంది. ఆలోచన, వివేచన, నియంత్రణా శక్తులు పోతున్నాయి. జంతువుల లాగ ఆటోమాటిక్గా పని చేసేFlight and Fright. ఆహారంకోసం యుద్ధం చేయడం, అపాయం అయితే పారిపోవడం మాత్రం చేస్తున్నారు. హ్హ!హ్హ!హ్హ!మరి జంతువులలోఈ మందు పనిచేసింది కదా! జంతువుల్లా అయిపోయారు. అకలేస్తే పులిలా మాంసం కావాలి ! ”
నాకు వణుకువచ్చింది.
అదేంటిరా?అలా అయిపోతే వాళ్ళని మనుషులు అనరురా..... వాళ్ళని.... గొంతులోని మాట పూడుకుపోయింది. జాంబీలు..జాంబీలు అంటార్రా!”
హసిత అరిచింది పర్వాలేదు సార్. కొద్ది మార్పులు చేయించచ్చు. ఫార్మసీ ప్రొఫెసర్లతో మాట్లాడి మేం మందు స్ట్రక్చర్ మార్చిస్తాం. ఫేజ్ 3 మళ్ళా చేస్తాం.
బయట చలిగాలి హోరున వీస్తోంది. దూరాన ఎందరో మనుషులు కలకలంతో వస్తున్న చప్పుడు. లేక నా చెవులు నన్ను మోసం చేస్తున్నాయా?
రంగనాథం ఇప్పడు ఆగిపోయాడు.
వాళ్ళు వస్తున్నారు! ఈ మధ్య రాత్రిళ్ళు వీళ్ళకి ఆకలి ఎక్కువవుతోంది. జంతువుల్లా ఆఘ్రాణ శక్తిపెరిగింది. వాసనని బట్టి తిండి వెతుక్కుంటూ వస్తున్నారు. బ్యాడ్ లక్. నా వైరస్ మందు నాకు పని చేయదు. దాన్ని హేండిల్ చేసి రెసిస్టెంట్ అయిపోయాను. వీళ్ళకి మాంసం వాసన, రక్తం వాసన తగిలితే ఏమయినా చేస్తారు.
ఇంటి బయట ఒకరకమైన గుర్రమనే చప్పుడు, మనుషుల కదలికల అడుగుల ధ్వని ఎక్కువయింది. రంగనాథం గదిలోకి పరిగెత్తాడు. బయటకి వచ్చినప్పుడు వాడి చేతులో మూడు రైఫిల్స్ తళతళ మెరుస్తూవున్నాయి. ఒకటి నామీద, ఒకటి హసితకివిసిరేశాడు.
ఇవి వ్యూ ఫైండర్‌లో లేజర్ పాయింటర్ వున్న గన్స్. సరిగా తలకి గురి చూసి నుదుటి మీద షూట్ చేయాలి. అప్పుడే వాళ్ళు చస్తారు. ఎందుకంటే మెదడు మీద నా మందు పనిచేయదు. మిగతా శరీరంలో ఎన్ని బుల్లెట్లు వెయ్యీ, నా మందు ప్రభావం వల్ల వాళ్ళకి చావు రాదు. వాళ్ళు ఆకలి మీద వున్నారు. రోజు ఇలాగే తిరుగుతున్నారు. ఇప్పుడు.. ఇప్పుడు నరభక్షకులై పోయారు! నేను వాళ్ళని ఆపుతాను. మీరు పారిపోండి. అందుకే పిలిపించాను ఆ ఫైల్స్ సీడిలు ప్రాజెక్టు అంతా మీవి!”
తలుపు మీద దడాదడా చప్పుడు ఎక్కువైయింది. కొద్ది కొద్దిగా తలుపు పగిలి పెచ్చులు ఊడిపోతున్నాయి.
హసిత ఫైళ్ళు సిడిలు అన్నీ కలబెట్టి ఒక చేత్తో తుపాకి పట్టుకొని “వెనుక దారిఎక్కడ?” అని అరిచింది.
“నాకు గన్ పేల్చడంరాదు. నేను పారిపోతాను. అనురాగ్ రా, త్వరగా. ఈ ప్రాజెక్ట్ మనది!”
రంగనాథం అన్నాడువెనక వాళ్ళు వెంటబడతారు! హసితా, టేకిట్ ఈజీ. గన్ గురిపెట్టి వ్యూ ఫైండర్‌లో చూసి తలకి గురిపెట్టి ఎర్రటి + గుర్తు మధ్య వాడి తలమీద బడగానే ట్రిగ్గర్ నొక్కు అంతే. ఇక పో!కింద సెల్లార్ వెనక తలుపు వుంది. నా ప్రాజెక్ట్ జాగ్రత్త!”
బయట భీకరంగా మనుషుల ములుగులు, చప్పుళ్ళు. నేను గన్ రెండు చేతులతో పట్టుకుని కిటికిలోంచి బయటకు తొంగి చూశాను.
డజన్ల కొద్ది కోయలు ఆడ, మగ ఎర్రటి బట్టలతో తలమీద కొప్పులతో తూలుతూ నడుస్తు వస్తున్నారు. ఎవరి కళ్ళల్లో జీవం లేదు. కొంత మంది అప్పుడే లోపలికి వచ్చేసి మెయిన్ డోర్ మీద చేతులతో దడదడా బాదుతున్నరు. కొంత మంది బిల్డింగ్ వెనకవైపువెళుతున్నారు.
నాకు ఒళ్ళంతా చెమటలు పోసింది. ప్రాణభయంతో వెనక్కి వెనక్కి పరిగెడుతున్నాను.
డ్రాయింగ్ రూం.. బెడ్ రూం... కిచన్... బ్యాక్ డోర్. అప్పటికే హసిత అక్కడికి చేరుకుంది. అక్కడ కూడా తలుపు చప్పుళ్ళు. వాళ్ళు కిటికిలోంచి ఎర్రటి కళ్ళతో చూస్తున్నారు.
క్రిందకి, మెట్లు మీదుగా, సెల్లార్ లోకి ల్యాబ్, ల్యాబ్ నిండా మైక్రోస్కోప్‌లు,పరికరాలు, కల్చర్ ట్యూబులు.....
హసిత ముందు పరిగెడుతోంది ఎక్కడ... ఎక్కడ బయటకి దారి? రా! అనురాగ్! ఎలాగో బయటపడదాం.
పై నుంచి ధనాధనా తుపాకి పేలుళ్ళు ఓ పది నిముషాలు వినిపించాయి.
హసిత ఏడుస్తూ పరిగెడుతోంది.
నాకు తుపాకీ పేల్చడం రాదు!”
నేనన్నా..వెళ్ళద్దువెళ్ళద్దు హసితా! బయటకి పోవద్దు ఇక్కడే దాక్కుందాం. బయటకి పోతే డేంజర్!”
నో!నో! నేనీ ప్రాజెక్ట్ బయటకి తీసుకుపోవాలి!”అంటూ పరిగెత్తింది.
ఇదిగో బ్యాక్ డోర్!” ల్యాబ్ వెనుక.
నేను స్ధాణువునైపోయాను.
పైన తుపాకి చప్పుళ్ళు అగిపోయాయి. తూలుతూ నడుస్తున్న పాదాలు చప్పుళ్ళు. పెద్దగా రంగనాథం ములుగు.....
హసిత ల్యాబ్ వెనుక తలుపు తెరిచి బయటకు వెళ్ళనే వెళ్ళింది.
కాని అక్కడ నలుగురు కోయ స్త్రీలు తూలుతూ నిలబడి వున్నారు.
కోయ జాంబీలు ఎర్రటి చీరలలో విరబోసిన జుట్లతో ఉన్నారు. వాళ్ళ కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నాయి. రాత్రి పూట జంతువుల్లా.
ఇప్పుడు వెనక ద్వారం ఖాళీ అయింది. ఎవరూ లేరు.నా కారు ఇంటి ముందు పోర్టికోలో వుంది. అక్కడకి వెళ్ళడం సురక్షితం కాదు.
నేను బయటకి వచ్చా గన్పట్టుకుని. అటూ ఇటూ చూసాను.
హసిత పిచ్చిపట్టిన దానిలా గన్ చుట్టూతిప్పుతూ పేల్చసాగింది.
ఆమె చుట్టూకోయ వాళ్ళందరూ మూగారు. వాళ్ళే కోయ విగతజీవులు, జీవన్మృతులు. వాళ్ళకి ఏమీ అవడంలేదు. బులెట్స్ వాళ్ళని ఏం చేయవు.
హ....సి.....త  …అదేపనిగాఅరిచాను.
ధన్..ధన్..ధన్.. ఆమె గన్, నా గన్ పేలాయి. ఎవరికీ తలలో తగలలేదు.
వాళ్ళందరూ ఆమెని చుట్టుముట్టారు
గుంపుగా.
కెవ్వున కేక.
నేను అప్రతిభుడనై పోయాను.
భయం విషాదం కలగలుపుగా.
కాని విజ్ఞత నన్ను పక్కదారి లోకి నడిపించింది.
మన్యం రిసెర్చి సెంటర్ కాంపౌండ్ నిండా ఎక్కడ పడితే అక్కడ కోయ విగత జీవులు. గుంపులు గుంపులుగా తూలుతున్నారు. వాళ్ళకి ఆకలి. స్పృహ లేదు. వాళ్ళకి దాహం..... మనుష్య రక్తం. అయినాసరే వాళ్ళకి చావులేదు, చావరు.
వాళ్ళు జంతువులతో సమానం అయిపోయారు. పైగావాళ్ళకి మరణం లేదు.
పరిగెత్తి గార్డెన్ లోకి.. చెట్లలోకి.. చీకట్లోలో.. కాంపౌండ్ వాల్ పక్కన నడుచుకుంటూ మెల్లగా గోడ మీదకి పాకి అవతలి వైపు దూకాను.
కాంపౌండ్ వాల్ పైన ముళ్ళ తీగల కంచె కాలుకి గుచ్చుకుంది. ఆ ముళ్ళు నా ప్యాంటుని చీల్చి చీల్చి ముక్కలు చేసాయి. అదృష్టం రక్తం రాలేదు. గాయం కాలేదు.
లోయలోంచి కొండ పైన రోడ్డు మీదకి ఎక్కసాగాను. భయంతో ఎక్కడ లేని బలం కాళ్ళలో వచ్చింది. రాళ్ళు రప్పలు, పొదలు ముళ్ళు. ఎవరెస్ట్ ఎక్కిన టెన్జింగ్ నార్కేలా ఫీలయ్యాను. పైకి పాకాను.
అది ప్రాణ భయం.
పాకి పాకి కొండ ఎత్తున చెట్ల మధ్య మెలికలు తిరిగిన తారు రోడ్డు మీదకి చేరుకున్నాను. చల్లటి నల్లటిరోడ్డు. తూలుకుంటూ పరిగెత్తాను.
ఇంక నాశరీరం గాయం కాలేదు.లోపల ప్యాంటు బూట్లు మేజోళ్ళు రక్షించాయి. కాబట్టి రక్తం కారలేదు.
వాళ్ళకి నా వాసన ఇంక దొరకదు.
వెనక్కి తిరిగిచూసాను.
పది నిముషాలు మాత్రమే. క్రింద దూరాన వాళ్ళు రిసెర్చ్ సెంటర్ చుట్టూ నీడల్లా తూలుతూ నడుస్తున్నారు.
ఒక చోట.. హసిత పడిపోయిన చోట గుంపులా వున్నారు.
భయంతో కళ్ళుమూసుకున్నాను.
అడవి నిర్మానుష్యంగా వుంది. కీచురాళ్ళు మోత కర్ణ కఠోరంగా వుంది. చీకటి. ఎన్ని రహస్యాలో దాచుకున్న చీకటి.
మెల్లగా రోడ్డుమీద నడిచి, ఒక్క ఉదుటున వేగంగా పరిగెత్తాను.
వేగంగా....వేగంగా.... ఆ పీడకలకి దూరంగా....
ఆ ప్రాజెక్ట్ పేపర్లు ఆశతో గుండెకి అదుముకున్న హసిత, దశాబ్దాలు కృషి చేసిదురాశతోపిచ్చి వాడైన రంగనాథం....
మళ్ళా ఆగి వెనక్కి తిరిగి రోడ్డు అంచు నుంచి లోయకి చూశాను.
కొండ అడుగున లోయలో రిసెర్చి సెంటర్ మంటల్లో తగలబడిపోతోంది. ఎర్రగా వెలిగిపోతోంది.
కోయి జాంబీలు బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్ చేశాయా?భవనంలో అగ్ని ప్రజ్వరిల్లింది.
రోడ్డు మీద ఎవరూ లేరు. రంగనాథం కోసం అతని స్టాఫ్ కూడా వెళ్తున్నట్లు లేరు!
భావితరాలకి చెప్పడానికి కూడా ఏమీ లేదు. అంతా దగ్ధమై పోయింది.
ఇంకా వేగంగా పరిగెత్తసాగాను.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి! స్నేహం కాదు... ప్రేమ! ప్రేమ కాదు డబ్బు కాదు ప్రాణం ముఖ్యం.
పరిగెత్తాను.
రెండు కన్నీటి బొట్లు చెంపల మీదుగా జారాయి. చెమట బొట్లతో సహా.
(సమాప్తం) the story inAndhraprabha 24 nov 2014sunday written by me as Kotha mandu

No comments:

Post a Comment

My Blog Visitors