ఆత్మ పుస్తకం
మీట నొక్కితే
వేల గొంతులు ,వర్ణ చిత్రాలు అనుభూతులు నిండిన అక్షరాలు
మౌజ్ కదిపితే కవితలు కథలు గీతాలు సంగీతాలు చలన చిత్రాలు
కవులు కవయిత్రులు చిత్రకారులు దర్శకులు దార్శనికులు
కొన్నివేల గుండెల్లో అంతరాంతరాల పొరల్లోంచి ఉబికి ఒచ్చిన ఉత్తేజం
భూమి మధ్య నుంచి చివరి దాక ,నాసా నుంచి గాలక్సీ చివరి దాక
ఒకే వేగం తో ఒకే ఆవేశం తో ఆనందం తో ప్రవహించే డిజిటల్ విశ్వం
ఒకరికి విజయపు మందహాసం మరొకరి అపజయపు అశ్రు తరంగం
ఒకరికి జన్మదిన శుభాకాంక్ష మరొకరికి ఆఖరి వీడుకోలు
మీట నొక్కితే అందరి ఆనందాలు విషాదాలు
నా గుండెలో కి తిన్నగా అంతర్జాలపు సెలయేరు లా
కావ్యాలు కళ ఖండాలు చలన చిత్రాలు నృత్యాలు కవితలు గానాలు కథలు నవలలు
ఒక మనసున్న మానవ సమూహం లక్షల గొంతుల తో మాట్లాడుతున్నట్లు
ఒక వేదనాభరిత ఆలోచనాస్రవంతి వెయ్యి వోల్టుల కాంతి తో నన్ను కమ్ముకున్నట్లు
అందరితో గొంతు కలిపి అందరిని అభినందించి విషాదం లో వినోదం లో
ఒకటి గా కలసిపోయి
ఈ మీట నొక్కక పోతే క్షణం కదలదు
ఈ మౌజు కదలక పోతే కాలం గడవదు
వేల గుండెల చప్పుడు వినకపోతే
వేల అనుభూతుల కి స్పందించి మమైకం కాకపోతే
రోజు గడవదు భూమి తిరగదు
అందుకే ఇది ముఖ పుస్తకం కాదు
కన్నీరు తుడిచే ఆత్మీయ హస్తం చిరునవ్వు తో కలిపే
ప్రేమ దరహాసం
మన ఆత్మ పుస్తకం
No comments:
Post a Comment