ఎందుకు రాస్తూనే ఉంటాము? ఎవరు చదవక పోయినా బహుమతులు రాకపోయినా కొందరు అసలు ఏమీ బాగా లేదన్నా రాయడం ఒక ఉన్మాదం.ఒక మత్తు.ఒక స్నేహితుడు ఇక సైన్సు ఫిక్షన్ రాయకండి మామూలు కథలు రాయండి అని సలహా ఇస్తే ఇంతవరకు రాసినది బాగాలేదనే కదా ...మరొక సంపాదకుడు మనం రాసినది నచ్చలేదని అంటె ఇప్పటికీ ఇదివరకటి లాగ నే ముళ్ళు గుచ్చుకుంటాయి..ప్రేమ కథలు రాయాలా? అత్తా కోడళ్ళ కథలు విప్లవాల కథలు స్త్రీలని అన్యాయం చేసి అవమానం చేసి కథలు సమాజం లో అణగదొక్కబడి నిస్పృహ పడె పేదల కథలు బాధ ల కథలు రాయాలా? నాకు తెలిసి నేను స్పందించి చదివే వాళ్ళని స్పందింప చేయగలిగితే అదే మంచి కథా ?ఊహలు ఫాంటసీ గేలక్సీ ల లో యెగిరి పోవడం విలన్స్ గా మారిన డాక్టర్లు మాంత్రికులు రాజకుమార్తెలు ఇవన్ని సాహిత్యం కాదా? కొత్త దారి వెతుక్కునే సమయం వస్తే నాలుగు రోడ్ల మధ్య నిస్సహాయం గా నిలబడి పోవడం ...ఇదో అంతరంగ మథనం...ఇదో స్టేటస్ . కాని ఏ త్రిల్ ఉందొ రాయడం లో అది ఎలా పోగొట్టు కొను? అదీ ఏమీ ప్రేమ లేని మనుషుల ల కోసం .అందుకనే నా రచనలు అలా ఆకాశం లో పరిభ్రమిస్తూ ఉంటాయి చదువరుల కోసం నిరీక్షిస్తూ...
Wednesday, November 5, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment