చీకటిలో నేను ...
వెలుతురు లో నువ్వు
ఆవేదన లో నేను
ఆనందం లో నువ్వు
ఎప్పటికప్పుడు పరుగెత్తు తు నువ్వు
ఒక చోటే నిశ్చలం గా నేను
వెండికొండల వెనక సూర్యోదయాల కోసం నువ్వు
కీకారణ్యాల రహస్యాలని చేదిస్తూ నేను
జీవన గానం లో శృతి కలిపే మధుర స్వరం నీది
మరణ వేదన లో సృష్టి విచిత్రం తెలిసి పెట్టె ఆర్తనాదం నాది!
ఈ చివర నేను ఆ చివర నువ్వు ,హరివిల్లు తల లో తురుముకునే అవకాశాలు నీవి
నల్ల మేఘం కిరీటం గా ధరించే సందర్భం నాది.
No comments:
Post a Comment