Pages

Saturday, August 29, 2015

మంగళ వారం మ్యాడ్ నెస్

మంగళ వారం మ్యాడ్ నెస్
"డబ్బు దేముందండీ" ,అంటుంటారు నోట్లు శ్రద్ధ గా లెక్క పెట్టుకుంటూ ..కానీ డబ్బు లోనే అంతా ఉంది .నువ్వు ఒక లుంగీ బనీను వేసుకుని ఫైవ్ స్టార్ హోటల్ లోకి నడుచుకుంటూ వెళ్ళు ,నిన్ను ఆపేసి గెంటెసె ప్రమాదం చాలా ఉంది.నీ దగ్గర డబ్బు ఉన్నా లేక పోయినా ఒక సూట్ లో మేర్సిడీస్ కారు లో పర్ఫూమ్ సువాసన ల తో దిగు ద్వారపాలకుల నుంచి క్షేత్ర పాలకుల దాకా అందరు హడావుడి గా లేచి నిల్చుని సెల్యూట్ కొడతారు.నువ్వో కథ రాయి మంచి సినిమాకి పనికొస్తుందని నీ ఆశ అయితే దాని మార్కెట్ విలువ ఏమీ లేదని చత్త బుట్ట లోకి విసురుతారు.అదే కథని సకల హంగుల తో స్క్రీన్ప్లే రాసి నువ్వో పేరుగడించిన కాదు డబ్బు రాబట్టగలిగిన రచయిత వయితే "ఈ సినిమా చేస్తున్నాం "అని కోట్లు గుమ్మరిస్తారు.నీ ఆలోచనలు కవిత్వాలు ఆవేశం తో రాసే విప్లవ కవితలు అన్ని వాటి మార్కెట్ విలువ ని గలిగి ఉంటాయి.అది సున్నా నుంచి కొన్ని కొట్లు కూడా కావచ్చు.ఇంకా అదనపు విలువ శ్రమా ఇంటలెక్చుఅల్ ప్రాపర్టీ అంటు అఘ్హొరించినా మార్కెట్ నిన్ను బుల్ డోజర్ లా నలిపి నడిచి వెళ్ళిపోతుంది.నేను గొప్ప కవినీ రచయితనీ నేను సయితం భువన భవనపు భావుటానీ అనుకుంటే లాభం లేదు. ..మార్కెట్ లో నీ విలువ ఎంత,నువ్వు సంపాదించే అదనపు విలువ ఎంత ?.అదనపు విల్వే దోపిడీ అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు .వడ్డీ రేటు లాభం నష్టం తెలిస్తేనే సఫలీక్రుతడవు అవుతావు లేకపోతే "నన్ను ఈ సమాజం అన్యాయం చేసింది" అని కవిత్వాలు రాసుకోవాల్సిందే.కావలిస్తే నీ కవిత ల పుస్తకం రాసి బొమ్మ వెయ్యమను పుస్తకం వెయ్యమను అమ్మిన డబ్బులు ఇయ్యమను ...విలువ రానిదే నీ ప్రియ మిత్రుడు కూడా దాని ముఖం చూడడు ! డబ్బు ఇయ్యన్దె బొమ్మ కూడా రాదు .
నీ డబ్బు తో దాన్ని వానిటీ పబ్లిషింగ్ చేసుకుని నష్టాన్ని చిరునవ్వు తో భరించి పుస్తకాలని అందరికి పంచాల్సిందే.
ఒక వెళ నీకేదో ప్రైజ్ వచ్చినా అది ఇంకెవరో వారి వానిటీ కోసమో స్వలాభం కోసమో వ్యాపారం కోసం చేసే సత్కారమే.చచ్చి ఎక్కడున్నాడో సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషికి సెక్సు ఆకలీ బేసిక్ ఇన్స్టింక్ట్స్ అన్నాడు .మూడోది తనే అధికుడనన్న భావం సుపీరియారిటీ ...ఇది మనిషిని చాలా మంచివీ ఘోరం అయనవీ కూడా అయిన పనులు చేయిస్తుంది. ,,,నేను డబ్బు నాలుగో ఇన్స్టింక్ట్ అంటాను.వేట కోసం అడవి లోకి రోజు వెళ్ళె పులి లా మనం ఈ సమాజపు క్రూర మృగాల అడవి లో డబ్బు కోసం రక్త దాహం తో వేటాడాలి. డబ్బు ను డబ్బు తో జయించి వాడి ముఖాన్నే కొట్టాలి.ఖర్చు పెట్టేటప్పుడు కన్నీళ్ళు రానంత డబ్బు సంపాదించాలి. ప్రేమని గుండెల్లోనే దాచుకోవాలి. అవసరం లేనిదే ఒక్క పయిసా కూడా ఇవ్వని ఈ ప్రపంచాని కి అవసరం లేనిదే ఒక్క చిరునవ్వు కూడా ఇవ్వద్దు. ఎందుకంటె ఉచిత భోజనాలు లేవు .అన్నీ ఆర్ధిక సంబంధాలే! కానీ డబ్బు దేముందండీ ఇవాళ పోతుంది రేపు వస్తుంది అను .అయితే డబ్బు లోనే అంతా ఉంది అని గ్రహించు
Like   Comment   

No comments:

Post a Comment

My Blog Visitors