Pages

Wednesday, December 29, 2010

new year

 ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం  మొదలవబోతోంది.
మన రాజధాని లో అందరి మనసులో ఒకటే అనుమానం."గొడవలు  జరుగుతాయట...ఎలా వుంటుందో ఏమో" 
ఎంతో అద్భుతం  అయిన ప్రగతి పధం లో వెళ్ల వలసిన  రాష్ట్రం ...ఎంతో సంస్కృతి  చరిత్ర కలిగిన ప్రజలూ భాష  సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం మనది.ప్రపంచం లో ఎక్కడికి వెళ్ళినా మనకు  తెలుగు వాళ్ళు కనిపిస్తూనే వ ఉంటారు.ఉన్నతమైన  సంస్కారం కల జాతి మనది. ఇలా రెండు  సంవత్సరాల నుంచి మనం మనలో పోట్లాడు కుంటూ తిట్టు కుంటూ ఉన్నాము .రెండు రోజుల తరవాత ఏమి జరుగుతుందో అనే  ఈ స్థితి   ఎన్నాళ్ళు?ఎవరో పరభాషా సంస్కృతి కి చెందిన కేంద్ర ప్రభుత్వ కమిటీ  లు మన బాధ ని ఎలా అర్ధం చేసుకుంటాయి? లేక నిజం గానే  ఈ సమస్య కి త్వర లో నే అందరికీ ఆమోద యోగ్యం అయిన  పరిష్కారం దొరుకుందా?  భగవంతుడిని ప్రార్దిద్దాము .
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Saturday, December 25, 2010

kotha samvatsaram

కొత్త సంవత్సరం వస్తోంది.ఏమి జరుగుతుందో అనే భయం  అంతర్గతం  గా  అందరికి వుంది.రోడ్లు  బ్లాక్ చేస్తారా?జన జీవనం  స్తంభింప జేస్తారా? కొత్త సంవత్సరం లో రాష్ట్ర విభజన జరుగుతుందా ? అంతా  సస్పెన్సు గా వుందంటే  నమ్మండి.అన్నిటి కంటే  యూస్ లెస్  శాస్త్రం  జ్యోతిషం  అని అనిపిస్తోంది.ఎంత గొప్ప జ్యోతిష్కుడు అయినా  చెప్పలేని భవిష్యతు  మనది .మన తెలుగు దేశానిది. అందరికీ ఆమోగ్యం అయిన  పరిష్కారం ఏమయి ఉంటుంది సార్?  చెప్పండి!  ఏది చేసినా ఎవరో ఒకరికి  కోపం రాక తప్పదు.
వేచి చూద్దాం. 

Monday, December 13, 2010

manch maaTa

నిన్ను నువ్వు నమ్మక పోతే  నువ్వు నాస్తికుడి వి.దేవుడిని నమ్మక పోతే కాదు.నీలో నీకు నమ్మకం లేకపోతేనే అది నిజమైన  నాస్తికత.......వివేకానంద.

kujudi kosam

   నా నవల కుజుడి కోసం ఈ జనవరి  రచన  సంచిక  నుంచి ధారావాహిక గా ప్రచురించ  బడ బోతోంది.
నాలుగో సహస్రాబ్ది అంటే మిలీనియం  కధా కాలం  ౩౪౬౫  ...గ్రహ్హాన్తర యానాలూ అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర పురోగతీ వున్న కాలం .అయినా మానవుడి దురాశా  స్వార్ధం  మారిపోవు.ఏ యుగమైనా విలువలు మారవు.ప్రేమ మారదు.స్నేహం  నిస్వార్ధం మంచి విలువలు ఎప్పటికీ ఒకటే .మనం ఎంత సాధించినా మనకంటే గొప్ప శక్తి మరొకటి ఈ విశ్వం లో మనని శాసిస్తూనే ఉంటుంది.
ఇదే నేను చెప్పదలచినది. 

Monday, December 6, 2010

aravindaaShramam

                    పాండిచేరి లో అరవిందాశ్రమం చూడటం ఒక గొప్ప అనుభవం !చాలా మామూలుగా కనిపించే ఒక ఇల్లు లాగా  వుంది.ఒక పక్క వినాయకుడి కోవెల వుంది. ఆ వీధి లో నడిచి పక్కకు వస్తే దూరాన సముద్రం ...కనిపిస్తుంది.ఆశ్రమం లో ఎంతో మంది పర్యాటకులు దేశ విదేశాల  నుంచి వచ్చిన వారు నిశబ్దం గా  ఒక చెట్టు కింద ఉన్న సమాధి చుట్టూ తిరిగి lకొందరు సమాధి  మీద     తల వాల్చి అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ వుండటం  మనసు ను మరో లోకాల కు తీసుకు పోయే  మాటలు లేని ఆధ్యాత్మిక అనుభవం ...నిశబ్దం.అది చూస్తే అర్ధం అయింది అరవిందుడు ఇక్కడికి  వచ్చి ఈ ఆశ్రమం లో ఇంత ప్రశాంతం  గా ఎలా ఉన్నాడో ...ఆ రోజులు ఎలా  ఉండేవో! 
ఈ సముద్రం మాత్రం  అప్పుడూ ఇలాగె హోరు మనే అలల  తో  ఆకాశం తో మాట్లాడుతూ  ఉండి  ఉంటుంది... 

My Blog Visitors