Pages

Saturday, August 29, 2015

ఆబ్జ సాహిత్య సమావేశం

ఆబ్జ సాహిత్య సమావేశం కోసం ముందునించి పధకం వేసుకున్నాను.ఎందుకంటె ఈ సారి కొండాపూర్ లోని సుజలా గంటి గారి ఇంట్లో.కనీసం గంట పైన ప్రయాణం.ఆదివారం వేరే కార్యక్రమాలు రద్దు చేసుకుని పదిగంటల కల్లా కాబ్ లో బయలు దేరాను. నా సొంత డ్రైవింగ్ లో అడ్రస్ వెదుక్కుంటూ అంత దూరం వెళ్లి సమయాని కి అందుకో లేను. ఇక్కడ మంచి చర్చ మంచి రచయితలు రచయిత్రుల తో పరిచయం యెప్పుడు రొటీన్ మెడికల్ కాన్ఫరెన్స్ ల తో విసిగి పోయే నాకు చక్కటి ఆట విడుపు.వెళ్ళినందుకు సుజల మూర్తి గారి ఇంట్లొ మంచి ఆతిధ్యం, లంచ్ కూడా లభించింది.
మంచి కథల విశ్లేషణ .రామ్ పా గారు మంచి చిత్రకారుడే కాక కన్నీళ్ళు తెప్పించే మంచికథ రాయగలిగిన రచయిత .ఆయన రాసిన "నవ్విన కన్నీరు" గురించి మంచి చర్చజరిగింది,.పూర్వ విద్యార్థుల సమావేశం లో ఒక చిన్న నాటి స్నేహితురాలి భగ్న జీవితం గురించి అందరు గుర్తు చేసుకుంటారు.భర్త క్రూరత్వం అసూయ కి గురి అయిన రుద్రవాణి అందరికీ గుర్తే.ఆమె ఏమయిపోయింది.?జీవితం లో కొందరు ఉన్నత స్థితి కి వెళ్ళితే కొందరి జీవితాలు రైల్వే ప్లాట్ఫారం మీద భిక్షుకి లా ముగుస్తాయి.చివరికి ఆమె రైల్వే స్టేషన్ లో దూరం అయిపోతుంటే కథ ముగుస్తుంది.కాని ఎలా ఎండ్ చేస్తే బావుండేదిఅని అడిగాను..నేనయితే ఛైన్ లాగి రైల్ ఆపినట్లు ముగించేదానిని అన్నారు రచయిత్రి మంతా భానుమతి గారు .గ్రేట్ .ఒక కథ కి ఫెమినిస్ట్ కోణం ఒక లా ఉంటుంది.
ప్రతి కథా ఒక వాతావరణం ఒక సమస్య ఒక చిక్కుముడి ని చూపిస్తుంది.ఒక పరిష్కారం గురించి కూడా చెబుతుంది.పరిష్కారం లేదని చెప్పడం కూడా ఒక పరిష్కారమే.ఒక సమస్య కి మార్క్సిసం ఒక లాగా ఫెమినిసం ఒక లాగా మానవత్వం ఒక లాగా మత దృక్పధం ఒక లాగా ఇలా ఎన్నో పరిష్కారాలు చూపించచ్చు రచయిత. అది అతని లేక ఆమె దృక్పథం లేక నిర్ణయం మీద ఆధార పడి ఉంటుంది, .అది అందరికి ఆమోదయోగ్యం అయితే కలకాలం నిలిచి గొప్ప కథ గా మిగులుతుంది. ఒక్క సమస్య నే ఒక జీవిత శకలపు దృశ్యం గా ,లేక గోడ రంధ్రం లోంచి చూసే సంఘటన గా చిత్రించి వదిలేస్తే అది కూడా మంచి కథ అవుతుంది.కథన కి ఆలోచింపచేసే శక్తే కాదు చదివించే శక్తి కూడా వుండాలి .డ్రామా అంటె నాటకీయత, వర్ణన, కథనాన్ని ఆకర్షణీయం గా చేస్తుంది. నేను రుద్రామణి పాత్రని చాలా కాలం మరిచిపోలేను.ఏదయినా ఈకథ చర్చించాలంటే మీరు కథా కుటుంబం లో చదివి రావాల్సిందే.అలాగే " కరదీపిక" అని సుజలా గంటి గారు రాసిన కథ పిసినారి అనుకున్న ప్రకాశం మహోన్నత వ్యక్తిత్వాన్ని చూపించింది, పులిగడ్డ విశ్వనాథ రావు గారి మర్యాద వైద్యం వుడ్ హౌస్ రీతి లో హాస్యాన్ని సున్నితం గా వర్ణించింది.ఆయన మంచి ఘజల్స్ ముకేష్ వీ మేహిది హసన్ పాటలు హార్మోనియం తో అద్భుతం గా పాడారు.
కథా కుటుంబం అబ్జ సాహితీ సమావేశాల్లో మంచి రచయితలు మంచి స్నేహితులు అద్భుతమైన చర్చలు.నాకు ఉపయోగం గా అనిపించాయి.సుజలా గారి ఆతిధ్యం మరపురానిది,అందరు,అంటే వారణాసి నాగలక్ష్మి ,రామ్ పా విశ్వనాథ రావు గారు,మూర్తి గంటి గారు కస్తూరి మురళీ కృష్ణ గారు భానుమతి గారు ఎంతో ప్రతిభ గల రచయిత్రి రచయితలు. ఎన్నాళ్ళనుంచో పరిచయం ఉన్న స్నేహితుల్లాగా ఆదరించారు.ఈ సమావేశాలు ఇలాగే బాగా జరగాలి.
.
Like   Comment   
ంచింది.
మంచి కథల విశ్లేషణ .రామ్ పా గారు మంచి చిత్రకారుడే కాక కన్నీళ్ళు తెప్పించే మంచికథ రాయగలిగిన రచయిత .ఆయన రాసిన "నవ్విన కన్నీరు" గురించి మంచి చర్చజరిగింది,.పూర్వ విద్యార్థుల సమావేశం లో ఒక చిన్న నాటి స్నేహితురాలి

Photos of long ago with my daughter Navya


My novel Epidemic

 "The Epidemic"is aailable only as e bookm on kinige.com

మంగళ వారం మ్యాడ్ నెస్

మంగళ వారం మ్యాడ్ నెస్
"డబ్బు దేముందండీ" ,అంటుంటారు నోట్లు శ్రద్ధ గా లెక్క పెట్టుకుంటూ ..కానీ డబ్బు లోనే అంతా ఉంది .నువ్వు ఒక లుంగీ బనీను వేసుకుని ఫైవ్ స్టార్ హోటల్ లోకి నడుచుకుంటూ వెళ్ళు ,నిన్ను ఆపేసి గెంటెసె ప్రమాదం చాలా ఉంది.నీ దగ్గర డబ్బు ఉన్నా లేక పోయినా ఒక సూట్ లో మేర్సిడీస్ కారు లో పర్ఫూమ్ సువాసన ల తో దిగు ద్వారపాలకుల నుంచి క్షేత్ర పాలకుల దాకా అందరు హడావుడి గా లేచి నిల్చుని సెల్యూట్ కొడతారు.నువ్వో కథ రాయి మంచి సినిమాకి పనికొస్తుందని నీ ఆశ అయితే దాని మార్కెట్ విలువ ఏమీ లేదని చత్త బుట్ట లోకి విసురుతారు.అదే కథని సకల హంగుల తో స్క్రీన్ప్లే రాసి నువ్వో పేరుగడించిన కాదు డబ్బు రాబట్టగలిగిన రచయిత వయితే "ఈ సినిమా చేస్తున్నాం "అని కోట్లు గుమ్మరిస్తారు.నీ ఆలోచనలు కవిత్వాలు ఆవేశం తో రాసే విప్లవ కవితలు అన్ని వాటి మార్కెట్ విలువ ని గలిగి ఉంటాయి.అది సున్నా నుంచి కొన్ని కొట్లు కూడా కావచ్చు.ఇంకా అదనపు విలువ శ్రమా ఇంటలెక్చుఅల్ ప్రాపర్టీ అంటు అఘ్హొరించినా మార్కెట్ నిన్ను బుల్ డోజర్ లా నలిపి నడిచి వెళ్ళిపోతుంది.నేను గొప్ప కవినీ రచయితనీ నేను సయితం భువన భవనపు భావుటానీ అనుకుంటే లాభం లేదు. ..మార్కెట్ లో నీ విలువ ఎంత,నువ్వు సంపాదించే అదనపు విలువ ఎంత ?.అదనపు విల్వే దోపిడీ అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు .వడ్డీ రేటు లాభం నష్టం తెలిస్తేనే సఫలీక్రుతడవు అవుతావు లేకపోతే "నన్ను ఈ సమాజం అన్యాయం చేసింది" అని కవిత్వాలు రాసుకోవాల్సిందే.కావలిస్తే నీ కవిత ల పుస్తకం రాసి బొమ్మ వెయ్యమను పుస్తకం వెయ్యమను అమ్మిన డబ్బులు ఇయ్యమను ...విలువ రానిదే నీ ప్రియ మిత్రుడు కూడా దాని ముఖం చూడడు ! డబ్బు ఇయ్యన్దె బొమ్మ కూడా రాదు .
నీ డబ్బు తో దాన్ని వానిటీ పబ్లిషింగ్ చేసుకుని నష్టాన్ని చిరునవ్వు తో భరించి పుస్తకాలని అందరికి పంచాల్సిందే.
ఒక వెళ నీకేదో ప్రైజ్ వచ్చినా అది ఇంకెవరో వారి వానిటీ కోసమో స్వలాభం కోసమో వ్యాపారం కోసం చేసే సత్కారమే.చచ్చి ఎక్కడున్నాడో సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషికి సెక్సు ఆకలీ బేసిక్ ఇన్స్టింక్ట్స్ అన్నాడు .మూడోది తనే అధికుడనన్న భావం సుపీరియారిటీ ...ఇది మనిషిని చాలా మంచివీ ఘోరం అయనవీ కూడా అయిన పనులు చేయిస్తుంది. ,,,నేను డబ్బు నాలుగో ఇన్స్టింక్ట్ అంటాను.వేట కోసం అడవి లోకి రోజు వెళ్ళె పులి లా మనం ఈ సమాజపు క్రూర మృగాల అడవి లో డబ్బు కోసం రక్త దాహం తో వేటాడాలి. డబ్బు ను డబ్బు తో జయించి వాడి ముఖాన్నే కొట్టాలి.ఖర్చు పెట్టేటప్పుడు కన్నీళ్ళు రానంత డబ్బు సంపాదించాలి. ప్రేమని గుండెల్లోనే దాచుకోవాలి. అవసరం లేనిదే ఒక్క పయిసా కూడా ఇవ్వని ఈ ప్రపంచాని కి అవసరం లేనిదే ఒక్క చిరునవ్వు కూడా ఇవ్వద్దు. ఎందుకంటె ఉచిత భోజనాలు లేవు .అన్నీ ఆర్ధిక సంబంధాలే! కానీ డబ్బు దేముందండీ ఇవాళ పోతుంది రేపు వస్తుంది అను .అయితే డబ్బు లోనే అంతా ఉంది అని గ్రహించు
Like   Comment   

My Blog Visitors