Pages

Monday, January 26, 2009

జిక్కి

జిక్కి పాట

పులకించని మది పులకిస్తుంది......!

ఆవిడ పాట వింటే....!

వర్షించని కన్ను వర్షిస్తుంది.

కరిగి పోయిన కల

కళ్ళ ముందు కనిపిస్తుంది.

వాడిపోయిన ప్రేమ

మళ్లీ వికసిస్తుంది...

అంతరంగం లో

అనురాగం

జలపాతం లా

ప్రవహిస్తుంది....

ఆమె శ్వాస ఆగిపోయినా

మన గుండెల్లో

జిక్కి గొంతు

ప్రతిధ్వనిస్తూనె వుంటుంది

githam

గీతం

....గీతం...
సంగీతం....
స్వరం.....
స్వనమ్..
మృదులం
మధురం
భావం
గానం...
రాగం...
తాళం....
వ్యధల ఎదల చీల్చి పేగులు మనోహర ఆర్తనాదం...
మధుర స్మృతుల కళాకృతుల సుందర శబ్ద చిత్రం...
గీతం....
సంగీతం....

Sunday, January 25, 2009

సంజె veLa

సంజె వేళ
ఆకాశపు వాకిలిలో
చుక్కల
తోరణాల దీపాలు...
అస్తమయ భానుడి
ఎర్రని కాంతి...!
కెంపుల గుట్టల వెనుక...
ఎర్రని మంటలా...
నలుపు ఎరుపు నీడల్లో
అస్పష్టం గా ...
మా వూరు...!

Saturday, January 24, 2009

ompu

వొంపు

కాలవ గట్టు వొంపు తిరిగి...
వొంపు తిరిగిన
చెట్ల కొమ్మలు...

నీళ్ల లో వొంపులు తిరిగిన బొమ్మలు...
నిలాకాసం లో తెల్ల మబ్బు
వొంగి చెట్టును ముద్దు పెట్టుకుంది...

...



మా vuuru

మా వూరు

చెట్లల్లో తలుక్కుమన్న
సూర్య బింబం
చెరువు మీద మసక గా మంచు
నిశబ్దం లో దూరం గా
మోగిన గుడి గంట....
ఒక తీయటి కోకిల పాట
ఒక గోవు బుజ్జాయి కోసం కేక
మా వూరు
నిద్ర లేచింది!



thappadu

తప్పదు

అనంతం లో సాగి పోయే
అణువులం మనం
అనుభూతులు వేరైనా
ఆకారాలు మారినా
ప్రాణం పోసుకున్న
ఎలేక్ట్రోన్లం
అంతం అయనా
అంతం లేదు
మరో రూపం లో
అస్తిత్వం తప్పదు
విశ్వం లో
ఉనికి తప్పదు!

Thursday, January 22, 2009

పెళ్లి



పెళ్లి

ఆకృతులు వేరైనా
ఆలోచనలు ఒకటేనని
శరీరాలు విడివడినా
హృదయం ఒకటేనని
బాధలు వేరైనా
భారం ఇద్దరిదీనని
నాలుగు కళ్ళలో
రెండు దృశ్యాలు చూడాలని

వొకరికి
ఒకరు అని అనుకున్న ప్రేమ

ఏది
?ఎటు పోయింది?

పెళ్లి తర్వాత
ప్రేమ 
ఏమయి పోతుంది ?


Monday, January 19, 2009

naa gurinchi.

నా పేరు మధు.నేను తెలుగు లో నవలలు కథలు రాసాను. నేను వృత్తి రీత్యా డాక్టర్ ని .నేను రాసిననవలలు Bye Bye పొలోనియా సి సి యు సాలె గూడు ,ఔనా.. మొదలయినవి.........ఎపెడేమిక్ అనీ నవల త్వర లో ప్రచురించబడుతోంది. ఇదీ నా స్వ విషయం. త్వర లో నా కవిత లు కథలు నవలలూ బ్లాగ్ లో అందజేస్తాను. చిత్తర్వు మధు

Sunday, January 18, 2009

namaskaaram




నమస్కారం.ఈ విశ్వంలో తెలుగు చదివే అంతర్జాలం చదివే పాఠకులందరికీ నమస్కారం!నా ఆలోచనలు అనుభూతులు...నా కవితలు కథలు నవలలుఈమధు భాషిని లో లో మీ కు సమర్పితం ప్రేమతో చిత్తర్వు మధు



My Blog Visitors