Pages

Saturday, November 24, 2012

Kujudi Kosam review in Andhra Jyothi

భావన, ఊహ, సృజనాత్మక శక్తులు దాదాపు అంతరించిపోయి ఒక గాడిలో పడి యాంత్రికంగా చరిస్తున్న తెలుగు నవలా సాహిత్యంలో ఎన్.ఆర్. నంది తరువాత సైన్స్ ఫిక్షన్ విభాగంలో కొంతలో కొంత ఆ లోటును తీరుస్తూ వెలువడిన సైన్స్ ఫిక్షన్ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన 'కుజుడి కోసం'.

క్రీస్తు శకం 3264 సంవత్సరం లో భూమిపైన రెండుసార్లు అణుయుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన తర్వాత, భూమి నుంచి అన్ని దేశాల ప్రజలు ఇతర గ్రహాల్లోకి వలసపోయి నివసించే రోజుల్లో, భూమి మీదే నివసించే ఒక బయో మెడికల్ ఇంజనీర్ తన కలలో కనిపించిన ఒక కుజగ్రహ సుందరి ప్రేమను పొందాలనే ధ్యేయంతో కుజగ్రహానికి చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలే ఈ నవలకు మూలాధారం. ఆ తర్వాత కుజగ్రహంలోని మాంత్రికులకూ, మానవులకూ జరిగిన యుద్ధంలో అతను చిక్కుకోవడం దగ్గర్నుంచి తిరిగి అతను భూమిని చేరేవరకూ జరిగిన ఘటనలను ఆసక్తికరంగా నవలీకరించాడు రచయిత. అరవై రెండు అధ్యాయాలు ఈ నవలలో గతాన్నీ, భవిష్యత్తునూ మిళితం చేసి అద్భుతమైన ఫాంటసీని సాధించాడు. ఈ క్రమంలో రోబోలు, ఇంటర్ గెలాక్టిక్ నెట్ వంటి ఎన్నో సాంకేతిక అంశాలను సాధారణ పాఠకులకు అర్థం అయ్యేట్టు రాయడం ఈ నవల ప్రత్యేకత.

పునరుక్తులను కొంచెం ఎడిట్ చేసుకుని ఉంటే నవలలో మరింత 'బిగి' ఉండేది. అలాగే నవలలోని శాస్త్రీయతను మరికొంచెం సరళీకరించినా నవలా క్రమం ఒక గతిలో సాగిపోయేది. మొత్తం మీద చాలాకాలం తర్వాత వెలువడ్డ ఈ సైన్స్ ఫిక్షన్ నవల ఆ అభిరుచి గల పాఠకుల్ని విడవకుండా చదివిస్తుంది. అలాగే కుజగ్రహం గురించి శాస్త్రీయ వివరాలు తెలుసుకోవాలన్నవారు కూడా ఈ పుస్తకాన్ని చదవొచ్చు.
కుజుడి కోసం, డాక్టర్ చిత్తర్వు మధు
పేజీలు : 227, వెల : రూ. 150     for copies Navodaya book House

Friday, November 16, 2012

Science Fiction in Telugu language

తెలుగు లో సైన్సు ఫిక్షన్ తక్కువ అనే  అభిప్రాయం వుండేది  నాకు.యండమూరి,నేను  కే ఆర్ కే మోహన్ , పురాణపండ రంగనాథ్ ,మహీధర నళీనీ మోహన్.  నండూరి రామమోహన రావు మైనంపాటి భాస్కర్ ఇలాకొంతమందే సైన్సు రచనలు  చేసారనే అభిప్రాయం తో ఉన్న నాకు తెలుగు  విశ్వ విద్యాలయ లో పనిచేస్తున్న  సుధాకర్ నాయుడు పంపిన   తెలుగులో సైన్సు ఫిక్షన్ అనే సిద్ధాంత గ్రంధం అందింది.ఇది ఆయన 
పీ హెచ్ డి కి సమర్పించిన పరిశోధనా గ్రంధం . తప్పక చదవండి .సుధాకరనాయుడు   గారి కి నా  అభినందనలు .

Sunday, October 21, 2012

Blue and Green Return to Earth (War For Mars A story of the Fourth Millennium)my novel available on amazon.com
నా నవల  కుజుడి కోసం రిలీజ్ అయింది.ఇది కినిగే .కాం లో లభ్యం అవుతుంది.ప్రింట్ పుస్తకం కినిగే లో ttp://kinige.com/kbook.php?id=1202&name=Kujudi+Kosam" > కుజుడి కోసం లో కాని నవోదయా పబ్లిషర్స్ నుంచి  కాని తెప్పించుకోవచ్చు.

Wednesday, June 20, 2012

Kujudi kosam

>కుజుడి కోసం నవల ఇంగ్లీషు లో వా ర్ ఫర్ మార్స్అనే పేరు తో రాసినదిదీని సీక్వెల్ బ్లూ అండ్ గ్రీన్ అనే నవల ఇప్పుడు అమజాన్ డాట్ కాం లో లభ్యం అవుతోంది.చదవండి.

Saturday, May 5, 2012

Review

- గోపాలం. కె.బి. 06/05/2012 TAGS: ది ఎపిడమిక్ - (నవల) రచన: డా.చిత్తర్వు మధు, వాహిని బుక్‌ట్రస్ట్, విద్యానగర్, హైదరాబాద్-44 పేజీలు: 233, వెల: రూ.130/- సైన్స్ ఫిక్షన్ రచనలు అరుదుగా రావడానికి కారణాలున్నాయి. రచయితకు ముందు సైన్సు గురించి మంచి అవగాహన ఉండాలి. అందులోనుంచి ఆసక్తికరమయిన కల్పన చేయగలగాలి. కథ చదివే వారికి, ఇలా జరుగుతుందేమోననిపించాలి. కల్పన మరీ హద్దులుదాటితే, అవి ఫిక్షన్ పోయి ఫాంటసీగా మారుతుంది. ఈ పద్ధతిలో కథలు, నవలలు రాసిన వారు, కాలంలో వెనక్కు, ముందుకు వెళ్లడం, గ్రహాంతర యానం లాంటి విషయాలలోనే చిక్కుకుని రాశారు. ఇప్పటికీ, ప్రపంచమంతటా ఈ రకం రచనలు వస్తూనే ఉన్నాయి. వృత్తిపరంగా వైద్యులయిన చిత్తర్వు మధు, వరుసగా మూడు నవలలు రాశారు. అందులో ఇది మూడవది. పత్రికలో సీరియల్‌గా కూడా వచ్చింది. ఇందులోనూ గ్రహాంతర యానం ఉంది. కాలంలో వెనక్కు వెళ్లడమూ ఉంది. అయితే, రచయిత వైద్యుడు గనుక, బోలెడంత వైద్యం కూడా ఉంది. ఒక దుర్మార్గం డాక్టరు కాలంలో వెనక్కు విసిరివేయబడతాడు. అది మరీ వెనక్కుకాదు. అక్కడ మరి, వేరే గ్రహాలనుంచి నౌకలు దిగుతాయి. వాటిలోనుంచి వైరసును తెచ్చి, అతను తిరిగి ప్రస్తుతంలో అంటువ్యాధిని సృష్టిస్తాడు. అదే ‘ఎపిడమిక్!’ కథకు హంగులుగా, ఈ నవలలో అడవి జాతి మనుషులు, హీరో కాని హీరోకి ఒక అమ్మాయితో శృంగారం, పెళ్లీ, రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, కవిత్వం, మరమనుషులు, వరదలు, ప్రమాదాలు, పిల్లల మీద ప్రేమ, ఎన్ని అంశాలో! అడుగడుగునా ఉత్కంఠతో పేజీలు తిప్పుతారని, రచయిత తానే చెప్పేశారు. ఇక పాఠకుల పరిస్థితి వారికే వదిలేద్దాం! మరమనిషికి ప్రపంచంలోని భాషలన్నీ వస్తే ఆశ్చర్యంలేదు. కానీ పాతకాలం అడవి వారికి, మన ‘రావు’్భష అర్థమవుతుంది. ఫాంటసీ అంటే ఆలోచన మరీ స్వైరవిహారం చేయాలి. ఈ నవల్లో మాత్రం అంతా ఎక్స్‌పెక్టెడ్ లైన్స్‌లోనే సాగింది కథ! ఈ రకం నవలలు చదివే ఓపిక ఉంటే బాగానే ఉంది. సీరియల్‌గా వారంవారం కొంత చదవడం వేరు. నవలను ఒక్కసారి ఈ చివరనుంచి ఆ చివరకు చదవడం వేరు. ఖర్చుకు ఓరిస్తే ఈ నవల, సినిమాగా బాగుంటుందేమో? అయినా ఇలాంటి ఆసుపత్రి సినిమా ఎవరు చూస్తారు? గొప్ప నవలలే రావడం లేదు. మూడు నవలల మధ్యన మధు నవల వెరైటీగా ఉందన్నమాట మాత్రం సత్యం. Related Article విశ్వ ‘స్వప్న శకలం’లో కవిత్వ ప్రకాశం హృదయంలో ‘విహారి’ంచే చిన్న కథలు నిశితపరిశీలన నిండిన వ్యాసాలు ఆత్మపరిశీలనకు తోడ్పడే ‘అపరాధ’ పరిశోధన మంచి అన్నది కొంచెమైనా.. More Sharing ServicesShare Add new comment Your name Subject Comment * Latest News తక్కువ ధరకే బంగారం ఆశ చూపి రూ. 1.3 లక్షల దోపిడీ! అంతర్రాష్ట్ర రిమాండ్ ఖైదీ పరారీ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య గడ్డి కేంద్రాల్లో ఇబ్బందులు రానివ్వొద్దు విలువలతో కూడిన విద్యాబోధనే విద్యావాహిని లక్ష్యం Click Here! Click Here! Click Here!Click Here!Click Here! Most Read Most Commented రామోజీకి చుక్కెదురు శ్రీవారి ఆలయంలోకి షిర్డీసాయి పాదుకలు! సునీల్ పాత్ర కీలకం పట్టు వదలని ముఖ్యమంత్రి గృహప్రవేశం

dreams with eyes open: Blue and Green

dreams with eyes open: Blue and Green

Monday, April 16, 2012

Epidemic Novel

                      ది ఎపిడమిక్ On Kinige
   link for my novel Epedemic available on kinige.com

My Blog Visitors