Pages

Saturday, October 10, 2009

హైడ్ virus

నా నవల హైడ్ వైరస్ నవ్య వార పత్రిక లో సీరియల్ గా ప్రచురింప బడి క్రిందటి వారం తో ముగిసింది. నవల అయ్పోయిన తరవాత నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి .నవల చాలా బాగుందనీ ఇంకా సైన్సు ఫిక్షన్ రాయమనీ..పాఠకుల నుంచి వుత్తరాలు రాలేదని బాధ పడిన నాకు ఫోనులు ఎంతో సంతోషం కలిగించాయి.ఇది వరకు రాసిన బై బై పొలోనియా సి సి యు నవల గురించి కూడా ఛాలా మంది అడిగారు. నవలలు చదివితే హైడ్ వైరస్ నవల ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఇవి వాహినీ పబ్లిషర్స్ విద్యా నగర్ హైదరాబాద్ విశాలాంధ్ర పబ్లిషర్స్ నవోదయ పబ్లిషర్స్ వద్దా లభిస్తాయి .కొన్ని ప్రతులు నా దగ్గర వున్నాయి .నాకు ౩౦౦ రుపీస్ చెక్ గానీ ఎం గానీ పంపితే నేను పంపగలను. త్వరలో హైడ్ వైరస్ కూడా నవల గా వస్తుంది. ధన్యవాదాల తో మధు

Tuesday, July 28, 2009

prema


ప్రేమ
ప్రేమంటే
నీ కోసం కన్నీరు కార్చడమేనా?
నీ బాధని పంచుకోడమేనా?
నిన్ను బాధ పెట్టకుండా వుండటమేనా? నీ తో కలసి నవ్వడమేనా?
నీ తో కలసి నడవడమేనా?
వ్యక్తిత్వం లేనిదా ప్రేమ?
నీ కోసం తనని మరచి పోయేదా ప్రేమ ?
నిన్ను గుడ్డి గా ఆరాధించెదా ప్రేమ?
నీ లో తప్పుల్ని చెప్పనిదా ప్రేమ?
నిన్ను ఎలాగైనా సమర్ధించేడా ప్రేమ?
అలా వుంటే బాగుంటుంది,
కాని అది కాదు ప్రేమ
నిన్ను ఉత్తేజ పరిచేది ప్రేమ
నిన్ను బాధించకుండా నీ తప్పుల్ని చెప్పేది ప్రేమ...
తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నే నిన్ను
తన్మయుడిని చేసేది ప్రేమ...తన మీద ఆధారపడకుండా చేసే
కానితన కోసం ఆరాటపదేలా చేసేదే నిజమైన ప్రేమ...

Friday, July 24, 2009

HYD Virus

నా నవల " HYD్ వైరస్" నవ్య వార పత్రిక లో సీరియల్ గా ప్రచురించ బడుతోంది. ఇప్పటి కి పది వారాలు ముగిసినాయి. మీరు తప్పకుండా చదివి మీ అభిప్రాయాలు తెలియజేయ వలసింది గా కోరుతున్నాను. నవల నేను లోగడ రాసిన బై బై పోలోనియా నవల కు తరవాతి భాగము. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ నవల .దయ చేసి తప్పకుండా చదవండి madhu

Thursday, April 9, 2009

పాట కాదు AaaTa

పాట కాదు ఆట
--------------------





మనిషి గొంతులో మనసు బాధ....
దద్దరిల్లే గిటార్
కార్డుల ప్రకంపన లో

ఆత్మ ఘోష!
ధమరుకం లా
శివమణి
డ్రం విన్యాసం...
అంత లో వాయులీనాల గోల...
ఇంతలో... వేణువుల ఈల...
మధ్య లో సన్నని ఆడ గొంతు
నుంచి మాటల పాట
అన్ని కలిపి ర్యాప్ చేసి...
ఫ్యుజన్ చేసి
రహమాన్ చేసే ఆట....!


Thursday, April 2, 2009

nenu


నేను

Tuesday, March 31, 2009

వేసంగి

వేసంగి
నిశ్చలం గా
నిబ్బరం గా
గ్రీష్మ తాపం
వేడి.... సెగ....
ధూళి పొగ...!
ఆగిన రిక్షా లో
అరమోడ్పు కన్నుల ముసలి వాడు!
నీరసం గా కదిలిన బస్సు
థల తలా మెరిసే తారు రోడ్డు
మబ్బు తునక లేని ఆకాశం...
నువ్వు మాత్రం
ఫ్రెష్ గా గా చిరునవ్వు తో....
నీ తల లో తడి తడి గా
వాడని గులాబి రేకులు...

Monday, March 16, 2009

ఖాళీ

ఖాళీ ఇల్లు
---------------
నువ్వు లేవు
నీ అందియల సవ్వడి
వినిపిస్తుంది నా ఇంట్లో...
నా ఖాళీ ఇంట్లో...
చిరు నవ్వుల స్వనం
తేలి వస్తుంది గాలి లో....
నిట్టూర్పుల చప్పుడు అంటుకుని వుంది గోడలని
చూడని
చెప్పని
కలల కలవరం
నిద్ర లో వెన్నాడు తుంది!

Tuesday, February 17, 2009

BAAPU


బాపు... బాపు అంటే అందం... బాపు బొమ్మ అంటే వో అందమైన కల.... ఆయన కార్టూన్ అంటే నవ్వుల పువ్వులు.... .చిన్నప్పట్నించి ఆయన ఫ్యాన్ ను నేను! ఆయన తో ఫోటో దిగే అదృష్టం ఒక సారి......

Monday, January 26, 2009

జిక్కి

జిక్కి పాట

పులకించని మది పులకిస్తుంది......!

ఆవిడ పాట వింటే....!

వర్షించని కన్ను వర్షిస్తుంది.

కరిగి పోయిన కల

కళ్ళ ముందు కనిపిస్తుంది.

వాడిపోయిన ప్రేమ

మళ్లీ వికసిస్తుంది...

అంతరంగం లో

అనురాగం

జలపాతం లా

ప్రవహిస్తుంది....

ఆమె శ్వాస ఆగిపోయినా

మన గుండెల్లో

జిక్కి గొంతు

ప్రతిధ్వనిస్తూనె వుంటుంది

githam

గీతం

....గీతం...
సంగీతం....
స్వరం.....
స్వనమ్..
మృదులం
మధురం
భావం
గానం...
రాగం...
తాళం....
వ్యధల ఎదల చీల్చి పేగులు మనోహర ఆర్తనాదం...
మధుర స్మృతుల కళాకృతుల సుందర శబ్ద చిత్రం...
గీతం....
సంగీతం....

Sunday, January 25, 2009

సంజె veLa

సంజె వేళ
ఆకాశపు వాకిలిలో
చుక్కల
తోరణాల దీపాలు...
అస్తమయ భానుడి
ఎర్రని కాంతి...!
కెంపుల గుట్టల వెనుక...
ఎర్రని మంటలా...
నలుపు ఎరుపు నీడల్లో
అస్పష్టం గా ...
మా వూరు...!

Saturday, January 24, 2009

ompu

వొంపు

కాలవ గట్టు వొంపు తిరిగి...
వొంపు తిరిగిన
చెట్ల కొమ్మలు...

నీళ్ల లో వొంపులు తిరిగిన బొమ్మలు...
నిలాకాసం లో తెల్ల మబ్బు
వొంగి చెట్టును ముద్దు పెట్టుకుంది...

...



మా vuuru

మా వూరు

చెట్లల్లో తలుక్కుమన్న
సూర్య బింబం
చెరువు మీద మసక గా మంచు
నిశబ్దం లో దూరం గా
మోగిన గుడి గంట....
ఒక తీయటి కోకిల పాట
ఒక గోవు బుజ్జాయి కోసం కేక
మా వూరు
నిద్ర లేచింది!



thappadu

తప్పదు

అనంతం లో సాగి పోయే
అణువులం మనం
అనుభూతులు వేరైనా
ఆకారాలు మారినా
ప్రాణం పోసుకున్న
ఎలేక్ట్రోన్లం
అంతం అయనా
అంతం లేదు
మరో రూపం లో
అస్తిత్వం తప్పదు
విశ్వం లో
ఉనికి తప్పదు!

Thursday, January 22, 2009

పెళ్లి



పెళ్లి

ఆకృతులు వేరైనా
ఆలోచనలు ఒకటేనని
శరీరాలు విడివడినా
హృదయం ఒకటేనని
బాధలు వేరైనా
భారం ఇద్దరిదీనని
నాలుగు కళ్ళలో
రెండు దృశ్యాలు చూడాలని

వొకరికి
ఒకరు అని అనుకున్న ప్రేమ

ఏది
?ఎటు పోయింది?

పెళ్లి తర్వాత
ప్రేమ 
ఏమయి పోతుంది ?


Monday, January 19, 2009

naa gurinchi.

నా పేరు మధు.నేను తెలుగు లో నవలలు కథలు రాసాను. నేను వృత్తి రీత్యా డాక్టర్ ని .నేను రాసిననవలలు Bye Bye పొలోనియా సి సి యు సాలె గూడు ,ఔనా.. మొదలయినవి.........ఎపెడేమిక్ అనీ నవల త్వర లో ప్రచురించబడుతోంది. ఇదీ నా స్వ విషయం. త్వర లో నా కవిత లు కథలు నవలలూ బ్లాగ్ లో అందజేస్తాను. చిత్తర్వు మధు

Sunday, January 18, 2009

namaskaaram




నమస్కారం.ఈ విశ్వంలో తెలుగు చదివే అంతర్జాలం చదివే పాఠకులందరికీ నమస్కారం!నా ఆలోచనలు అనుభూతులు...నా కవితలు కథలు నవలలుఈమధు భాషిని లో లో మీ కు సమర్పితం ప్రేమతో చిత్తర్వు మధు



My Blog Visitors