Pages

Thursday, March 4, 2010

teluGe maTlaadudaama?

 తెలుగు అంటే  నాకు చాలా ఇష్టం. అంటే ఇంగ్లీషు అంటే  కోపమని కాదు.తెలుగు అక్షరాలూ  నుంచి తెలుగు మాటల నుంచి అన్నీ  నాకు కమనీయం గా కనిపిస్తాయి .అక్షరాలూ  చూడండి! వెన్నెల లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్ల లాగానే  ఉంటాయి. ఆ తలకట్లు  చుడండి ఎంత పొగరు గా  తెలుగువాడి ఆత్మాభిమానం  లాగానే గర్వం గా ఉంటాయి. ఆ పదాలు కవితలు  చదువుతుంటే మనసు ఉప్పొంగి పోతుంది. 
సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి మంచి చేయవోయ్ అన్న  గురజాడ మనసున మల్లెల మాల లూగేను  అని కోయిల లా గానం చేసిన  కృష్ణ శాస్త్రి   నన్నయ్య గారి మహాభారతం నుంచి  ఎర్రాప్రగడ శారదరాత్రుల నుంచి  తిక్కన్న గారి కవితా సౌరభం శ్రీ శ్రీ మహా ప్రస్తానం ఆరుద్ర త్వమేవాహం  దాశరధి కవితా సుమాలు  గురజాడ ముత్యాల సరాలు ...  ఎన్నని చెప్పగలను?భావకవులు  దేవులపల్లి కొమ్మలో  కొమ్మని అని ఆలపించిన గానం బసవరాజు  అప్పారావు రాయప్రోలు  నుంచి తిలక్ అమృతం కురిసిన రాత్రి దాకా  అన్ని నా కిష్టం!
ఇప్పుడు  సినిమాలలో కుడా అద్భుతమైన పాటలు  రాసారు .ఆత్రేయ  నారాయణ రెడ్డి  శ్రీ శ్రీ  నుంచి సీతారామ శాస్త్రి వరకు  మనోహర భావాలకి అందమైన పదాల తో పాటలు అల్లారు.
కల కానినిది నిజమైనది ... ప్రేమ ఎంత మధురం  ...మనసు గతి ఇంతే  మనసంతా నున్వ్వే  నువ్వు నువ్వు ...ఎదుటను  వున్నది ... మౌనం గానే ఎదగమని     ఎన్ని పాటలు...
అయితే మనం తెలుగు మాట్లాడం ... "కారు లో ఆఫీసు  కు పోయి వర్క్ చేసి తిరిగి వస్తుంటే బంద్  వల్ల ట్రాఫిక్ జం   లో లేటు అయింది."హోటల్  సినిమా  రైలు  రీలు రోడ్డు  కారు సూపర్ మార్కెట్టు  స్టేషన్  ఇలా ఎన్ని మాటలు ఇంగ్లీషు వి ...మన భాష క్రమం గా కనుమరుగయ్ పోతుందా? తెలుగు లో మాట్లాడి తేనే పల్లెటూరు వాడి వని  వెక్కిరించే సంస్కృతి  ఎప్పుడు పోతుంది?
ఎక్కడో స్కూలు లో "నేను తెలుగు మాట్లాడను"  అని మేడలో పటం   కట్టి పిల్లలని శిక్షించారట! .
ఒక్క భాష ఒక్క సంస్కృతి  ఒక్క ఆత్మ గౌరవం     మనకి ఎప్పుడు వస్తాయి. నువ్వు శున్ట్ట  అంటే నువ్వు వెధవ అనుకుంటూ  మళ్ళీ మళ్ళీ ముక్కలు ముక్కలు అయి హిందీ లో నో ఇంగ్లీషు లోనో తిట్టుకుంటూ తెలుగు వాళ్ళం అంతా ఒకప్పుడు మన  సాహిత్యం సినిమాలు  ఇలా ఉండేవట  అని వింత గా ముందు ముందు  మరో సారి నశించి పోయిన భాష మాట్లాడే వారి గా మిగిలిపొతామా?
ఈ మధ్య బెంగలూరు కేరళ వెళ్ళినప్పుడు  ఇవన్ని  నాకు వచ్చిన ఆలోచనలు. 
జంతు ప్రదర్శన శాల   నారాయణ హృదయాలయ  నగర పాలిక విహార స్థల ఇలా  అన్ని  వాళ్ళు  తమ భాష లో  నే రాసుకుంటున్నారు.మనకే ఈ పరభాషా వ్యామోహం...
ఓకే!  నెక్లెస్  రోడ్డు కి ట్యాంక్ బ్యాండ్   కి వెళ్లి ఫంక్షన్ హాల్లో మ్యారేజీ అటెండ్ అవ్వాలి .వస్తాను....      

1 comment:

  1. telugu bhasha thiyyandi.mana hruadayaani daGGirynadi.entha english matlaadevadynaa okka debba tagGilithe amma...ane antaaDu mom ano dad ano anane anadu aunaa?

    ReplyDelete

My Blog Visitors