Pages

Thursday, March 5, 2015

India"s Daughter

 లో నే వుంది ఈ సమస్య అంతా.అయితే ఈ ఇంటర్వ్యూ ని ఎందుకు ప్రసారం చేయకూడదు అది ప్రసార మాధ్యమాల స్వతంత్ర ప్రతిపత్తి కి విరుద్ధం కదా అని కూడా అనిపిస్తుంది.రెండు సంవత్సరాల తర్వాత ఎవరో విదేశీ జర్నలిస్టు మళ్ళీ ఈ విషయం బయటకి తీయడం మానిన గాయాలని కెలికి నట్లు దేశాన్నంతటి నీ బాధ పెట్టింది. నేను ఢిల్లీ ఒక వారం క్రితం వెళ్ళినప్పుడు కార్ డ్రైవర్ గా వచ్చిన సర్దార్ జి ని అడిగాను.అర్దరాత్రి పార్టీ నుంచి తరిగి హోటల్ కి వస్తు ఎయిర్పోర్ట్ హైవే మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపొయినప్పుడు ...చుట్టు కార్లు అందరు వారి వారి కార్ల లో అద్దాల్లో కనిపిస్తున్నారు కాని నిజం గా మూసేసిన అద్దాలు ఉంటె ఎంత భయం .ఇంత ట్రాఫిక్లో చుట్టు కార్లు పోతుంటే రేప్స్ ఎలా జరుగుతున్నాయి ఢిల్లీ లో? అని.50 ఏళ్ళ పై బడిన సర్దార్జీ ఫాదర్ ఫిగర్ లానే ఉన్నాడు ,అయినా "ఆడపిల్లలు తాగేసి న పరిస్థితి లో అర్దరాత్రి కార్లు ఎక్కుతూ ఉంటారు కొంత మంది లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటారు .కన్సేంట్ ఇచ్చి కూడా మళ్ళీ రేప్ అయిందని కంప్లైంట్ చేస్తారు సర్ .ఇదంతా మామూలే!" ఇలా ఇంగ్లీష్ లోనే అభిప్రాయం వెలిబుచ్చాడు. ఈనాటికి చాలా మంది మగవాళ్ళ మైండ్సెట్ ఇలాగే వుంది.అంటె డ్రైవర్ తన ధర్మం నిర్వర్తించి .ఆ అమ్మాయిని భద్రం గా ఇంట్లొ దింపాలి గాని అత్యాచారం చేయాలా? ఈ మైండ్ సెట్ మారాలంటే ఇలాం టి ఇంటర్వ్యూ లు చర్చ లు షాక్ ట్రీట్మెంట్ లు జరగాల్సిందే!

Tuesday, February 24, 2015

వైరాగ్యం స్టేటస్


    ఒక్కొక్కప్పుడు జీవితం కదలకుండా ఆగిపోతూ   ఉంటుంది.ట్రాఫిక్ లో రెడ్ లైట్ దగ్గర పడిగాపులు కాచినట్లు ముందుకు వెళ్ళలేం,     వెనక్కు వెళ్ళ లేం. కొందరు ముందుకు  వెళ్ళిపోతూ ఉంటారు కొందరు ఆగిపోవడం కూడా ఎంజాయ్ చేయగలరు.పాటలు వింటూ అటు ఇటు చూస్తూ ..ఆలోచనలలో తేలిపోతూ .అయినా కాలం గడిచిపోతు ఉంటుంది .కొందరు ముందు కొందరు వెనకా... అందరూ గమనం సాగించవలసిందే.ఏదో క్షణం లో ముందో వెనకో జీవితం కార్ ఆపి పార్క్ చేయక తప్పదు .నేను ఎంజాయ్ చేసానని ఒకడు నేను జీవితం లో ఏది సాధించలేదని మరొకడు నాకు అంత్లేని సంపదలని సంపాదించానని  మరొకడు, చూడవలసిన్దేమి లేదు అని మరొకడు, మళ్ళీ జన్మ కోసం మరొకడు, జన్మరాహిత్యం కోసం మరొకడు ఇలా ఆశ పడుతూనే అనుక్షణం గడిచిపోతుంది.నాకైతే, దేనికి అర్ధం లేదనే అనిపిస్తుంది .నేనొక చీమ   లాగా బాక్టీరియా లాగా బుధ్భ్హుథ ప్రాయమైన జీవితం చాలించేసి అణువుల్లో కలిసిపోయిన తరవాత ఏమి ఉంటుంది , ఏమి లేదు అంతా శూన్యం .కొన్నాళ్ళు నా పాటలు వింటారని కొన్నాళ్ళు నా కవిత్వం చదువుతారని కొన్నాళ్ళు నా కధలు వింటారని కొన్నాళ్ళు నేను తీసిన సినిమాలు మిగులుతాయని నేను శాశ్వతత్వం సాధిస్తానని అనుకోవడం ఒక భ్రమ !.సోక్రటీస్ నుంచి ,వేదాల నుంచి భగవద్గీత నుంచి ఈమధ్యనున్న సార్త్రే దాకా ఏ సిద్ధాంత మైనా జీరో నుంచి 2 శతాబ్దాల దాక జీవిస్తుందేమో .అన్నిటికి మరుపు తప్పదు .అలాంటిది నా భావాలకి ఒక క్షణం జీవిత కాలం ఒక నీటి బుడగ లాంటి అక్షర రూపం మిగిలిపోతాయేమో ...ఎందుకీ తపన ?అనిపించినా, ఆ బుడగ మీద ఓ క్షణం మెరిసే పంచ రంగులు ఊహల మేజిక్ ఎవరైనా చూసి ఓహో అంటే     చాలు.. !         

Friday, January 30, 2015

వెలుగులు

 ఆకర్ష, ఆకాంక్ష ఇద్దరు కవల పిల్లలు నా మనమరాళ్ళు .వాళ్ళ చిరునవ్వులు బుడి బుడి నడకలు ఆటలు అవే ఇప్పుడు మా ఇంటికి  లో మెరుపులు ! 

Saturday, January 17, 2015

చలి చలి గా

    చలి చలి గా రాత్రులు, మంచు కురిసే ఉదయాలు,  నులివెచ్చని లేత యెండ తో  నిండిన మధ్యాహ్నాలు  ఈ కొత్త సంవత్సరం లో చలి కాలం హైదరాబాద్ లో చాలా రొమాంటిక్ గా ఆహ్లాదం గా వుంది. కలత పెట్టె వార్తలు, టీవీ లో అరుపులు, ధ్వని కాలుష్యం చేస్తూ వాహనాలు, జోకులు వేస్తే కోపం వొచ్చి చంపేసే కోపిష్టి పిచ్చివాళ్ళు, ఇవన్ని మామూలే .ఇవన్ని మరిచి హేమంతం సొగసులో ఊహల రగ్గులు కప్పుకుని కరిగిపోయిన కలలో మరిచిపోయిన కవిత్వమో కొత్త గా విరిసిన మంచు ముత్యాలు జల్లిన యెర్ర   గులాబీ ల నో  చూసి  మురిసిపోతూ కొన్నిక్షణాలు అయినా గడపగలిగే మంచి వాతావరణం ఇప్పుడు! ఇక్కడ  .బెస్ట్ సీజన్ ఆఫ్ ది ఇయర్ !

Tuesday, January 13, 2015

సంక్రాంతి


     సంక్రాంతి మళ్ళీ వచ్చింది .నగరం లో సంక్రాంతి లేనే లేదు .టీవీ లో మనస్సులో తప్ప.నిజం సంక్రాంతి భోగి మంటలు గొబ్బెమ్మలు గంగిరెద్దులు ముగ్గులు కోడి పందాలు కొత్త ధాన్యం దానాలు మకర సంక్రమణం స్నానాలు    ఇవన్నీ పల్లె ల లోనే .చిన్న పట్టణాల లోనే .. 


Tuesday, January 6, 2015




   

                 పాట కాదు ...ఆట 
                   మనిషి గొంతు లో 
                      మనసు బాధ 
                        దద్దరిల్లే గిటార్ 
                         కార్డుల ప్రకంపనల్లో 
                            ఆత్మ ఘోష 
                          ధమరుకం లా 
                             శివమణి డ్రమ్ విన్యాసం 
                                అంతలో వాయులీనాల గోల 
                                     ఇంతలో వేణువుల ఈల
                                        మధ్య లో సన్నని ఆడ గొంతు 
                                          వెనుక గరుకైన   మగ గొంతు 
                                       కలిపి మాటల పాట  
                                       అన్ని కలిపి ర్యాప్ చేసి ఫ్యూషన్ చేసి 
                                   అద్భుత సంగీతం   రహమాన్ చేసే  ఆట !

 (January 6th Birthday of Mozarat of Madras.Happy Birthday!}
                         
                         

Saturday, January 3, 2015

నీ జ్ఞాపకం



   
 నీ జ్ఞాపకం 
       ఏ సంధ్య చూసినా నీ జ్ఞాపకం 
                        నిముషాలు దొర్లిపోతుంటే 
                             సముద్ర తీరం లో నీ కోసం ఎదురుచూడటం ..ఇంకా మరిచిపోలేదు
                             నువ్వు రాకుండా నిశబ్దం గా రోదించి నిద్ర పోవడం మరువ లేదు 
                              క్షణాలు నిముషాలై నిముషాలు ఘంటలై 
                          సంవత్సరాలు దశాబ్దాలై 
                               జీవితం పలిత  కేశమై 
                                మలి   సంధ్య లో  ఇప్పుడు
                                నవ్వుకుంటూ ,ఇప్పుడా రావడం?

My Blog Visitors