Pages

Tuesday, February 24, 2015

వైరాగ్యం స్టేటస్


    ఒక్కొక్కప్పుడు జీవితం కదలకుండా ఆగిపోతూ   ఉంటుంది.ట్రాఫిక్ లో రెడ్ లైట్ దగ్గర పడిగాపులు కాచినట్లు ముందుకు వెళ్ళలేం,     వెనక్కు వెళ్ళ లేం. కొందరు ముందుకు  వెళ్ళిపోతూ ఉంటారు కొందరు ఆగిపోవడం కూడా ఎంజాయ్ చేయగలరు.పాటలు వింటూ అటు ఇటు చూస్తూ ..ఆలోచనలలో తేలిపోతూ .అయినా కాలం గడిచిపోతు ఉంటుంది .కొందరు ముందు కొందరు వెనకా... అందరూ గమనం సాగించవలసిందే.ఏదో క్షణం లో ముందో వెనకో జీవితం కార్ ఆపి పార్క్ చేయక తప్పదు .నేను ఎంజాయ్ చేసానని ఒకడు నేను జీవితం లో ఏది సాధించలేదని మరొకడు నాకు అంత్లేని సంపదలని సంపాదించానని  మరొకడు, చూడవలసిన్దేమి లేదు అని మరొకడు, మళ్ళీ జన్మ కోసం మరొకడు, జన్మరాహిత్యం కోసం మరొకడు ఇలా ఆశ పడుతూనే అనుక్షణం గడిచిపోతుంది.నాకైతే, దేనికి అర్ధం లేదనే అనిపిస్తుంది .నేనొక చీమ   లాగా బాక్టీరియా లాగా బుధ్భ్హుథ ప్రాయమైన జీవితం చాలించేసి అణువుల్లో కలిసిపోయిన తరవాత ఏమి ఉంటుంది , ఏమి లేదు అంతా శూన్యం .కొన్నాళ్ళు నా పాటలు వింటారని కొన్నాళ్ళు నా కవిత్వం చదువుతారని కొన్నాళ్ళు నా కధలు వింటారని కొన్నాళ్ళు నేను తీసిన సినిమాలు మిగులుతాయని నేను శాశ్వతత్వం సాధిస్తానని అనుకోవడం ఒక భ్రమ !.సోక్రటీస్ నుంచి ,వేదాల నుంచి భగవద్గీత నుంచి ఈమధ్యనున్న సార్త్రే దాకా ఏ సిద్ధాంత మైనా జీరో నుంచి 2 శతాబ్దాల దాక జీవిస్తుందేమో .అన్నిటికి మరుపు తప్పదు .అలాంటిది నా భావాలకి ఒక క్షణం జీవిత కాలం ఒక నీటి బుడగ లాంటి అక్షర రూపం మిగిలిపోతాయేమో ...ఎందుకీ తపన ?అనిపించినా, ఆ బుడగ మీద ఓ క్షణం మెరిసే పంచ రంగులు ఊహల మేజిక్ ఎవరైనా చూసి ఓహో అంటే     చాలు.. !         

No comments:

Post a Comment

My Blog Visitors