పాట కాదు ...ఆట
మనిషి గొంతు లో
మనసు బాధ
దద్దరిల్లే గిటార్
కార్డుల ప్రకంపనల్లో
ఆత్మ ఘోష
ధమరుకం లా
శివమణి డ్రమ్ విన్యాసం
అంతలో వాయులీనాల గోల
ఇంతలో వేణువుల ఈల
మధ్య లో సన్నని ఆడ గొంతు
వెనుక గరుకైన మగ గొంతు
కలిపి మాటల పాట
అన్ని కలిపి ర్యాప్ చేసి ఫ్యూషన్ చేసి
అద్భుత సంగీతం రహమాన్ చేసే ఆట !
(January 6th Birthday of Mozarat of Madras.Happy Birthday!}
No comments:
Post a Comment