చలి చలి గా రాత్రులు, మంచు కురిసే ఉదయాలు, నులివెచ్చని లేత యెండ తో నిండిన మధ్యాహ్నాలు ఈ కొత్త సంవత్సరం లో చలి కాలం హైదరాబాద్ లో చాలా రొమాంటిక్ గా ఆహ్లాదం గా వుంది. కలత పెట్టె వార్తలు, టీవీ లో అరుపులు, ధ్వని కాలుష్యం చేస్తూ వాహనాలు, జోకులు వేస్తే కోపం వొచ్చి చంపేసే కోపిష్టి పిచ్చివాళ్ళు, ఇవన్ని మామూలే .ఇవన్ని మరిచి హేమంతం సొగసులో ఊహల రగ్గులు కప్పుకుని కరిగిపోయిన కలలో మరిచిపోయిన కవిత్వమో కొత్త గా విరిసిన మంచు ముత్యాలు జల్లిన యెర్ర గులాబీ ల నో చూసి మురిసిపోతూ కొన్నిక్షణాలు అయినా గడపగలిగే మంచి వాతావరణం ఇప్పుడు! ఇక్కడ .బెస్ట్ సీజన్ ఆఫ్ ది ఇయర్ !
Saturday, January 17, 2015
Subscribe to:
Post Comments (Atom)
కవిత బాగుంది మేష్టారూ
ReplyDelete