Pages

Saturday, November 19, 2011

Sree Raama Rajyam movie

     
                   "  శ్రీ రామ రాజ్యం మొదటి రోజే ఐ మాక్స్ థియేటర్ లో సెకండ్శో

కి వెళ్లి  చూసేసాం.బాపు గారికి అంత అభిమానులం మా ఫ్యామిలీ అంతా.ముందు అద్భుత దృశ్యాలు పెద్ద తెర మీద రాముడు సీతా పుష్పక విమానం లో అయోధ్య కి రావడం చామంతి పూల వానా "జగదానంద 
  కారక" పాటా శ్రవణానందం గా     నేత్రానందం గా హాలీవుడ్ సినిమాల రీతి లో "అదిరి పోయాయి."అయితే తరవాత సినిమా మరీ స్లో  అయిందని పించింది.ఇళయ రాజా సంగీతం ముఖ్యం గా సింధు భైరవి
   హిందోళం లో సృజించనవి పాటలు
  బాగున్నాయి.అయితే అక్కడక్కడా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ లా తెలిసిపోతున్నాయి.ముఖ్యం గా లక్ష్మణుడు సీత ని
  అడవి లో కి రధం  లోతీసుకు పోతున్నప్పుడు అడవి అంతా బొమ్మల్లాగా వుంది.బాలకృష్ణ నటన కి చాల  కష్ట పడ్డాడు అని అనిపించింది.నయనతార మౌనం గా కన్నీరు కారుస్తూ మన చేత కూడా కన్నీరు పెట్టించింది.ఇక లవకుశులు అంత యిమ్ప్రేసివ్ గా లేరు.నటీ నటుల ఉచ్చారణలు అక్కినేని వాల్మికి తప్ప అంతగా బాగు లేవు.సినిమా అంతా నిమ్మది గా నడిచినా హృదయం లో బాధ కలిగిస్తుంది.లవకుశులు
అయోధ్య లో ప్రజలకి లాగానే మనకి కన్నీరు తెప్పించారు.బ్రహ్మానందం తిప్పడి పాత్ర ఏమీ గుర్తుండేట్లు గాలేదు.ఆ నాటి లవకుశ చూసిన నాకు ఆ పాట లే నచ్చుతాయి.అయితే ఈనాటి సాఫ్ట్ వేర్ జనరేషన్ కి కొత్త గ్రాఫిక్స్ తో రాజా బ్యాక్గ్రౌండ్  సింఫనీ సంగీతం తో వున్న ఈ చిత్రం నచ్చుతోంది... ప్రసంసిస్తున్నారు...విజయం సాధిస్తుంది అని ఆశిద్దాం!
 



Saturday, November 12, 2011

kjudi kosam


                                తెలుగు నవలలు చదివే వారిని ఒక రచయిత గా మెప్పించడం చాలా కష్టం అని తెలుసుకున్నాను.
నా సీరియల్ నవల కుజుడి కోసం  రచన మాస పత్రిక లో జనవరి నెల నుంచి వస్తోంది.ఇది  వినూత్నమైన ఇతివృత్తం
  తో భవిష్యత్ లో అంటే ౩౪౫౦ సంవత్సరం లో జరిగిన కధ గా రాసినది.ఈ కాలం లో అంతర్గ్రహ ప్రయాణాలూ రోబట్లూ అతి  అద్భుతం గా వరూధి చెందినా విజ్ఞానం ఇవన్ని ఊహించి కుజ గ్రహం లిని కాలని లో జరిగిన యాద గా రాసాను.అదే విధం గా ఆ గ్రహం లో మన వూహ కందని
 మాంత్రిక రాజ్యం వున్నట్లు వారికి కరతలమలాకం అయిన  విశ్వశక్తి గురంచి రాసాను.ఇది  వూహ కందని అద్భుతమైన సైన్సు ఫాంటసీ.ఒక్కరు కూడా చదివి ఒక్క మాట "బాగుంది" అని చెప్పరే!తెలుగు పాటకులకి సైన్సు ఫాంటసీ నచ్చదా? నేను సరిగా రాయ లేదా? ఇలాంటి నిరుత్సాహం తో  సతమం అవుతున్నాను.మీరేవర్య్న రచన లో ఈ నవల చదివి కనీసం బాగులేదని కానీ  రాసినా సంతోషమే.
 
  
 
 

Tuesday, July 5, 2011

Cross roads

               హైదరాబాదు లో ఇప్పుడు  బంద్ జరుగుతోంది.రాష్ట్ర విభజన కోసం  ఆందోళనలు జరుగుతున్నాయి.ప్రజా ప్రతినిదులు రాజీనామాలు  చేసారు. డిల్లీ లో కేంద్ర ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోవడం లేదు.ఈ అనిశిత పరిస్థితి ఎన్నాళ్ళు అని విసుగు గా వుంది.ఇది ఒక  స్వాతoత్ర  ఉద్యమం లాగా  తయారయింది.నిజానికి ఇది అంతా భారత దేశం కదా...ఇది అంతా ఒకే  రాష్ట్రం కదా..అయినా  పరదేశ పాలన లో మగ్గుతున్న ప్రజల లా గా అందరు బాధ పడు తున్నారు. ఎన్నికలు మనకున్నాయి.రాజ్యాంగం   మనకు ఉన్నది.కానీ ఏదో పరదేశపు పాలన లాగా దాని నుంచి విముక్తి కోసం పోరాటం అనీ భావనతెలంగాణా లో బలం గా వుంది.
అయితే హైదరాబాదు లో స్థిర పడిన ఆంధ్రులూ కోస్తా రాయలసీమ శ్రీకాకుళం నుంచి వచ్చి స్థిరా పడిన ప్రజలు అందరూఇది మన రాష్ట్రం అనే అనుకునే స్థిర పడ్డారు.హైదరాబాదు అద్భుతం గా వృద్ధి పొంది
తెలుగు సంస్కృతీ వైభవం వెలిగి పోతుందనే సమయం లో ఈ ప్రాంతీయ కలహాలు అపార్ధాలూ నాకు ఎంతో మనో వేదనని కలిగిస్తున్నాయి.దీని కి కల తప్పు ఒప్పులు నేను విశ్లేషించడం లేదు.ఈ పరిస్థితులు మారి మళ్ళీ తెలుగు వైభవం విశ్వం అంతా తన బావుటా ని ఎగర వేయాలని అందరూ ప్రేమ తో ఐకమత్యం గా వుండాలని 
పక్క నే వున్న తమిళుల లాగా కన్నడిగుల లాగా  మన సంస్కృతి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని    ఒక తెలుగురచయిత గా కోరుకుంటున్నాను!
 
 

 
 

Friday, February 18, 2011

naa kavitha

                                                      నా కవిత...
-------------------------------------------...
                         ఆలోచనలు నీలాకాశం లో 
                          విహరించే  శ్వేత పారావతాలు...
                            ఆదర్శాలు అధిరోహించలేని 
                               ఉన్నత హిమ శిఖరాలు...
                                  అనుభూతులు బతుకును 
                                   పులకింపచేసే పుష్ప మాలికా     
                                       పరిమళాలు...
                                        జ్ఞాపకాలు శరదృతువు లో 
                                          రూపాలు మార్చుకునే 
                                             ధవళ మేఘాలు  
                                             పోరాటాలు 
                                       అకుంటిత

                                              దీక్ష తో గళం  ధరించిన
                                             అగ్ని మాలలు
                                             కవనాలు మనసు  
                                               విహరించే సుందర 
                                                  పుష్ప వనాలు..
                                           కవితలు నా హృదిని 
                                           వెన్నంటి వీడని వెతలు...
                                               గీతాలు ఖాళీ 
                                            మందిరాలలో
                                    ప్రతిధ్వనించే  ప్రియ              మధురహాసాలు 
                   చూపులు దిగంతాల్లో ఉదయించే సూర్య బింబాలు 
                   ఆశలు ఆరాటాలు స్మృతులు 
                     పడి లేచిన సముద్రపుటలలు
                      ప్రియ భాషణాలు నిశబ్దం అయిన  క్షణాలు 
                      గుండె ని చీల్చిన క్రూరపు  నిర్లక్ష్యాల
                          కత్తులు...
                  ఆ బాధలు మనసు నీ  శరీరాన్నీ విధ్వంసం 
             చేసిన చిత్ర తూణీరాలు 
          అన్నిటినీ మరిచీ  మరువక ప్రశాంతత లో

           నెమరువేసేదే  నా కవిత్వం ...
                అందుకే నా భావాలు స్వేచ్చా విహంగాలు
               నా అక్షరాలు సెల్ ఫోను లో మాట్లాడుతూ 
               చిరునవ్వులు నవ్వే ఆడ పిల్లలు...

(అవును నాకు తిలక్ అభిమాన కవి)
                 

 
   

 
   

Wednesday, February 16, 2011

thappadu

                                          తప్పదు
                             అనంతం లో సాగిపోయే

                                 అణువులం మనం 
                                     అనుభూతులు వేరయినా 
                                   ఆకారాలు మారినా 
                                        ప్రాణం పోసుకున్నఎలక్ ట్రానులం
                                          అంతం అయినా అంతం లేదు.
                                             ఈ శరీరం  బూడిద అయినా 
                                             మరో రూపం లో అస్తిత్వం తప్పదు 
                                                    విశ్వం లో ఉనికి తప్పదు!
                                                          సృష్టి లో మనం కూడా 
                                                              అంతు లేని అనంత
                                                                  ప్రయాణం చేయాల్సిందే!
                                                                సృష్టి లా  సృష్టించిన 
                                                                   దేవుడి లా 
                                                                       మనకి కూడా 
                                                                       అంతం లేదు  అనంతం 
                                                                             తప్పదు.

Tuesday, February 15, 2011

FiZa

      ఫిజా..

                   మెరిసే రంగుల పూత లోంచి 
                        అస్పష్టం గా అతివల ఆకారాలు,
                          అవి మౌనం గా నే  నీ తో మాట్లాడుతూ 
                               నిన్ను శాశిస్తున్నట్లుంటాయి.
                                గీతల అల్లిక లో
                                   అద్భుతమైన ఇంద్రజాలం...
                                     అవి కదలక పోయినా ...
                                         కదుల్తున్నట్లు నిన్ను మోహిస్తాయి 
రంగుల్లో సింఫనీ లు, వాటి భాషల్లో కావ్యాలు...!
గీతలు రంగుల్లో కలసిపోయి  అద్భుత అను భూతి ని కలిగించే ఏం ఎఫ్  హుస్సేన్ హస్తజాలం ...
కేన్వాస్ లోంచి సముద్ర ఘోష...ప్రేయసి కళ్ళ లోంచి  
గుండె కి చేరే పాట...
ఆకృతులు, వర్ణాలు, రేఖలు,వృత్తాలు గీతలు, చతురస్రాలు,
నీలి అరుణం లోంచి గ్రే  కలసిన పసుపు ముద్దలు,
నలుపు తెలుపు ల మధ్య 
స్త్రీ ఆకృతీ  నుదురూ... ఆ మధ్య 
సూర్య బింబం లా యెర్రని చుక్క ,కనురెప్పల కాటుక 
సన్నాయి ముందు ఆడే గంగి రెద్దు గజ్జల చప్పుడు ...
నీ రంగుల సముద్రం లో ఇన్ని చలన చిత్రాలా?...




                         

My Blog Visitors