Pages

Saturday, August 29, 2015

మంగళ వారం మ్యాడ్ నెస్

మంగళ వారం మ్యాడ్ నెస్
"డబ్బు దేముందండీ" ,అంటుంటారు నోట్లు శ్రద్ధ గా లెక్క పెట్టుకుంటూ ..కానీ డబ్బు లోనే అంతా ఉంది .నువ్వు ఒక లుంగీ బనీను వేసుకుని ఫైవ్ స్టార్ హోటల్ లోకి నడుచుకుంటూ వెళ్ళు ,నిన్ను ఆపేసి గెంటెసె ప్రమాదం చాలా ఉంది.నీ దగ్గర డబ్బు ఉన్నా లేక పోయినా ఒక సూట్ లో మేర్సిడీస్ కారు లో పర్ఫూమ్ సువాసన ల తో దిగు ద్వారపాలకుల నుంచి క్షేత్ర పాలకుల దాకా అందరు హడావుడి గా లేచి నిల్చుని సెల్యూట్ కొడతారు.నువ్వో కథ రాయి మంచి సినిమాకి పనికొస్తుందని నీ ఆశ అయితే దాని మార్కెట్ విలువ ఏమీ లేదని చత్త బుట్ట లోకి విసురుతారు.అదే కథని సకల హంగుల తో స్క్రీన్ప్లే రాసి నువ్వో పేరుగడించిన కాదు డబ్బు రాబట్టగలిగిన రచయిత వయితే "ఈ సినిమా చేస్తున్నాం "అని కోట్లు గుమ్మరిస్తారు.నీ ఆలోచనలు కవిత్వాలు ఆవేశం తో రాసే విప్లవ కవితలు అన్ని వాటి మార్కెట్ విలువ ని గలిగి ఉంటాయి.అది సున్నా నుంచి కొన్ని కొట్లు కూడా కావచ్చు.ఇంకా అదనపు విలువ శ్రమా ఇంటలెక్చుఅల్ ప్రాపర్టీ అంటు అఘ్హొరించినా మార్కెట్ నిన్ను బుల్ డోజర్ లా నలిపి నడిచి వెళ్ళిపోతుంది.నేను గొప్ప కవినీ రచయితనీ నేను సయితం భువన భవనపు భావుటానీ అనుకుంటే లాభం లేదు. ..మార్కెట్ లో నీ విలువ ఎంత,నువ్వు సంపాదించే అదనపు విలువ ఎంత ?.అదనపు విల్వే దోపిడీ అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు .వడ్డీ రేటు లాభం నష్టం తెలిస్తేనే సఫలీక్రుతడవు అవుతావు లేకపోతే "నన్ను ఈ సమాజం అన్యాయం చేసింది" అని కవిత్వాలు రాసుకోవాల్సిందే.కావలిస్తే నీ కవిత ల పుస్తకం రాసి బొమ్మ వెయ్యమను పుస్తకం వెయ్యమను అమ్మిన డబ్బులు ఇయ్యమను ...విలువ రానిదే నీ ప్రియ మిత్రుడు కూడా దాని ముఖం చూడడు ! డబ్బు ఇయ్యన్దె బొమ్మ కూడా రాదు .
నీ డబ్బు తో దాన్ని వానిటీ పబ్లిషింగ్ చేసుకుని నష్టాన్ని చిరునవ్వు తో భరించి పుస్తకాలని అందరికి పంచాల్సిందే.
ఒక వెళ నీకేదో ప్రైజ్ వచ్చినా అది ఇంకెవరో వారి వానిటీ కోసమో స్వలాభం కోసమో వ్యాపారం కోసం చేసే సత్కారమే.చచ్చి ఎక్కడున్నాడో సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషికి సెక్సు ఆకలీ బేసిక్ ఇన్స్టింక్ట్స్ అన్నాడు .మూడోది తనే అధికుడనన్న భావం సుపీరియారిటీ ...ఇది మనిషిని చాలా మంచివీ ఘోరం అయనవీ కూడా అయిన పనులు చేయిస్తుంది. ,,,నేను డబ్బు నాలుగో ఇన్స్టింక్ట్ అంటాను.వేట కోసం అడవి లోకి రోజు వెళ్ళె పులి లా మనం ఈ సమాజపు క్రూర మృగాల అడవి లో డబ్బు కోసం రక్త దాహం తో వేటాడాలి. డబ్బు ను డబ్బు తో జయించి వాడి ముఖాన్నే కొట్టాలి.ఖర్చు పెట్టేటప్పుడు కన్నీళ్ళు రానంత డబ్బు సంపాదించాలి. ప్రేమని గుండెల్లోనే దాచుకోవాలి. అవసరం లేనిదే ఒక్క పయిసా కూడా ఇవ్వని ఈ ప్రపంచాని కి అవసరం లేనిదే ఒక్క చిరునవ్వు కూడా ఇవ్వద్దు. ఎందుకంటె ఉచిత భోజనాలు లేవు .అన్నీ ఆర్ధిక సంబంధాలే! కానీ డబ్బు దేముందండీ ఇవాళ పోతుంది రేపు వస్తుంది అను .అయితే డబ్బు లోనే అంతా ఉంది అని గ్రహించు
Like   Comment   

Monday, April 27, 2015

భూకంప వైరాగ్యం

భూకంప వైరాగ్యం

     కాష్ట మండపము ...అంటె ఖాట్మండూ అసలైన పేరు అట ..నిజం  గానే ఇప్పుడు 24 గంటలు శవ  దహనాలు జరుగుతున్నాయి.ఆ పశుపతి నాధుని గుడి మిగిలే ఉంది! ఆయనకీ లయం విలయం ఇష్టం అనే చెబుతారు.వొందల ఏళ్ళ నుంచీ మనకి శివుడు లయకారకుడు అని హిమాలయాల్లో ఉంటాడని ఆయనకీ ఎప్పుడు శవాల పొగ తగులుతూ ఉండాలనీ హిందూ పురాణాల్లొ చెబుతూ ఉండేవారు .ఇప్పుడు జరిగిన భూ కంప విలయం చూస్తె అదే గుర్తుకు వస్తోంది.కాళ్ళ కింది నెల కదిలిపోయి నెత్తి మీది కప్పు మీద పడి నడిచే రొడ్డు నిలువు గా చీలిపోయి యెక్క  దలిచిన మంచుపర్వతం విరిగి మీద పడితే ఎక్కడికి పరుగెత్తాలి?బల్ల మీద ప్లేట్ వణికి పోతుంటే అది భూకంపం అని గ్రహించి బయటికి పరిగెత్తాలి కాని హిమాలయ ప్లేట్ ఇండియా ప్లేట్ భూమి అడుగున కదిలాయా కొట్టుకున్నాయా ఎవడికి కావాలి? కల లు కనే     జీవితం ముగిసిపోయిందని విచారిస్తూ భయం తో పరుగెత్తాలో లేక ముక్తి మోక్షం వచ్చాయని శిధిలాల కింద నలిగి పోవాలో ఏ  వేదాంతం చెబుతుంది?హిమాలయాల్లో భూకంపం వస్తుందన్నా వినక రాచరికం దేశాన్ని అభివృద్ది చేయకుండా విలాసాల్లో మునిగి చివరకి మావో ఇజం గెలిచినా ఇంకా బీదప్రజలు బలహీనమైన కట్టడాల్లో భూకంపం ధాటికి ప్రాణాలు క్షణాల్లో పోగోట్టుకోక తప్పలేదు ...నేపాల్ ని  సైన్స్ కాని మతం కాని విజ్ఞత కాని రాజకీయం గాని ఏదీ కాపాడలేక పోయింది,  నేపాల్ ఏమిటి మనం అందరం ఏరోజు కారోజు బతికి ఉన్నందుకు ఆ అర్ధం కాని దివ్య శక్తికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే! అన్నీ తెలిసీ నాలుగు క్షణాల   మూన్నాళ్ళ ముచ్చట జీవితం కోసం డబ్బు కోసం ఉద్యోగం కోసం ఒక గజం స్థలం కోసం కుర్చీ కోసం పరుగులు పెడుతూనే  ఉంటాం.   సుడిగాలి లో కొవ్వొత్తులు లాగానే నిజం గా...!

Friday, April 17, 2015

Kujudi kosam

Special discount on my book KujuDi kosam which is a prequel to Neeli Aakupatcha   follow the link to kinige.com

Kujudi Kosam By Chittarvu Madhuనాలుగో సహస్రాబ్ది 3260. అణుయుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమి ఎక్కువ మేర నశించిపోయి మానవులు చాలావరకు ఇతర గ్రహాలకి వలస పోయి అంతర్‌గ్రహ నాగరకత విలసిల్లుతున్న కాలం. అంతర్‌గ్రహ యానాలు, సమాచార వ్యవస్థా, వైద్య రంగాల్లో మానవులు ఎంతో ప్రగతిని సాధించారు. ఇప్పటి సెల్ ఫోన్స్‌…             

   This book available at a discount on kinige.com click on the link
KINIGE.COM

Thursday, March 5, 2015

India"s Daughter

 లో నే వుంది ఈ సమస్య అంతా.అయితే ఈ ఇంటర్వ్యూ ని ఎందుకు ప్రసారం చేయకూడదు అది ప్రసార మాధ్యమాల స్వతంత్ర ప్రతిపత్తి కి విరుద్ధం కదా అని కూడా అనిపిస్తుంది.రెండు సంవత్సరాల తర్వాత ఎవరో విదేశీ జర్నలిస్టు మళ్ళీ ఈ విషయం బయటకి తీయడం మానిన గాయాలని కెలికి నట్లు దేశాన్నంతటి నీ బాధ పెట్టింది. నేను ఢిల్లీ ఒక వారం క్రితం వెళ్ళినప్పుడు కార్ డ్రైవర్ గా వచ్చిన సర్దార్ జి ని అడిగాను.అర్దరాత్రి పార్టీ నుంచి తరిగి హోటల్ కి వస్తు ఎయిర్పోర్ట్ హైవే మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపొయినప్పుడు ...చుట్టు కార్లు అందరు వారి వారి కార్ల లో అద్దాల్లో కనిపిస్తున్నారు కాని నిజం గా మూసేసిన అద్దాలు ఉంటె ఎంత భయం .ఇంత ట్రాఫిక్లో చుట్టు కార్లు పోతుంటే రేప్స్ ఎలా జరుగుతున్నాయి ఢిల్లీ లో? అని.50 ఏళ్ళ పై బడిన సర్దార్జీ ఫాదర్ ఫిగర్ లానే ఉన్నాడు ,అయినా "ఆడపిల్లలు తాగేసి న పరిస్థితి లో అర్దరాత్రి కార్లు ఎక్కుతూ ఉంటారు కొంత మంది లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటారు .కన్సేంట్ ఇచ్చి కూడా మళ్ళీ రేప్ అయిందని కంప్లైంట్ చేస్తారు సర్ .ఇదంతా మామూలే!" ఇలా ఇంగ్లీష్ లోనే అభిప్రాయం వెలిబుచ్చాడు. ఈనాటికి చాలా మంది మగవాళ్ళ మైండ్సెట్ ఇలాగే వుంది.అంటె డ్రైవర్ తన ధర్మం నిర్వర్తించి .ఆ అమ్మాయిని భద్రం గా ఇంట్లొ దింపాలి గాని అత్యాచారం చేయాలా? ఈ మైండ్ సెట్ మారాలంటే ఇలాం టి ఇంటర్వ్యూ లు చర్చ లు షాక్ ట్రీట్మెంట్ లు జరగాల్సిందే!

Tuesday, February 24, 2015

వైరాగ్యం స్టేటస్


    ఒక్కొక్కప్పుడు జీవితం కదలకుండా ఆగిపోతూ   ఉంటుంది.ట్రాఫిక్ లో రెడ్ లైట్ దగ్గర పడిగాపులు కాచినట్లు ముందుకు వెళ్ళలేం,     వెనక్కు వెళ్ళ లేం. కొందరు ముందుకు  వెళ్ళిపోతూ ఉంటారు కొందరు ఆగిపోవడం కూడా ఎంజాయ్ చేయగలరు.పాటలు వింటూ అటు ఇటు చూస్తూ ..ఆలోచనలలో తేలిపోతూ .అయినా కాలం గడిచిపోతు ఉంటుంది .కొందరు ముందు కొందరు వెనకా... అందరూ గమనం సాగించవలసిందే.ఏదో క్షణం లో ముందో వెనకో జీవితం కార్ ఆపి పార్క్ చేయక తప్పదు .నేను ఎంజాయ్ చేసానని ఒకడు నేను జీవితం లో ఏది సాధించలేదని మరొకడు నాకు అంత్లేని సంపదలని సంపాదించానని  మరొకడు, చూడవలసిన్దేమి లేదు అని మరొకడు, మళ్ళీ జన్మ కోసం మరొకడు, జన్మరాహిత్యం కోసం మరొకడు ఇలా ఆశ పడుతూనే అనుక్షణం గడిచిపోతుంది.నాకైతే, దేనికి అర్ధం లేదనే అనిపిస్తుంది .నేనొక చీమ   లాగా బాక్టీరియా లాగా బుధ్భ్హుథ ప్రాయమైన జీవితం చాలించేసి అణువుల్లో కలిసిపోయిన తరవాత ఏమి ఉంటుంది , ఏమి లేదు అంతా శూన్యం .కొన్నాళ్ళు నా పాటలు వింటారని కొన్నాళ్ళు నా కవిత్వం చదువుతారని కొన్నాళ్ళు నా కధలు వింటారని కొన్నాళ్ళు నేను తీసిన సినిమాలు మిగులుతాయని నేను శాశ్వతత్వం సాధిస్తానని అనుకోవడం ఒక భ్రమ !.సోక్రటీస్ నుంచి ,వేదాల నుంచి భగవద్గీత నుంచి ఈమధ్యనున్న సార్త్రే దాకా ఏ సిద్ధాంత మైనా జీరో నుంచి 2 శతాబ్దాల దాక జీవిస్తుందేమో .అన్నిటికి మరుపు తప్పదు .అలాంటిది నా భావాలకి ఒక క్షణం జీవిత కాలం ఒక నీటి బుడగ లాంటి అక్షర రూపం మిగిలిపోతాయేమో ...ఎందుకీ తపన ?అనిపించినా, ఆ బుడగ మీద ఓ క్షణం మెరిసే పంచ రంగులు ఊహల మేజిక్ ఎవరైనా చూసి ఓహో అంటే     చాలు.. !         

Friday, January 30, 2015

వెలుగులు

 ఆకర్ష, ఆకాంక్ష ఇద్దరు కవల పిల్లలు నా మనమరాళ్ళు .వాళ్ళ చిరునవ్వులు బుడి బుడి నడకలు ఆటలు అవే ఇప్పుడు మా ఇంటికి  లో మెరుపులు ! 

Saturday, January 17, 2015

చలి చలి గా

    చలి చలి గా రాత్రులు, మంచు కురిసే ఉదయాలు,  నులివెచ్చని లేత యెండ తో  నిండిన మధ్యాహ్నాలు  ఈ కొత్త సంవత్సరం లో చలి కాలం హైదరాబాద్ లో చాలా రొమాంటిక్ గా ఆహ్లాదం గా వుంది. కలత పెట్టె వార్తలు, టీవీ లో అరుపులు, ధ్వని కాలుష్యం చేస్తూ వాహనాలు, జోకులు వేస్తే కోపం వొచ్చి చంపేసే కోపిష్టి పిచ్చివాళ్ళు, ఇవన్ని మామూలే .ఇవన్ని మరిచి హేమంతం సొగసులో ఊహల రగ్గులు కప్పుకుని కరిగిపోయిన కలలో మరిచిపోయిన కవిత్వమో కొత్త గా విరిసిన మంచు ముత్యాలు జల్లిన యెర్ర   గులాబీ ల నో  చూసి  మురిసిపోతూ కొన్నిక్షణాలు అయినా గడపగలిగే మంచి వాతావరణం ఇప్పుడు! ఇక్కడ  .బెస్ట్ సీజన్ ఆఫ్ ది ఇయర్ !

My Blog Visitors