భూకంప వైరాగ్యం
కాష్ట మండపము ...అంటె ఖాట్మండూ అసలైన పేరు అట ..నిజం గానే ఇప్పుడు 24 గంటలు శవ దహనాలు జరుగుతున్నాయి.ఆ పశుపతి నాధుని గుడి మిగిలే ఉంది! ఆయనకీ లయం విలయం ఇష్టం అనే చెబుతారు.వొందల ఏళ్ళ నుంచీ మనకి శివుడు లయకారకుడు అని హిమాలయాల్లో ఉంటాడని ఆయనకీ ఎప్పుడు శవాల పొగ తగులుతూ ఉండాలనీ హిందూ పురాణాల్లొ చెబుతూ ఉండేవారు .ఇప్పుడు జరిగిన భూ కంప విలయం చూస్తె అదే గుర్తుకు వస్తోంది.కాళ్ళ కింది నెల కదిలిపోయి నెత్తి మీది కప్పు మీద పడి నడిచే రొడ్డు నిలువు గా చీలిపోయి యెక్క దలిచిన మంచుపర్వతం విరిగి మీద పడితే ఎక్కడికి పరుగెత్తాలి?బల్ల మీద ప్లేట్ వణికి పోతుంటే అది భూకంపం అని గ్రహించి బయటికి పరిగెత్తాలి కాని హిమాలయ ప్లేట్ ఇండియా ప్లేట్ భూమి అడుగున కదిలాయా కొట్టుకున్నాయా ఎవడికి కావాలి? కల లు కనే జీవితం ముగిసిపోయిందని విచారిస్తూ భయం తో పరుగెత్తాలో లేక ముక్తి మోక్షం వచ్చాయని శిధిలాల కింద నలిగి పోవాలో ఏ వేదాంతం చెబుతుంది?హిమాలయాల్లో భూకంపం వస్తుందన్నా వినక రాచరికం దేశాన్ని అభివృద్ది చేయకుండా విలాసాల్లో మునిగి చివరకి మావో ఇజం గెలిచినా ఇంకా బీదప్రజలు బలహీనమైన కట్టడాల్లో భూకంపం ధాటికి ప్రాణాలు క్షణాల్లో పోగోట్టుకోక తప్పలేదు ...నేపాల్ ని సైన్స్ కాని మతం కాని విజ్ఞత కాని రాజకీయం గాని ఏదీ కాపాడలేక పోయింది, నేపాల్ ఏమిటి మనం అందరం ఏరోజు కారోజు బతికి ఉన్నందుకు ఆ అర్ధం కాని దివ్య శక్తికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే! అన్నీ తెలిసీ నాలుగు క్షణాల మూన్నాళ్ళ ముచ్చట జీవితం కోసం డబ్బు కోసం ఉద్యోగం కోసం ఒక గజం స్థలం కోసం కుర్చీ కోసం పరుగులు పెడుతూనే ఉంటాం. సుడిగాలి లో కొవ్వొత్తులు లాగానే నిజం గా...!

No comments:
Post a Comment