Pages

Sunday, January 24, 2010

నానవలలు (సాలెగూడు)


సాలెగూడు అంటే వరల్డ్ వాయిడ్ వెబ్. ఇంటర్ నెట్ అన్న మాట..ఈ టైటిల్ నేను పెట్టింది కాదు. ఆంద్ర ప్రభ ఎడిటర్ రాఘవ రావు గారు చెప్పినట్లు అలాగే మార్చేసాను.అసలు నేను పెట్టిన పేరు "ప్రామిస్ యు లవ్ మీ " రొమాంటిక్ గా వుండాలని కాబోలు అప్పట్లో అలా పెట్టాను.ఈ నవల లో వర్ణించిన ఆశ్రమం యుటోపియ అందరినీ పరలోకం తీసుకుపోవటానికి ప్రేరేపించే స్వామీ జీ అన్నీ మన పాట్హకులకి అంత గా పట్టినట్లు లేదు కాని నా కయితే ఒక కొత్త సబ్జెక్ట్ రాసానని అది కూడా సైన్సు నేపధ్యం లో ననీ ఒక తృప్తి .

Saturday, January 23, 2010

చలి

ఈ  చలి కాలం ఉదయం ఏమని రాయను.మనసంతా ఖాళీ అయిపొయింది. ఈ నగరం ఒకప్పుడు జీవితం నిండి ఉప్పొంగుతూ ఉండేది.ఎప్పుడూ ఏదో సంతోషం ఏదో హడావుడి ఏదో ఉత్సాహం నిండి ఇది ఆశావాదానికి ప్రతీకగా ఉండేది.ఇప్పుడు అసహనానికి అసూయకి నెలవు గా మారింది.ఏదో నిరుత్సాహం ఏదో అనుమానం ఏదో అనిశ్చిత పరిస్థితి . ఏది కాదు .ఏది గడవదు.ఇది ఒక మార్పా?లేక ఒక తిరోగాతా? ఏదో టయిం
మెషీన్ లో ప్రయాణం చేసి శిధిలం ఆయన నగరం మనుషుల మధ్య ప్రవేసిన్చినట్లుంది .ఇది ఒక చలికాలం. ఆశలు ఘనీభవించిన కాలం.

Friday, January 22, 2010

నా నవలలు (మధుమేహం...)


నేను రాసిన డయాబిటిస్ హెల్త్ ఎడుకేషన్ పుస్తకము చాలా పాపులర్ అయింది.

నా నవలలు (ఐ సీసీ యు)

( చాలా మంచి సంపాదకులు సహృదయులు వాకాటి పాండురంగారావు గారి ని స్మరించుకుంటూ...) ఆంద్ర ప్రభ లో ఈ నవల 1990 లో ప్రచురించ బడింది..తెలుగు లో సైంటిఫిక్ నవలలలో పేరు తెచ్చుకుంది .

Saturday, October 10, 2009

హైడ్ virus

నా నవల హైడ్ వైరస్ నవ్య వార పత్రిక లో సీరియల్ గా ప్రచురింప బడి క్రిందటి వారం తో ముగిసింది.ఈ నవల అయ్పోయిన తరవాత నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి .నవల చాలా బాగుందనీ ఇంకా సైన్సు ఫిక్షన్ రాయమనీ..పాఠకుల నుంచి వుత్తరాలు రాలేదని బాధ పడిన నాకు ఈ ఫోనులు ఎంతో సంతోషం కలిగించాయి.ఇది వరకు రాసిన బై బై పొలోనియా ఐ సి సి యు నవల ల గురించి కూడా ఛాలా మంది అడిగారు.ఈ నవలలు చదివితే హైడ్ వైరస్ నవల ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఇవి వాహినీ పబ్లిషర్స్ విద్యా నగర్ హైదరాబాద్ విశాలాంధ్ర పబ్లిషర్స్ నవోదయ పబ్లిషర్స్ వద్దా లభిస్తాయి .కొన్ని ప్రతులు నా దగ్గర వున్నాయి .నాకు ౩౦౦ రుపీస్ చెక్ గానీ ఎం ఓ గానీ పంపితే నేను పంపగలను. త్వరలో హైడ్ వైరస్ కూడా నవల గా వస్తుంది. ధన్యవాదాల తో మధు

Tuesday, July 28, 2009

prema


ప్రేమ
ప్రేమంటే
నీ కోసం కన్నీరు కార్చడమేనా?
నీ బాధని పంచుకోడమేనా?
నిన్ను బాధ పెట్టకుండా వుండటమేనా? నీ తో కలసి నవ్వడమేనా?
నీ తో కలసి నడవడమేనా?
వ్యక్తిత్వం లేనిదా ప్రేమ?
నీ కోసం తనని మరచి పోయేదా ప్రేమ ?
నిన్ను గుడ్డి గా ఆరాధించెదా ప్రేమ?
నీ లో తప్పుల్ని చెప్పనిదా ప్రేమ?
నిన్ను ఎలాగైనా సమర్ధించేడా ప్రేమ?
అలా వుంటే బాగుంటుంది,
కాని అది కాదు ప్రేమ
నిన్ను ఉత్తేజ పరిచేది ప్రేమ
నిన్ను బాధించకుండా నీ తప్పుల్ని చెప్పేది ప్రేమ...
తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నే నిన్ను
తన్మయుడిని చేసేది ప్రేమ...తన మీద ఆధారపడకుండా చేసే
కానితన కోసం ఆరాటపదేలా చేసేదే నిజమైన ప్రేమ...

Friday, July 24, 2009

HYD Virus

నా నవల " HYD్ వైరస్" నవ్య వార పత్రిక లో సీరియల్ గా ప్రచురించ బడుతోంది. ఇప్పటి కి పది వారాలు ముగిసినాయి. మీరు తప్పకుండా చదివి మీ అభిప్రాయాలు తెలియజేయ వలసింది గా కోరుతున్నాను. ఈ నవల నేను లోగడ రాసిన బై బై పోలోనియా నవల కు తరవాతి భాగము. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ నవల .దయ చేసి తప్పకుండా చదవండి madhu

My Blog Visitors