Thursday, August 19, 2010
manchi maata
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకు మా!
అవును నీ భవిష్యత్తు నీ చేతి లో నే వుంది..నడిచేది నువ్వే! నడిపించేందుకు ఎవరు రారు...!
Wednesday, August 18, 2010
manchi maaTa
చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూచునే కంటే ఒక్క చిరు దివ్వె ని వెలిగించి కన్నీళ్లు కార్చే మనసులలో వెలుగు నింపు!
Tuesday, August 17, 2010
Kujuni Kosam
కుజుని కోసం....నాలుగో సహస్రాబ్ది కథ... 1 ఒక జీవిత కాలపు స్వప్నం...
అరుణ గ్రహం....అర్దరాత్రి ఆకాశం లో రుధిర కాంతుల తో ధగ దగా మెరిసిపోయే అంగారక గ్రహం...భూమి ,కి
మూడు కోట్ల మైళ్ళ దూరం లో వుంది.సూర్యుడికి పన్నెండు కోట్ల మైళ్ళ దూరం లో దాని చుట్టూ తిరుగుతూ వుంటుంది.
నాకు ఆ గ్రహం అంటే ఇష్టం! ఆరాధన! ఆకర్షణ! మా యునివర్సిటి
పరిశోధన శాలలో వున్నా టెలిస్కోపు ల లో నుంచి
ఎక్కువ గా కుజుడి కోసమే వెదికే వాడిని.అది ఏదో వర్ణించలేని ఆకర్షణ!నా చిన్న తనం నుంచీ,విద్యార్ధి దశ నుంచీ,చివరికి మధ్య ఆసియా
లోని ఈ ఇండికా సెంట్రల్ విశ్వవిద్యాలయం లో బయో మెడికల్ ఇంజనీర్ గా బోధనా పరిశోధనలలో వుద్యోగం చేస్తున్నప్పడివరకూ అన్గారకుడంటే
అరుణ అదే ఆకర్షణ! ఏదో తెలియని శక్తి ఆ కిరణాల తో నన్ను పిలుస్తున్నట్లు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు, బలమైన అయస్కాంత శక్తి మెదడు మీద పని చేసి నన్ను రమ్మని బలవంతపెట్టుతున్నట్లు అనిపించేది.
ఎప్పుడు కుజుని లోని పెద్ద పేద యెర్రని craters ni పర్వతాల్ని
చూసినా,నాకు మళ్ళీ మళ్ళీ కలలు వచ్చేవి....
.ఏదో ఒక రోజు కుజుని నుంచి నా కోసం ఎవరో వస్తారు.లేదా నేనే అక్కడికి వెళ్తాను.ఇది నా అంతరాత్మ లోని బలమైన నమ్మకం గా ఏర్పడి పోయింది.
ఇంకా వుంది....
Friday, August 13, 2010
kujuni kosam
ప్రియమైన మిత్రులకు ,నా నవల " కుజుని కోసం" తెలుగు లో అనువదించాను.దీనిని ధారావాహిక గా rachana maasa patrika lo prachrincha bothunnaru... చదవండి
. ఇదీ ఇంగ్లీషు
లో నేను రాసిన "వార్ ఫర్ మార్స్" కు అనువాదం
.ఇది ఒక సైన్సు ఫిక్షన్ కధ...!
Sunday, August 1, 2010
EnnaLLU
నిన్న ఒక అమాయిక విద్యార్ధి ఆత్మత్యాగం చేసుకుని వెళ్ళిపోయాడు.తెలంగాణా కోసం ఇంకా ఎంత మంది అసువులు బయాలి?ఈ రాష్ట్రం భవిష్యతు ఏమవుతుంది? ఈ ఒక్క పది నెలలలో ఎంత వెనక బడి పోయాము.ఒకే భాష మాట్లాడే వాళ్ళ లో ఎన్ని ద్వేషాలు ఎన్ని అపోహలు ఎన్ని తిట్లు?ఈ రాష్ట్రం త్వరగా విడి పోవాలనే నాకు అనిపిస్తోంది.ఎందుకంటె అపార్ధాలు ఎక్కువ గా అయి పోయాయి.ప్రతి విషయాని ఆంధ్రులు తో కలసి వుండటం కారణం గా naShTam jaruGuthondani ఒక అబిప్రాయం గాదం గా నాటుకు పోయింది.ఈ ఉద్యమం ఇక ఆగాడు.మరి విడి పోతే ఎన్ని AanDhra pradesh ముక్కలయ్ pothundi?తెలుగు భాష సంస్కృతి ఏమవుతాయి?bahuSaa కొన్ని దశాబ్దాలకి తెలుగు సంస్కృతి అంతరించిపోతుంది ఏమో.