Pages

Wednesday, February 24, 2010

లీడర్



లీడర్ చిత్రం చూడటం ఒక గొప్ప అనుభవం. రాజకీయాల మీద తీసిన సినిమాలు ఇదివరకు చాలానే వచ్చ్చాయి కాని ఇది మరొక దృక్పధం .కొంచెం నాటకీయం గా వున్నా ఇది యువత కి కొత్త స్ఫూర్తి ని ఇస్తుంది.
రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంత వుందో మనకందరికీ తెలుసు.ఈ సినిమా లో అర్జున్ తన తండ్రి కోరిక మేరకు ముఖ్యమంత్రి అవడానికి చాకచక్యం గా డబ్బుని విచ్చలవిడి గా వాడతాడు .ముఖ్యమంత్రి గా అవుతాడు కూడా .తండ్రి సంపాదిచిన బ్లాకు మని ని ప్రజాధనం గా ఇస్తాడు .అయినా అతని కి ముఖ్యమంత్రి గా కొనసాగడం కష్టం అవుతుంది.
ఈ సినిమా లో తెలుసుకునేది అదే. ఆ తరువాత అర్జున్ రాష్ట్రం అంతా కాలినడక న తిరిగి ప్రజల తో మమేకం అయి వారి సమస్యలని తెలుసుకుని మళ్ళా విజయం సాధిస్తాడు .ఇదంతా శేఖర్ కమ్ముల హృదయంగమం గా చిత్రించాడు .దీనికి తోడు మిక్కి మేయర్ సంగీతం కొత్త ధ్వని గుండెని తడిమే ధ్వనిని వినిపించింది.
"మా తెలుగు తల్లికీ మల్లెపూదండా" అంటూ టంగుటూరి కృష్ణకుమారి కంచు కంఠం మనసును పునీతం చేసింది. మనకు కావలసింది ప్రజల గుండెలలో చొచ్చుకుపోయి నిలిచేపోయే లీడర్లు.నల్ల డబ్బు బీరువాల నిండా దాచినా కూడా ప్రజల కి కొంచెం సేవ చేసినా వారు క్షమించి గుండెలలో దాచుకుంటారు.

Saturday, February 13, 2010

కుజుని కోసం నవల

కుజుని కోసం... నాలుగో సహస్రాబ్ది కథ...( నేను రాసిన వార్ ఫర్ మార్స్ ఇంగ్లీషు నవల కుఅనువాదం లోని మొదటి వాక్యాలు...) ఒక జీవిత కాలపు స్వప్నం .





అరుణ గ్రహం...అర్దరాత్రి ఆకాశం లో రుధిర కాంతుల తో ధగ దగా మెరిసిపోయే అంగారక గ్రహం.భూమి కి సుమారు మూడు కోట్ల మైళ్ళ దూరం లో ఉండి సూర్యుడి కి పన్నెండు కోట్ల మైళ్ళ దూరం లో పరిభ్రమిస్తూ ఉంటుంది .


నాకు ఆ గ్రహం అంటే ఇష్టం.మా యునివర్సిటి పరిశోధన శాల లో ఉన్న టెలిస్కోప్ లలో నుంచి ఎక్కువ గా కుజుడి కోసమే వెదికే వాడిని.అది ఏదో వర్ణించలేని ఆకర్షణ.

Wednesday, February 10, 2010

కన్యాకుమారి


కన్యాకుమారి వెళ్లి అప్పుడే రెండు సంవత్సరాలుఅయిపోయింది.అక్కడ నాకు నచ్చినది నిరంతరం హోరెత్తే సముద్రం ...మూడు దిక్కులా అదే.... ఉదయమే లేచి సూర్యోదయం కోసం ఎదురు చూసే టూరిస్టులు ...అన్నిటి కంటే మించి అక్కడ ఉన్న పురాతన కన్యాకుమారాలయం...దానిలో అందమైన కన్యాకుమారి విగ్రహం ఆవిడ ముక్కున మిరుమిట్లు కొడుతూ మెరిసే వజ్రం లాటి ముక్కుపుడక.... అక్కడ గుడి లో ఒక ముసలాయన తమిళం లో పాడిన పాట.మరపురాని జ్ఞాపకాలు.

My Blog Visitors