Pages

Wednesday, January 27, 2010

నానవలలు( బై బై పొలోనియా )

నేను రాసిన నవలలలో అన్నిటి కంటే నాకు బై బై పొలోనియా చాలా ఇష్టం.తెలుగు లో ఇంతవరకూ ఎవరూ రాయనట్లు గా సైన్సు ఫిక్షన్ స్పేసు ఫిక్షన్ రాయాలని రాసినది.సీక్వెల్ కంసేప్ట్ తెలుగులో లేదు అలా రాయాలని రాసినది.ఇది ఐ సి సి యు కి సేక్వేల్ గా రాసాను. దీనికి హిందూ పత్రిక లో మంచి రివ్యు రావడం నా అదృష్టం .నన్నెంతో ప్రోత్సహించిన విషయం.దాంతో దానికి మరో స్వేక్వేల్ హైడ్ వైరస్ రాసాను .
ఐ సి సి యు .బై బై పొలోనియా హైడ్ వైరస్ తెలుగులో సైన్సు ఫిక్షన్ నవలలు ఒక త్రయాలజీగా నిలిచి పోవాలని నా కోరిక.
ఈ నవలలలో కామన్ విలన్ డాక్టర్ రావు .కామన్ హీరో రవీ అభిజీత్ శిల్పా .కామన్ నేపధ్యం వైద్య విజ్ఞానం స్పేసు సాహిత్యం .కార్డియాలజీ నించి రోబత్స్ దాకా మందుల నించి కాల ప్రయాణం చేసే గ్రహాన్తరవాసులూ కాల వేగం తో ప్రయాణించే అంతరిక్ష నౌక లూ ఇవన్నీ రాసాను కాలప్రయానికుడు హోరా గ్రహాంతర సుందరి పొలోనియా సహారా ఎడారి లోని కథా నేపధ్యం ఇవన్ని తెలుగులో ఎవరు రాయలేదని చెప్పగలను. మూడు నవలలు చదవాలి.లార్డ్ ఆఫ్ డి రింగ్స్ లాగా అందరూ మెత్చుకోవాలి అదే నా ఆశ ...

Monday, January 25, 2010

నానవలలు (ఔనా)


.ఔనా నవల నేను రాసిన నవలల లో రొమాంటిక్ గా రాయడానికి ప్రయత్నించినది. అయినా నవలలో చివరికి మళ్లీ మెడిసిన్ జబ్బులు అన్ని వచ్చేసాయి .

ఆతను ఒక భావుకుడు. పాత పాటలూ నాగేశ్వర రావు సినిమాలూ ఇష్టం. యెవరూ లేరు అతనికి.అరెంజేడ్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకుని ఆమెను హృదయపూర్వకం గా ఆరాధిస్తూ ఉంటాడు.అతను నిషాద్ .

ఆమె వినీల .ఆమె కి అతనంటే బోరు. ఆమె మంచి గాయని. తనకు గురువు గా సంగీతం

నేర్పించిన వ్యక్తి నీ పెళ్ళికి ముందు ప్రేమించింది.కళ్లు మూసుకుంటే అతనే గుర్తు వస్తాడు. అతను మళ్ళీ తన జీవితం లో కి వస్తాడని ఊహించలేదు.

ఇక మేఘన .డాక్టర్ .నిషాద్ ని ప్రేమించి విఫలం అయింది.అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది.అయితే అదే నిషాద్ భార్య కి వైద్యం చేయాల్సి వచ్చేస్సరికి ఒక పక్క స్త్రీ సహజమయిన అసూయ మరొక పక్క వృత్తి ధర్మం... సంఘర్షణ లో తప్పులు చేస్తుంది. నాకు మేఘన అంటే ఇష్టం...

ఈ కధలో విలన్ సంగీతం మాస్టర్ .రాగతరంగిణి లో అమ్మాయిలకు పాఠాలు చెప్పుతూ పర్వర్శన్స్ తో ప్రవర్తించే వ్యక్తి.వో వసంత భామినీ వినీల జీవితం లో మళ్ళీ ప్రవేశించిన మనిషి.విజయచంద్ర . ఇక పోతే.. యాదగిరి...వాయుర్ .వీడియో గ్రాఫర్ .అతనికి ఇతరుల జీవితాలను తన కెమెరా తో దొంగతనం గా చూడటం అలవాటు.

మంచి వాడా ? చెడ్డ వాడా? ప్రతి మంచి లో ఒక చెడ్డ...ప్రతి చెడ్డలో ఒక మంచి .వివీల వెనక నిషాద్.నిషాద్ వెనక మేఘన. విజయచంద్ర వెనక వినీల.వీరందరినీ రహస్యం గా చూస్తూ యాదగిరి..అందరూ వుండేది అపర్ణా కాంప్లెక్స్ ఫ్లాట్స్ లో..

ఇదే ఔనా నవల లోని వింత కథ . చిత్రీకరించడం లో ఎంతవరకు సఫలం అయ్యానో తెలియదు.... దొరికితే చదవండి !

Sunday, January 24, 2010

నానవలలు (సాలెగూడు)


సాలెగూడు అంటే వరల్డ్ వాయిడ్ వెబ్. ఇంటర్ నెట్ అన్న మాట..ఈ టైటిల్ నేను పెట్టింది కాదు. ఆంద్ర ప్రభ ఎడిటర్ రాఘవ రావు గారు చెప్పినట్లు అలాగే మార్చేసాను.అసలు నేను పెట్టిన పేరు "ప్రామిస్ యు లవ్ మీ " రొమాంటిక్ గా వుండాలని కాబోలు అప్పట్లో అలా పెట్టాను.ఈ నవల లో వర్ణించిన ఆశ్రమం యుటోపియ అందరినీ పరలోకం తీసుకుపోవటానికి ప్రేరేపించే స్వామీ జీ అన్నీ మన పాట్హకులకి అంత గా పట్టినట్లు లేదు కాని నా కయితే ఒక కొత్త సబ్జెక్ట్ రాసానని అది కూడా సైన్సు నేపధ్యం లో ననీ ఒక తృప్తి .

Saturday, January 23, 2010

చలి

ఈ  చలి కాలం ఉదయం ఏమని రాయను.మనసంతా ఖాళీ అయిపొయింది. ఈ నగరం ఒకప్పుడు జీవితం నిండి ఉప్పొంగుతూ ఉండేది.ఎప్పుడూ ఏదో సంతోషం ఏదో హడావుడి ఏదో ఉత్సాహం నిండి ఇది ఆశావాదానికి ప్రతీకగా ఉండేది.ఇప్పుడు అసహనానికి అసూయకి నెలవు గా మారింది.ఏదో నిరుత్సాహం ఏదో అనుమానం ఏదో అనిశ్చిత పరిస్థితి . ఏది కాదు .ఏది గడవదు.ఇది ఒక మార్పా?లేక ఒక తిరోగాతా? ఏదో టయిం
మెషీన్ లో ప్రయాణం చేసి శిధిలం ఆయన నగరం మనుషుల మధ్య ప్రవేసిన్చినట్లుంది .ఇది ఒక చలికాలం. ఆశలు ఘనీభవించిన కాలం.

Friday, January 22, 2010

నా నవలలు (మధుమేహం...)


నేను రాసిన డయాబిటిస్ హెల్త్ ఎడుకేషన్ పుస్తకము చాలా పాపులర్ అయింది.

నా నవలలు (ఐ సీసీ యు)

( చాలా మంచి సంపాదకులు సహృదయులు వాకాటి పాండురంగారావు గారి ని స్మరించుకుంటూ...) ఆంద్ర ప్రభ లో ఈ నవల 1990 లో ప్రచురించ బడింది..తెలుగు లో సైంటిఫిక్ నవలలలో పేరు తెచ్చుకుంది .

My Blog Visitors