కొండలే రగిలే వడ గాలీ , నీ సిగ లో పూవేలోయీ ! అన్నాడు సినీ కవి .పగలూ రేయీ ఒకటే వేడి ,ధూళీ దుమ్ము డీసెల్ పొగల కారు హారన్ల ధ్వని వాయు కాలుష్యం లో ఆకుపచ్చ దీపం కోసం ఆశగా ట్రాఫిక్ జంక్షన్ ల దగ్గర చిక్కుకుపోయి భానుడి ప్రతాపానికి ఓడిపోతున్న ఏసీ యంత్రాల చప్పుడులో తీరని తాపం లో సుదీర్ఘ గ్రీష్మం తో యుధం చేస్తున్న నగర జీవి ని. బుర్ర పెనం లో వేగిపోతున్న గారే లా ఉంటె కవిత్వం కథలు ఎలా పుట్టుకొస్తాయి.అయినా ముఖ పుస్తకం చూడకుండా ఉండలేని నాకు వంశీ మాగంటి గారు పెడుతున్న పాత తెలుగు ప్రకటనలు చూడటం అలవాటు గా మారి మొన్న హటాత్తుగా ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ఆర్ డీ ఎల్ నరసింహమూర్తి పోలి టెక్నిక్కాలేజీ ప్రకటనలు చూసి మళ్ళీ బందరు గుర్తొచ్చింది.ఇప్పటి మచ్లీపట్నం . ..అక్కడ చదివిన సంవత్సరాలు.ఎక్కడో రోమ్ లో వాటికన్ మ్యూజిఅమ్ 16 వ శతాబ్దపు మ్యాపులలో మసుల వొడ రేవు పేరుకనిపిస్తే ఆహా మన బందర్ కి యెంత చరిత్ర అనుకునే వాడిని.ఆ తుఫానులు ఉప్పెనలు లేక పోతే బందరు చెన్నై లాగా మహానగరం కాక పోయేదా? క్రిందటేడు పల్లెటూరు వెళ్ళినప్పుడు మా అమ్మాయి బందరు వెళ్ళాలి అని పట్టుబట్టింది.వడగాలి లో లో నే వెళ్ళాం కోనేరు సెంటర్ కి పట్టాభి మార్కెట్ కి గూగుల్ మ్యాప్ ఎందుకు.అక్కడ 23 లేక 24 నెంబర్ షాపేమో చల్లటి బాదం ఖీర్ ఇచ్చాడు .యెక్కడ చదివిందో దాని గురించి! నిజం గా నరకం (ఇంఫెర్నో) లో అమృతం తాగినట్లే ఉంది.ఈ యువ తరం లో ఇది ఫేమస్ కాబోలు.ఆ తరవాత మినర్వా సందు లో తాతా రావు షాపు లో బందరు లడ్డులు హల్వా జీడిపప్పు పాకం కొనుక్కుని దారిలో కలంకారి చొక్కాలు డ్రెస్ లు కొనుక్కుని పెడనలో లోపల గా ఉన్న దుకాణం వెదికిపట్టుకుని కొనుక్కున్నాం.ఈ బట్టలు వేసుకుంటే మరి వేరే ఎయిర్ కండిషన్ అక్కర్లేదు.ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడ స్థిరపడినా చిలకలపూడి పాండురంగడు నడుం మీద చేతులు పెట్టుకుని చూడటం ఆవరణలో మహావృక్షాలు దూరాన మొగలి పొదలు ఆ వెనక హోరేతే సముద్రం బందర్ అంటేనే వెల్లువలా వచ్చే జ్ఞాపకాలు ...యెక్కడ సలాం ఆలేకుం లు బోన్ జూర్ లు కొట్టినా వేషాలు వేసినా ప్రపంచం లో ఎక్కడికి పోయినా ..ఫిర్ భి దిల్ హై బందర్ కా !
Sunday, April 24, 2016
Saturday, April 2, 2016
అభిమాని పిలిచె
అభిమాని పిలిచె
అప్పుడప్పుడు అర్జున విషాద యోగం లాంటిది నన్ను ఆవహిస్తూ ఉంటుంది.ఎందుకు రాయడం పేరు రాదు డబ్బు రాదు. నువ్వు రాసినది యెవరూ చదవరు గుర్తింపు ఉండదు .సంకలనాల్లో నీ పేరు రాదు.నువ్వు రాసినది సైన్స్ ఫిక్షనే కాదు .అని విమర్శకులు ,,, కొంచెం మామూలు కధలు రాయండి అన్ని సున్నితంగా కొందరు ...ఇక రాయ కూడదు అనుకుంటాను.కాని సీక్వెల్స్ పూర్తి చేయాలి వాటికి ఒక లాజికల్ ముగింపు ఉండాలి.కదా..డార్క్ ఒఉట్పొస్ట్స్ అనే నవల ఇంగ్లీష్ లో ముగించాను.ఇది కుజుడి కోసం నీలి ఆకుపచ్చ తరువాత భాగం దీన్ని మళ్ళీ తెలుగులో రాయాలి.(ఎందుకు?ఎందుకు ....ఎందుకు..?}ఎవరో అరుస్తున్నారు..వేస్ట్ ...
మధ్యాన్నం 1 30 కి హాస్పిటల్ లో ఫోన్ .కొంచెం చదువు రాని అమాయకుడి గొంతులా..."సారూ మీ కుజుదికోసం నవల చదివిన సారూ ..నాకు నీలి ఆకుపచ్చ కావాలి.పైసలు నా దగ్గర లేవు సారూ పంపుతారా?"
కోపం సంతోషం రెండు.నేనెందుకు...పంపాలి..,"లైబ్రరీ లో తెచ్చుకున్నా సారూ ఎంతో ఇష్టం సారూ 8 సార్లు చదివినా.'
నీకేం కావాలి ?అన్నాను కోపం గా ."నీలి ఆకుపచ్చభూ మి కి తిరిగి... రాక" మాటలు పట్టి పట్టి అన్నాడు.
షాక్ అయ్యాను.ఇతను నిజం గా చదివాడు.కొత్త పుస్తకం లో భూమికి పునరాగమనం అని అనువాదం చేసాము.పాత పుస్తకం లో అలావుంది.
అయినా నా బుద్ది పోలేదు ఎందుకు పంపాలి? రోజు ఫోన్ వస్తూనె ఉంది .అతను బీద వాడు ఆర్ఫన్ అట ! కరీంనగర్ నుంచి. లైబ్రరీ లో పుస్తకాలు చదువుతాడు. "నాకు అలిఎన్స్, గ్రహాలూ, స్పేస్ ఇష్టం సార్ ఐ సి సి యు ది ఎపెడెమిక్ అంటూ నా పుస్తకాలు అన్ని పేర్లు చెప్ప్పుతున్నాడు ."165 పేజి లో డిమిట్రీ తండ్రి మీరోస్ అని రాసారు సార్ ఆమె తండ్రి పొసయిడన్ కదా?
అదిరిపోయాను .కరెక్టే .ఇతను క్షుణ్ణం గా చదివాడు.
నా పుస్తకం చేరవలసిన చోటకి చేరింది.ఒక సారి ప్రఖ్యాత రచయిత నాకు ఇష్టం అయిన నామిని గారు చెప్పారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఉన్నప్పుడు "నువ్వు రాసేది 10 వ తరగతి వాడికి కూడా అర్థం కావాల! "
ఎంతో మందికి ఉచితం గా ఇచ్చి రెస్పాన్స్ రాని ...అటక మీద నీలి ఆకుపచ్చ కాపీలు పరిహాసం గా నవ్వాయి .మూడు రోజుల క్రితమే అతనికి కొరియర్ చేసాను సంతోషం గా .
కదీర్ బాబు కొత్త పుస్తకం లో కథలు ఎలా రాయాలో మనసు కి హత్తుకునేట్లు రాసారు.ఒక అధ్యాయం ఉంది.ఎందుకు రాయాలి .విమర్శకులు తిట్టినా అన్యాయమైన విమర్శలు చేసినా బాధ పెట్టినా ....ఆయన కి ఒచ్చిన ఫోన్ కాల్ గురించి రాస్తారు. "ఎంత బాగా రాసావ్ బాబు పది కాలాలు బాటు చల్లగా ఉండు" ,
"అందుకు "..ఆ ఒక్క మాటకి కన్నీళ్ళు తిరిగి నాయి చాలాసేపే నిన్న...పదే పదే చదివాను...ఒక రచయిత కి జీవనాధారం పాఠకుడిప్రేమ.లేక పోతే నాపుస్తకం పదిసార్లు చదివి ఫోన్ చేయడం కలలో కూడా ఊహించనిది.!. అందుకే రాస్తూ ఉంటాను.ఉంటాము. కదీర్ రాసిన పుస్తకం అంతటి లో నన్ను కదిలించినది ఆ ఒక్క మాట
అందుకు .

Baji rao Mastani
బ్రాహ్మణిజం ని తిట్టి అదే బ్రాహ్మణులని ఒక కులం గా భావించి తిట్టి పిలక బ్రాహ్మలు వీళ్ళని తరిమేయాలి అని తిట్టిన వ్యాఖ్యలు చూసి చూసి విసుగు వచ్చింది..బ్రాహ్మణిజం అంటె ఒక కులం కాదు అది వర్ణాశ్రమ వ్యవస్గ్త దాంట్లో అగ్ర వర్ణాలు అన్నీ ఉంటాయి.అందరు యజ్ఞోపవీతం వేసుకున్న వారే .అందరు ఇతర వర్గాల వారిని హింసించిన వారే.అది గతించిన వ్యవస్థ.ఇప్పటికీ వేరే రూపాల్లో ఉంది.రాజకీయం గా బలం గా ఉంది..ఇది మారాలంటే దేశం ఆర్ధికం గా పురోగమించి ప్రపంచీకరణం అవడం ఒక్కటే మార్గం.అని నేను అనుకుంటాను...పూర్వంమనుస్మృతి ఎప్పుడో రాసిన ఒక ధర్మ గ్రంధం.అది ఇప్పుడు ఎవరు అనుసరిస్తున్నారు?ప్రతి మతానికి ఒక చాందసం అయిన కోణం ఒక ఉదాత్త మైన కోణం ఉంటున్నాయి.ఎప్పటికప్పుడు సంస్కరణలు చేసుకుంటూ ఆధునికం అవ్వడమేహిందూ మతానికి కావలసినది...కులాల పేరు తో తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరి మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటే నవీన భారత దేశం ఎలా ముందుకు పోతుంది.ఇస్లాం లో సూఫీ లు ఉదాత్తం అయిన భావనలు కలిగిన వారు..క్రైస్తవులలో మత మార్పిడి బలవంతం గా చేసేవారు కొందరు తప్ప, అన్నీ ప్రేమ భావాలే..ఎవరి మతం వారు అవలమ్బించుకొవచ్చు.సంస్కరిన్చుకోవచ్చు.ఇబ్బంది అల్లా పరమత దూషణ మరియు ,అసహనం తో నే.
ఇలాంటి పరిస్థితుల్లో పిలక ఉన్న బ్రాహ్మణ హీరో నటించిన "బాజీరావు మస్తాని" చూడటం తటస్థించింది.ముఖ్యం గా సంగీతం కోసం. కాని.జంధ్యం వేసుకుని గుండు మీద, సిక్స్ ప్యాక్ కండరాల తో బలిష్టం గా ఉన్న బాజీరావు పీష్వా తల స్నానం చేయడం ...ఆయన కి అంతపురం లో బంగారు బొమ్మ లాంటి హిందూ భార్యా..మళ్ళీ బుందేల్ఖండ్ రాజు గారి కి ముస్లిం భార్య తో పుట్టిన మస్తాని అనబడే దీపిక అతన్ని ప్రేమించడం ఆ దీపాలు అంతపురాలు ఏనుగులు గుర్రాలు యుద్ధాలు ...ఈ చిత్రం ఒక దృశ్య కావ్యం. కల్పన అయినా. చరిత్ర అయినా కాదో తెలియదు.పిలక లో ఇంత అందం ఉంటుందా ...ఆ రోజులు ఇంత సుందరం గా ఉన్నాయా...అనిపించింది,ఎవరైనా మన తెలుగులో కూడా ఇంత కళాత్మకం గా చరిత్ర తీస్తే బావుంటుందేమో. . .ఈ సినిమా కి ఉత్తమ దర్శకుడు గా సంజయ్ లీల భన్సాలి గారికి జాతీయ బహుమతి అందుకే ఇచ్చి ఉంటారు.ఆ సౌందర్యానికి.

.
Monday, March 14, 2016
ఈ మధ్య నా తెలుగు ఫాంట్స్ తో సమస్య వచ్చి బ్లాగ్ లో రాయలేక పొయాను. అంతా మామూలె.! రోజులు గడిచిపోతున్నాయి.హాస్పటల్ టీవీ పుస్తకాలు ఆదివారం మెడికల్ మరియు సాహిత్య సమావేశాలు వాట్స్ అప్ లో సంగీతం వాయించడం .నా నీలి ఆకుపచ్చ నవల కి మంచి రివ్యూస్ వచాయి కాని సేల్స్? లేనే లెవు. నా బ్లూ అండ్ గ్రీన్ కి ఒక కంప్లైంట్ వస్తే దాన్ని మళ్ళీ సరిదిద్ది అప్లోడ్ చేసాను అమజాన్ లొ. డార్క్ అవుట్ పోస్ట్స్ అనే మూడో మరియు ఆఖరి సేక్వేల్ రాయడం అయిపోయింది వార్ ఫర్ మార్స్ కి. .దీన్ని ఇంగ్లీష్ లో టైపు చేయడం తెలుగు లో అనువదించడం మిగిలాయి.కాని ఎవరు చదవని సైన్స్ ఫిక్షన్ ఎందుకు రాయడం?ఇక నుంచి కథ లే రాద్దామనుకుంటున్నాను.
Thursday, December 10, 2015
న్యాయం
ఎవరూ తాగి నడపక పోతే, కారు పేవ్మెంట్ మీద నిద్ర పోతున్న అభాగ్యుడిని ఎలా చంపింది? ఆయన కారు కుడి వేపు నుంచి దిగాడా? లేక ఎడమ వేపు నుంచా? పోలీసులే క్రేన్ తో చంపి అలా అంటున్నారట.
నేనే కార్ నడిపింది అని ఒక డ్రైవర్ ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు.బార్ లో మినరల్ వాటర్ తాగారట .రసీదులు నిజం కావట.అసలు ఆయన తూలి రెండుసార్లు కింద పడి లేచి వెళ్ళాడని ఒక సాక్షి.కాదని మరొక సాక్షి.పాపం అమాయకుడిని ఇన్నిసంవత్సరాలు కోర్టులు పోలీసులు ప్రజలు ఏంటో బాధ పెట్టారు చివరికి నిర్దోషి ని విడిచిపెట్టారు.అసలు కారు నడిపిన మనిషి ఎవరూ అని తరవాత నిర్ణయం చేస్తారు కాబోలు.లేక రిమోట్ కంట్రొల్ ద్వారా ఎవరో నడిపారేమో అసలు పేవ్మెంట్ మీద పడుకున్న వాళ్ళ మీద జాలి ఏమిటండీ .కోట్లు మీద కోట్లు సంపాదించి ఎంతో కొంత దాన ధర్మాలు చేసి పరిహారం చేసుకునే నట శిఖామణిని చూసి జాలి పడాలి కాని ఒక్క పైసా విలువలేని సామాన్యుల కోసం ఆలోచన ఎందుకు?

Saturday, November 28, 2015
Thursday, November 26, 2015
Subscribe to:
Posts (Atom)