Pages

Thursday, December 10, 2015

న్యాయం

ఎవరూ తాగి నడపక పోతే, కారు పేవ్మెంట్ మీద నిద్ర పోతున్న అభాగ్యుడిని ఎలా చంపింది?  ఆయన కారు కుడి వేపు నుంచి దిగాడా? లేక ఎడమ వేపు నుంచా? పోలీసులే  క్రేన్  తో చంపి అలా అంటున్నారట.
  నేనే కార్ నడిపింది అని ఒక డ్రైవర్ ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు.బార్ లో మినరల్ వాటర్ తాగారట .రసీదులు నిజం కావట.అసలు ఆయన తూలి రెండుసార్లు కింద పడి లేచి వెళ్ళాడని ఒక సాక్షి.కాదని మరొక సాక్షి.పాపం అమాయకుడిని ఇన్నిసంవత్సరాలు  కోర్టులు పోలీసులు ప్రజలు ఏంటో బాధ పెట్టారు చివరికి నిర్దోషి ని విడిచిపెట్టారు.అసలు కారు నడిపిన మనిషి ఎవరూ అని తరవాత నిర్ణయం చేస్తారు కాబోలు.లేక రిమోట్ కంట్రొల్ ద్వారా ఎవరో నడిపారేమో అసలు పేవ్మెంట్ మీద పడుకున్న వాళ్ళ మీద జాలి ఏమిటండీ .కోట్లు మీద కోట్లు సంపాదించి ఎంతో కొంత దాన ధర్మాలు చేసి పరిహారం చేసుకునే నట శిఖామణిని చూసి జాలి పడాలి కాని  ఒక్క పైసా విలువలేని సామాన్యుల కోసం ఆలోచన ఎందుకు? 

No comments:

Post a Comment

My Blog Visitors