Sunday, September 28, 2014
Friday, September 26, 2014
కథ ల లో అశ్లీల పదాలు
ఇప్పుడు అంతర్జాలంలో కథ లు ఎన్నోవస్తున్నయి క థ అనే గ్రూప్ లో తరచు కథల గురించి చర్చజరుగుతూ ఉంటుంది. ఇది కాక అనేకమైన అంతర్జాల తెలుగు పత్రిక లు వెలువడు తున్నాయి .సారంగ ,వాకిలి కినిగేపత్రిక పుస్తకం .నెట్ ఇంకా ఎన్నో . ప్రింట్ మీడియా, టీవీ సినెమా లలో లాగా ఇంటర్నెట్ లో సెన్సార్ షిప్ లేదు;కథల్లో వాడుకలో ఉండె అశ్లీల పదాలు రాయచ్చా?వద్దా? మనం మాట్లాడే భాష లో సంభాషణ లు రాసినప్పుడు అసభ్యమైన బూతు పదాలు వాడె పాత్ర తో బూత్లు మాట్లాదించచ్చా?ఈ విషయాల ఫై తీవ్రమైన చర్చ లు జరుగుతున్నాయి ఇది ఒక సున్నితమైన సమస్య. రచయిత నిరంకుశుడు క్రియేటివ్ పర్సన్ .ఏమి కంట్రోల్స్ ఉండరాదని ఆశిస్థాడు. కాని పాశ్చాత్య సమాజాలలో లాగా బూతు పదాలు యధేచ్చ గా వాడె సందర్భం మన సమాజం లో ఇంకా వచ్చిందా?ఈ కథలు మనం నిర్భయం గా యువతీ యువకుల ముందు మన పిల్లల ముందు చదివి వినిపించ గలమా అయా కథల గ్రూపుల మరియు వెబ్ పత్రిక ల సంపాదకులు వారి వారి నిబంధనలు ఏర్పరచు కోవాలి ఇది ఆయా గ్రూపుల సభ్యుల అభిప్రాయాల బట్టి ఉండాలి.
Tuesday, September 23, 2014
Photo at tharanga
https://www.facebook.com/photo.php?fbid=10201726242707755&set=pcb.10201726245267819&type=1 my photo link with kasturi Murali krishna when he interviewed me for tharanga radio
Science Fiction
http://patrika.kinige.com/?p=2131. Link for My article in Telugu on science fiction in kinige patrika
Saturday, November 24, 2012
Kujudi Kosam review in Andhra Jyothi
భావన, ఊహ, సృజనాత్మక శక్తులు దాదాపు అంతరించిపోయి ఒక గాడిలో పడి యాంత్రికంగా చరిస్తున్న తెలుగు నవలా సాహిత్యంలో ఎన్.ఆర్. నంది తరువాత సైన్స్ ఫిక్షన్ విభాగంలో కొంతలో కొంత ఆ లోటును తీరుస్తూ వెలువడిన సైన్స్ ఫిక్షన్ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన 'కుజుడి కోసం'.
క్రీస్తు శకం 3264 సంవత్సరం లో భూమిపైన రెండుసార్లు అణుయుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన తర్వాత, భూమి నుంచి అన్ని దేశాల ప్రజలు ఇతర గ్రహాల్లోకి వలసపోయి నివసించే రోజుల్లో, భూమి మీదే నివసించే ఒక బయో మెడికల్ ఇంజనీర్ తన కలలో కనిపించిన ఒక కుజగ్రహ సుందరి ప్రేమను పొందాలనే ధ్యేయంతో కుజగ్రహానికి చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలే ఈ నవలకు మూలాధారం. ఆ తర్వాత కుజగ్రహంలోని మాంత్రికులకూ, మానవులకూ జరిగిన యుద్ధంలో అతను చిక్కుకోవడం దగ్గర్నుంచి తిరిగి అతను భూమిని చేరేవరకూ జరిగిన ఘటనలను ఆసక్తికరంగా నవలీకరించాడు రచయిత. అరవై రెండు అధ్యాయాలు ఈ నవలలో గతాన్నీ, భవిష్యత్తునూ మిళితం చేసి అద్భుతమైన ఫాంటసీని సాధించాడు. ఈ క్రమంలో రోబోలు, ఇంటర్ గెలాక్టిక్ నెట్ వంటి ఎన్నో సాంకేతిక అంశాలను సాధారణ పాఠకులకు అర్థం అయ్యేట్టు రాయడం ఈ నవల ప్రత్యేకత.
పునరుక్తులను కొంచెం ఎడిట్ చేసుకుని ఉంటే నవలలో మరింత 'బిగి' ఉండేది. అలాగే నవలలోని శాస్త్రీయతను మరికొంచెం సరళీకరించినా నవలా క్రమం ఒక గతిలో సాగిపోయేది. మొత్తం మీద చాలాకాలం తర్వాత వెలువడ్డ ఈ సైన్స్ ఫిక్షన్ నవల ఆ అభిరుచి గల పాఠకుల్ని విడవకుండా చదివిస్తుంది. అలాగే కుజగ్రహం గురించి శాస్త్రీయ వివరాలు తెలుసుకోవాలన్నవారు కూడా ఈ పుస్తకాన్ని చదవొచ్చు.
కుజుడి కోసం, డాక్టర్ చిత్తర్వు మధు
పేజీలు : 227, వెల : రూ. 150 for copies Navodaya book House

Friday, November 16, 2012
Science Fiction in Telugu language
తెలుగు లో సైన్సు ఫిక్షన్ తక్కువ అనే అభిప్రాయం వుండేది నాకు.యండమూరి,నేను కే ఆర్ కే మోహన్ , పురాణపండ రంగనాథ్ ,మహీధర నళీనీ మోహన్. నండూరి రామమోహన రావు మైనంపాటి భాస్కర్ ఇలాకొంతమందే సైన్సు రచనలు చేసారనే అభిప్రాయం తో ఉన్న నాకు తెలుగు విశ్వ విద్యాలయ లో పనిచేస్తున్న సుధాకర్ నాయుడు పంపిన తెలుగులో సైన్సు ఫిక్షన్ అనే సిద్ధాంత గ్రంధం అందింది.ఇది ఆయన
పీ హెచ్ డి కి సమర్పించిన పరిశోధనా గ్రంధం . తప్పక చదవండి .సుధాకరనాయుడు గారి కి నా అభినందనలు .
Subscribe to:
Posts (Atom)