Pages

Wednesday, November 25, 2015

Sameeksha in EEnaadu

ఊహా జగత్తు" పేరిట ఈరోజు ఈనాడు ఆదివారం అనుబంధంలో "నీలి ఆకుపచ్చ" పుస్తకంపై చంద్రకాంత్ గారు చేసిన సమీక్ష.
ఈ చక్కని సైన్స్ ఫిక్షన్‌లో నా పాత్ర కూడా కొంత ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. డా. మధు చిత్తర్వు గారికి ధన్యవాదాలు.
****
'నీలీ - ఆకుపచ్చ' అక్షర నిద్రలో పాఠకులు అనుభవించే ఓ రంగుల కల. గ్రహాలూ గ్రహాంతరవాసులూ వింతవింత శక్తులూ ప్రాణంపోసుకుని వచ్చి మనల్ని వూహా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. హనీ ఆమ్రపాలి అనే ప్రొఫెసరు అంగారక యాత్ర ముగించుకుని భూలోకానికి తిరిగొస్తాడు. ఇక్కడితో అసలు కథ మొదలవుతుంది. గ్రహాంతర మాంత్రికులు అతన్ని వెంటాడుతూనే ఉంటారు. కథలో మలుపులు ఏ త్రీడీ సినిమానో చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. స్పేస్ ఎలివేటర్లూ రోబోలూ ఒకవైపు, నేల మాళిగలూ సర్పబంధనాలూ మరొకవైపు - సంప్రదాయ సమాజాన్నీ భవిష్యత్తు నాలుగో సహస్రాబ్దినీ ముడిపెట్టి చేసిన రచన పాఠకుల్ని అలరిస్తుంది.
నీలీ-ఆకుపచ్చ; రచన: చిత్తర్వు మధు
పేజీలు: 204: వెల: రూ.140/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- చంద్రకాంత్

No comments:

Post a Comment

My Blog Visitors