Saturday, May 5, 2012
Review
- గోపాలం. కె.బి.
06/05/2012
TAGS:
ది ఎపిడమిక్ -
(నవల)
రచన: డా.చిత్తర్వు మధు,
వాహిని బుక్‌ట్రస్ట్,
విద్యానగర్,
హైదరాబాద్-44
పేజీలు: 233,
వెల: రూ.130/-
సైన్స్ ఫిక్షన్ రచనలు అరుదుగా రావడానికి కారణాలున్నాయి. రచయితకు ముందు సైన్సు గురించి మంచి అవగాహన ఉండాలి. అందులోనుంచి ఆసక్తికరమయిన కల్పన చేయగలగాలి. కథ చదివే వారికి, ఇలా జరుగుతుందేమోననిపించాలి. కల్పన మరీ హద్దులుదాటితే, అవి ఫిక్షన్ పోయి ఫాంటసీగా మారుతుంది. ఈ పద్ధతిలో కథలు, నవలలు రాసిన వారు, కాలంలో వెనక్కు, ముందుకు వెళ్లడం, గ్రహాంతర యానం లాంటి విషయాలలోనే చిక్కుకుని రాశారు. ఇప్పటికీ, ప్రపంచమంతటా ఈ రకం రచనలు వస్తూనే ఉన్నాయి.
వృత్తిపరంగా వైద్యులయిన చిత్తర్వు మధు, వరుసగా మూడు నవలలు రాశారు. అందులో ఇది మూడవది. పత్రికలో సీరియల్‌గా కూడా వచ్చింది. ఇందులోనూ గ్రహాంతర యానం ఉంది. కాలంలో వెనక్కు వెళ్లడమూ ఉంది. అయితే, రచయిత వైద్యుడు గనుక, బోలెడంత వైద్యం కూడా ఉంది. ఒక దుర్మార్గం డాక్టరు కాలంలో వెనక్కు విసిరివేయబడతాడు. అది మరీ వెనక్కుకాదు. అక్కడ మరి, వేరే గ్రహాలనుంచి నౌకలు దిగుతాయి. వాటిలోనుంచి వైరసును తెచ్చి, అతను తిరిగి ప్రస్తుతంలో అంటువ్యాధిని సృష్టిస్తాడు. అదే ‘ఎపిడమిక్!’
కథకు హంగులుగా, ఈ నవలలో అడవి జాతి మనుషులు, హీరో కాని హీరోకి ఒక అమ్మాయితో శృంగారం, పెళ్లీ, రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, కవిత్వం, మరమనుషులు, వరదలు, ప్రమాదాలు, పిల్లల మీద ప్రేమ, ఎన్ని అంశాలో! అడుగడుగునా ఉత్కంఠతో పేజీలు తిప్పుతారని, రచయిత తానే చెప్పేశారు. ఇక పాఠకుల పరిస్థితి వారికే వదిలేద్దాం! మరమనిషికి ప్రపంచంలోని భాషలన్నీ వస్తే ఆశ్చర్యంలేదు. కానీ పాతకాలం అడవి వారికి, మన ‘రావు’్భష అర్థమవుతుంది. ఫాంటసీ అంటే ఆలోచన మరీ స్వైరవిహారం చేయాలి. ఈ నవల్లో మాత్రం అంతా ఎక్స్‌పెక్టెడ్ లైన్స్‌లోనే సాగింది కథ! ఈ రకం నవలలు చదివే ఓపిక ఉంటే బాగానే ఉంది. సీరియల్‌గా వారంవారం కొంత చదవడం వేరు. నవలను ఒక్కసారి ఈ చివరనుంచి ఆ చివరకు చదవడం వేరు.
ఖర్చుకు ఓరిస్తే ఈ నవల, సినిమాగా బాగుంటుందేమో? అయినా ఇలాంటి ఆసుపత్రి సినిమా ఎవరు చూస్తారు?
గొప్ప నవలలే రావడం లేదు. మూడు నవలల మధ్యన మధు నవల వెరైటీగా ఉందన్నమాట మాత్రం సత్యం.
Related Article
విశ్వ ‘స్వప్న శకలం’లో కవిత్వ ప్రకాశం
హృదయంలో ‘విహారి’ంచే చిన్న కథలు
నిశితపరిశీలన నిండిన వ్యాసాలు
ఆత్మపరిశీలనకు తోడ్పడే ‘అపరాధ’ పరిశోధన
మంచి అన్నది కొంచెమైనా..
More Sharing ServicesShare
Add new comment
Your name
Subject
Comment *
Latest News
తక్కువ ధరకే బంగారం ఆశ చూపి రూ. 1.3 లక్షల దోపిడీ!
అంతర్రాష్ట్ర రిమాండ్ ఖైదీ పరారీ
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య
గడ్డి కేంద్రాల్లో ఇబ్బందులు రానివ్వొద్దు
విలువలతో కూడిన విద్యాబోధనే విద్యావాహిని లక్ష్యం
Click Here!
Click Here!
Click Here!Click Here!Click Here!
Most Read
Most Commented
రామోజీకి చుక్కెదురు
శ్రీవారి ఆలయంలోకి షిర్డీసాయి పాదుకలు!
సునీల్ పాత్ర కీలకం
పట్టు వదలని ముఖ్యమంత్రి
గృహప్రవేశం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment