హైదరాబాదు లో ఇప్పుడు బంద్ జరుగుతోంది.రాష్ట్ర విభజన కోసం ఆందోళనలు జరుగుతున్నాయి.ప్రజా ప్రతినిదులు రాజీనామాలు చేసారు. డిల్లీ లో కేంద్ర ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోవడం లేదు.ఈ అనిశిత పరిస్థితి ఎన్నాళ్ళు అని విసుగు గా వుంది.ఇది ఒక స్వాతoత్ర ఉద్యమం లాగా తయారయింది.నిజానికి ఇది అంతా భారత దేశం కదా...ఇది అంతా ఒకే రాష్ట్రం కదా..అయినా పరదేశ పాలన లో మగ్గుతున్న ప్రజల లా గా అందరు బాధ పడు తున్నారు. ఎన్నికలు మనకున్నాయి.రాజ్యాంగం మనకు ఉన్నది.కానీ ఏదో పరదేశపు పాలన లాగా దాని నుంచి విముక్తి కోసం పోరాటం అనీ భావనతెలంగాణా లో బలం గా వుంది.
అయితే హైదరాబాదు లో స్థిర పడిన ఆంధ్రులూ కోస్తా రాయలసీమ శ్రీకాకుళం నుంచి వచ్చి స్థిరా పడిన ప్రజలు అందరూఇది మన రాష్ట్రం అనే అనుకునే స్థిర పడ్డారు.హైదరాబాదు అద్భుతం గా వృద్ధి పొంది
తెలుగు సంస్కృతీ వైభవం వెలిగి పోతుందనే సమయం లో ఈ ప్రాంతీయ కలహాలు అపార్ధాలూ నాకు ఎంతో మనో వేదనని కలిగిస్తున్నాయి.దీని కి కల తప్పు ఒప్పులు నేను విశ్లేషించడం లేదు.ఈ పరిస్థితులు మారి మళ్ళీ తెలుగు వైభవం విశ్వం అంతా తన బావుటా ని ఎగర వేయాలని అందరూ ప్రేమ తో ఐకమత్యం గా వుండాలని
పక్క నే వున్న తమిళుల లాగా కన్నడిగుల లాగా మన సంస్కృతి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఒక తెలుగురచయిత గా కోరుకుంటున్నాను!