నా కవిత...
-------------------------------------------...
ఆలోచనలు నీలాకాశం లో
విహరించే శ్వేత పారావతాలు...
ఆదర్శాలు అధిరోహించలేని
ఉన్నత హిమ శిఖరాలు...
అనుభూతులు బతుకును
పులకింపచేసే పుష్ప మాలికా
పరిమళాలు...
జ్ఞాపకాలు శరదృతువు లో
రూపాలు మార్చుకునే
ధవళ మేఘాలు
పోరాటాలు
అకుంటిత
దీక్ష తో గళం ధరించిన
దీక్ష తో గళం ధరించిన
అగ్ని మాలలు
కవనాలు మనసు
విహరించే సుందర
పుష్ప వనాలు..
కవితలు నా హృదిని
వెన్నంటి వీడని వెతలు...
గీతాలు ఖాళీ
మందిరాలలో
ప్రతిధ్వనించే ప్రియ మధురహాసాలు
చూపులు దిగంతాల్లో ఉదయించే సూర్య బింబాలు
ఆశలు ఆరాటాలు స్మృతులు
పడి లేచిన సముద్రపుటలలు
ప్రియ భాషణాలు నిశబ్దం అయిన క్షణాలు
గుండె ని చీల్చిన క్రూరపు నిర్లక్ష్యాల
కత్తులు...
ఆ బాధలు మనసు నీ శరీరాన్నీ విధ్వంసం
చేసిన చిత్ర తూణీరాలు
అన్నిటినీ మరిచీ మరువక ప్రశాంతత లో
నెమరువేసేదే నా కవిత్వం ...
అందుకే నా భావాలు స్వేచ్చా విహంగాలు
నా అక్షరాలు సెల్ ఫోను లో మాట్లాడుతూ
చిరునవ్వులు నవ్వే ఆడ పిల్లలు...
(అవును నాకు తిలక్ అభిమాన కవి)