" శ్రీ రామ రాజ్యం మొదటి రోజే ఐ మాక్స్ థియేటర్ లో సెకండ్శో
కి వెళ్లి చూసేసాం.బాపు గారికి అంత అభిమానులం మా ఫ్యామిలీ అంతా.ముందు అద్భుత దృశ్యాలు పెద్ద తెర మీద రాముడు సీతా పుష్పక విమానం లో అయోధ్య కి రావడం చామంతి పూల వానా "జగదానంద
కారక" పాటా శ్రవణానందం గా నేత్రానందం గా హాలీవుడ్ సినిమాల రీతి లో "అదిరి పోయాయి."అయితే తరవాత సినిమా మరీ స్లో అయిందని పించింది.ఇళయ రాజా సంగీతం ముఖ్యం గా సింధు భైరవి
హిందోళం లో సృజించనవి పాటలు
బాగున్నాయి.అయితే అక్కడక్కడా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ లా తెలిసిపోతున్నాయి.ముఖ్యం గా లక్ష్మణుడు సీత ని
అడవి లో కి రధం లోతీసుకు పోతున్నప్పుడు అడవి అంతా బొమ్మల్లాగా వుంది.బాలకృష్ణ నటన కి చాల కష్ట పడ్డాడు అని అనిపించింది.నయనతార మౌనం గా కన్నీరు కారుస్తూ మన చేత కూడా కన్నీరు పెట్టించింది.ఇక లవకుశులు అంత యిమ్ప్రేసివ్ గా లేరు.నటీ నటుల ఉచ్చారణలు అక్కినేని వాల్మికి తప్ప అంతగా బాగు లేవు.సినిమా అంతా నిమ్మది గా నడిచినా హృదయం లో బాధ కలిగిస్తుంది.లవకుశులు
అయోధ్య లో ప్రజలకి లాగానే మనకి కన్నీరు తెప్పించారు.బ్రహ్మానందం తిప్పడి పాత్ర ఏమీ గుర్తుండేట్లు గాలేదు.ఆ నాటి లవకుశ చూసిన నాకు ఆ పాట లే నచ్చుతాయి.అయితే ఈనాటి సాఫ్ట్ వేర్ జనరేషన్ కి కొత్త గ్రాఫిక్స్ తో రాజా బ్యాక్గ్రౌండ్ సింఫనీ సంగీతం తో వున్న ఈ చిత్రం నచ్చుతోంది... ప్రసంసిస్తున్నారు...విజయం సాధిస్తుంది అని ఆశిద్దాం!