ఇప్పుడు అంతర్జాలంలో కథ లు ఎన్నోవస్తున్నయి క థ అనే గ్రూప్ లో తరచు కథల గురించి చర్చజరుగుతూ ఉంటుంది. ఇది కాక అనేకమైన అంతర్జాల తెలుగు పత్రిక లు వెలువడు తున్నాయి .సారంగ ,వాకిలి కినిగేపత్రిక పుస్తకం .నెట్ ఇంకా ఎన్నో . ప్రింట్ మీడియా, టీవీ సినెమా లలో లాగా ఇంటర్నెట్ లో సెన్సార్ షిప్ లేదు;కథల్లో వాడుకలో ఉండె అశ్లీల పదాలు రాయచ్చా?వద్దా? మనం మాట్లాడే భాష లో సంభాషణ లు రాసినప్పుడు అసభ్యమైన బూతు పదాలు వాడె పాత్ర తో బూత్లు మాట్లాదించచ్చా?ఈ విషయాల ఫై తీవ్రమైన చర్చ లు జరుగుతున్నాయి ఇది ఒక సున్నితమైన సమస్య. రచయిత నిరంకుశుడు క్రియేటివ్ పర్సన్ .ఏమి కంట్రోల్స్ ఉండరాదని ఆశిస్థాడు. కాని పాశ్చాత్య సమాజాలలో లాగా బూతు పదాలు యధేచ్చ గా వాడె సందర్భం మన సమాజం లో ఇంకా వచ్చిందా?ఈ కథలు మనం నిర్భయం గా యువతీ యువకుల ముందు మన పిల్లల ముందు చదివి వినిపించ గలమా అయా కథల గ్రూపుల మరియు వెబ్ పత్రిక ల సంపాదకులు వారి వారి నిబంధనలు ఏర్పరచు కోవాలి ఇది ఆయా గ్రూపుల సభ్యుల అభిప్రాయాల బట్టి ఉండాలి.