ఈ వేసవి భయంకరం గా వేడి గా క్రూరం గా ఉంది హైదరాబాద్ లో.మీరు ఇంకేక్కడినా చల్లటి దేశం లో ఉన్నారా ,అయితే నాకు చాల అసూయ గా ఉంది.ఈ ఎండల్లో ఏ సి లో కూర్చుని టి వీ చూడటం బయట ఏ సి కారు లో తిరుగుతూ హాస్పటల్ కీ హాస్పిటల్ కీ మధ్య ప్రయాణిస్తూ ...గ్రీష్మ తాపాన్ని భరిస్తున్నాను.ఐ పీ ఎల్ మాచిలు చూడటం బాగానే ఉన్నా ఉన్నా అవన్నీ ఫిక్సెడ్ అని తెలిసిన తరవాత ఆ త్రిల్ అంతా పోయింది.ఈ దేశం లో అంతా కరప్షన్ అవినీతి చక్రవర్తులు క్రికెట్ సినిమాలు రాజకీయాలు వైద్యం అన్ని చోట్ల అవినీతి .
ఈ సమయం లో ఆదివారం ఒక మంచి సినెమా చూడటం ఆనందాన్ని మిగిల్చింది. అది రన్ రామగోపాల వర్మ సినిమా . మీడియా మీద తీసిన కధ.దీనిలో అమితాబ్ బచన్ నటన చివరి సీన్ లో అద్భుతం గా వుంది.వర్మ దర్శకుడు గా ఒక జీనియస్ అతను కధ చెప్పే విధం ప్రత్యేకం గా ఉంటుంది.రన్ తప్పక తప్పక చూడండి. సి డీ తెచుకుని అయినా సరే!
Sunday, April 25, 2010
Subscribe to:
Posts (Atom)