Saturday, October 10, 2009
హైడ్ virus
నా నవల హైడ్ వైరస్ నవ్య వార పత్రిక లో సీరియల్ గా ప్రచురింప బడి క్రిందటి వారం తో ముగిసింది.ఈ నవల అయ్పోయిన తరవాత నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి .నవల చాలా బాగుందనీ ఇంకా సైన్సు ఫిక్షన్ రాయమనీ..పాఠకుల నుంచి వుత్తరాలు రాలేదని బాధ పడిన నాకు ఈ ఫోనులు ఎంతో సంతోషం కలిగించాయి.ఇది వరకు రాసిన బై బై పొలోనియా ఐ సి సి యు నవల ల గురించి కూడా ఛాలా మంది అడిగారు.ఈ నవలలు చదివితే హైడ్ వైరస్ నవల ఇంకా బాగా అర్ధం అవుతుంది. ఇవి వాహినీ పబ్లిషర్స్ విద్యా నగర్ హైదరాబాద్ విశాలాంధ్ర పబ్లిషర్స్ నవోదయ పబ్లిషర్స్ వద్దా లభిస్తాయి .కొన్ని ప్రతులు నా దగ్గర వున్నాయి .నాకు ౩౦౦ రుపీస్ చెక్ గానీ ఎం ఓ గానీ పంపితే నేను పంపగలను. త్వరలో హైడ్ వైరస్ కూడా నవల గా వస్తుంది. ధన్యవాదాల తో మధు
Subscribe to:
Posts (Atom)